Air traffic close call at reagan airport

Air-Traffic Close Call at Reagan Airport,airportlandingplanes, america ronaldreagon airport, aircrashes, landingflights, airport runways, jetflights, airtraffic control tower

Air-Traffic Close Call at Reagan Airport

Airport.gif

Posted: 08/03/2012 10:45 AM IST
Air traffic close call at reagan airport

Air-Traffic Close Call at Reagan Airport

మరణం అంచుల వరకు వెళ్లిన వారు ఎలా ఉంటారు?  కొద్ది సెకన్లలో  మరణం వారి కళ్ళ ముందు నుంచి వెళ్లితే ఎలా ఉంటుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 192 మంది ఒకేసారి  మరణం అంచుల వరకు వెళ్లి.. వచ్చారు. ఆ 192 మంది ఒక్కసారిగా ఊపిరి పిల్చుకున్నారు. అసలు విషయం ఏమిటంటే  అసలే వాతావరణం బాగాలేదు. విమానాశ్రయంలోని రెండు రన్‌వేల నుంచి రెండు జెట్ విమానాలు పైకెగిరాయి. మరో జెట్ విమానం ల్యాండ్ కావడానికి అటువైపుగా వస్తోంది. మూడు విమానాలూ గంటకు 500 కిలోమీటర్లకుపైగా వేగంతో ఉన్నాయి. వాటి మధ్య దూరం రెండు కిలోమీటర్లు.. అంటే, అవి ఢీ కొనడానికి పట్టే సమయం కేవలం 12 సెకండ్లు..! అటు నుంచి రెండు విమానాలు.. ఇటు నుంచి మరో విమానం సర్రు సర్రున దూసుకు వస్తున్నాయి. చివరి క్షణంలో ప్రమాదాన్ని పసిగట్టిన ట్రాఫిక్ కంట్రోల్ టవర్ సిబ్బంది.. వెంటనే మరోదిక్కుకు మరల్చాలని ల్యాండింగ్‌కు వస్తున్న విమానం పైలట్‌ను ఆదేశించారు. పైలట్ సర్రున విమానాన్ని మరోదిక్కుకు తిప్పారు.

అయినా.. ఆ విమానాల నుంచి కేవలం 180 మీటర్ల దూరం నుంచి విమానం దూసుకుపోయింది. లేకపోతే.. ఏం జరుగనుందో ఆలోచించేలోగానే.. మూడు విమానాలూ ఢీకొని.. వాటిలో ప్రయాణిస్తున్న 192 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అయితే, ల్యాండింగ్‌కు, టేకాఫ్‌కు పెద్ద సంఖ్యలో విమానాలు వేచి ఉండడంతో పాటు.. వాతావరణం బాగా లేక రన్‌వేల దిశను మార్చాల్సి రావడం వల్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు తికమక పడినట్లు విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతున్నట్లు తెలిపారు. గంటన్నర పాటు టెక్సాస్ విమానాశ్రయం మూసివేత..!శాన్ ఆంటోనియో: బాంబు పెట్టామన్న బెదిరింపుతో అమెరికాలోని టెక్సాస్‌లోని విమానాశ్రయాన్ని ఏకంగా గంటన్నరపాటు మూసేశారు! విమానాశ్రయంలో ఉన్న రెండువేల మందిని హుటాహుటిన అక్కడ నుంచి తరలించారు.   ఓ ఆగంతుకుడు ఒకరు ఫోన్ చేసి, శాన్ ఆంటోనియా విమానాశ్రయంలోని మూడు మూట(లగేజీ)ల్లో బాంబులు పెట్టినట్టు బెదిరించారు.

Air-Traffic Close Call at Reagan Airport

వెంటనే అప్రమత్తమై న అధికారులు.. విమనాశ్రయంలో దిగేందుకు విమానాలను అనుమతించలేదు. అప్పటికే దిగిన విమానాల్లోని ప్రయాణికులను త్వరగా బయటకు వెళ్లాలని హెచ్చరించారు. మొత్తంగా ఎయిర్‌పోర్టులో ఉన్న రెండు వేల మందిని బస్సుల్లో విమానాశ్ర యం వెలుపలకు పంపేశారు. విమానాశ్రయానికి వెళ్లే దారులను మూసేశారు.అగ్నిమాపక విభాగం అధికారులు, పోలీసులు, పేలుడు పదార్థాల నిపుణుల బృందం రం గంలోకి దిగి.. విమానాశ్రయంలో అణువణువూ గాలించారు. గంటన్నర తరువాత బాంబు బెదిరింపు ఉత్తదేనని తేలిపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sister gives brother an irreplaceable rakhi gift one of her kidneys
Ttd won best cleaning award  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles