Ttd won best cleaning award

ttd won best cleaning award.png

Posted: 08/02/2012 08:26 PM IST
Ttd won best cleaning award

ttdఈ మధ్య కాలంలో టీటీడీ గురించి ఏ పేపర్ లోనైనా గొప్పగా  రాసినట్లు మీరు చూశారా ? ఈ మధ్య కాలంలో  అలాంటి లేదు. కానీ రేపు మాత్రం టీటీటీ గురించి కాస్తో కూస్తో గొప్పగా రాస్తారు . ఎందుకంటే  టీటీడీకి ఏడుకొండలపై పరిశుభ్రతకు ఏకంగా అంతర్జాతీయ పురస్కారం దక్కింది. అవును అర్థం పర్థంలేని నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పుడూ అభాసు పాలవుతున్న టీటీడీకి  గొప్ప ఊరట లభించింది.  కలియుగ వైకుంఠం తిరుమలకు నిత్యం 60 వేల మందికి తగ్గకుండా భక్తులు వస్తుంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఈసంఖ్య లక్షను దాటేస్తుంది.

అయినా.. ఏడుకొండలపై ఎప్పుడూ క్లీన్‌ అండ్‌ గ్రీనే. ఆ పరిశుభ్రతే ఇప్పుడు టీటీడీకి గుర్తింపు తెచ్చిపెట్టింది.వ్యర్థ పదార్థాల తొలగింపు, వాతావరణ కాలుష్య నియంత్రణ అంశంపై ఓ అంతర్జాతీయ సంస్థ మైసూరులో సదస్సు నిర్వహించింది. పలు నగరాలు, మున్సిపాలిటీల నుంచి ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే.. టీటీడీకి ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. నిత్యం వేల మంది వస్తున్నా.. పరిశుభ్రత పాటించి.. యాత్రికుల పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నారని సదస్సు మెచ్చుకుంది. ఇందుకు గాను ప్రత్యేక పురస్కారాన్ని అందజేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. అంతర్జాతీయ సంస్థ నుంచి లభించిన అవార్డు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ అవార్డుతో మరింత బాగా పనిచేస్తారో లేక ఎలాగు అవార్డు వచ్చింది కదా అని ఉన్నది వదిలేస్తారో  చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Air traffic close call at reagan airport
Is anna team mulling a political role  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles