Planning commission 2 toilets renovates at rs 35 lakh

Planning Commission, Rs 35 lakhs, hi-tech toilets, smart card, selective users

Planning Commission spent Rs 35 lakhs on hi-tech toilets, issued 60 smart cards to selective users

Planning commission 2 toilets renovates at Rs 35 lakh.gif

Posted: 06/06/2012 03:45 PM IST
Planning commission 2 toilets renovates at rs 35 lakh

Planning-commissionపిసినారితనానికి, పొదుపు సూచనలకు పేరుగాం చిన మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా సారథ్యంలోని ప్రణాళికా సంఘం తన విషయంలో మాత్రం హంగూ ఆర్భాటాలకు పెద్దపీట వేసింది. ప్రభుత్వ ప్రాజెక్టులకు నిధుల ఆమోదంలో సవాలక్ష కొర్రీలుపెట్టే ఈ సంస్థ సొంత అవసరాల పేరిట ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేసింది.

దేశంలో రోజూ 28 రూపాయలకన్నా ఎక్కువ ఖర్చు చేసే వారు పేదలు కాదం టూ దారిద్య్రరేఖకు కొత్త నిర్వచనమిచ్చి ఇప్పటికే అపఖ్యాతి మూటగట్టుకున్న ప్రణాళికా సంఘం ఢిల్లీలోని తన కార్యాలయం ‘యోజనా భవన్’లో ఉన్న రెండు మరుగుదొడ్ల గదుల ఆధునీకరణకు ఏకంగా రూ. 35 లక్షలు ఖర్చుపెట్టింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మించిన ఆధునిక హంగులున్న మరుగుదొడ్ల తరహాలో వీటిని నిర్మించింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా సుభాష్ అగర్వాల్ అనే సామాజిక కార్యకర్త ఈ విషయాన్ని బయటపెట్టారు. టాయిలెట్స్ ఆధునీకరణకు రూ. 30,00,305 ఖర్చవగా వాటిలోకి అధికారులు తప్ప ఇంకెవరూ వెళ్లేందుకు వీల్లేకుండా చూసేందుకు మరో రూ. 5,19,426 ఖర్చుపెట్టి డోర్ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.

దీనికోసం 60 మంది అధికారులకు స్మార్ట్ కార్డులు జారీ చేశారు. అలాగే ఈ ఖర్చుకు అదనంగా మరుగుదొడ్లకు వెళ్లే దారిలో సీసీటీవీ కెమెరాలను కూడా అమర్చాలని ప్రణాళికా సంఘం నిర్ణయించింది. దీనికి వ్యయ అంచనాలు తెలపాల్సిందిగా కేంద్ర ప్రజాపనుల విభా గం అధికారులను కోరింది. అహ్లూవాలియా విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఖర్చుచేస్తారనే విమర్శలు కూడా గతంలో వెల్లువెత్తాయి. 2011 మే నుంచి అక్టోబర్ వరకు ఆయన విదేశీ ప్రయాణ ఖర్చు రూ. 2.34 కోట్లుగా తేలిందని ఆర్టీఐ కింద వెల్లడైన వివరాలను ఉటంకిస్తూ ఓ పత్రిక ప్రచురించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Muslim girl can marry at 15 if she attains pubertydelhi high court
Harika and keratam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles