Cbi remand report unveils illegal deviation

CBI remand report unveils illegal deviation in Vanpic project. Exaggerated compensation given to land owners.

CBI remand report unveils illegal deviation in Vanpic project. Exaggerated compensation given to land owners.

CBI remand report unveils illegal deviation.gif

Posted: 05/28/2012 09:44 PM IST
Cbi remand report unveils illegal deviation

cbiవైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో వచ్చినవన్నీ లంచాలేనని సిబిఐ పేర్కొంది. వైయస్ జగన్ రిమాండ్ రిపోర్టులో ఆ విషయాన్ని సిబిఐ స్పష్టంగా చెప్పింది. వైయస్ జగన్ కంపెనీల్లో లంచాలను పెట్టుబడులుగా పెట్టడానికి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పూర్తిగా సహకరించారని సిబిఐ ఆరోపించింది. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందాయని చెప్పింది.

వైఎస్‌ ఒత్తిడివల్లే జగన సంస్థల్లో పెట్టుబడులు పెట్టామని నిమ్మగడ్డ ప్రసాద్‌ వెల్లడించారని, జగన్‌ పెట్టుబడిదారులను మోసం చేశారని సీబీఐ నివేదికలో పేర్కొంది. కోల్‌కతా, ముంబయికి చెందిన బ్రీఫ్‌కేస్‌ కంపెనీల నుంచి జగన్‌ సంస్థల్లోకి 100 కోట్లు వచ్చాయని, వైఎస్‌పై ఒత్తిడి తెచ్చినందువల్లే జగన్‌ నిబంధనలకు విరుద్ధంగా సాక్షిలో ప్రకటనలు సేకరించారని సీబీఐ రిపోర్టులో పేర్కొంది. జగతి ఏర్పాటుకు వాస్తవ ఖర్చులను దాచిపెట్టి ఎక్కువ ఖర్చులను చూపారని, కార్మెల్‌లో రూ. 23 కోట్లు, జగతిలో రూ. 45 కోట్లు పెన్నా ప్రతాపరెడ్డి పెట్టుబడి పెట్టారని ఈ నివేదికలో పేర్కొంది. పెన్నా సిమెంట్స్‌కు సున్నపురాయి గనులు, హోటల్‌ నిర్మాణానికి నిబంధనలు సడలించడం జరిగిందని, అంతర్రాష్ట జల ఒప్పందాలు ఉల్లంఘించి నదీ జలాల వినియోగింపునకు అనుమతిచ్చినట్లు సీబీఐ నివేదికలో పేర్కొంది. దాల్మియా సంస్థ రఘురాం సిమెంట్స్‌లో రూ. 90 కోట్లు పెట్టుబడి పెట్టగా, దాల్మియాకు సున్నపురాయి గనులు, నదీ జలాల అనుమతిచ్చారని, పెన్నా, ఇండియా, దాల్మియా సిమెంట్‌ కంపెనీలకు అక్రమంగా లబ్ధి కలిగించారని ఈ నివేదిక వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu naidu comments on jagan ysr congress party
Jagan reddy is now prisoner 6093  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles