New service gives parents control over kids mobile use

Bemilo, Vodafone, app, mobile, AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business

A new mobile service will soon give parents control over their children's cellphone use.

New service gives parents control over kids mobile use.gif

Posted: 05/23/2012 05:16 PM IST
New service gives parents control over kids mobile use

Cell-phoneటీనేజ్‌లో ఉన్న పిల్లలు అస్తమానూ ఫోన్లో మాట్లాడుతుంటారు. 'ఎవరితో' అని ప్రశ్నిస్తే 'ఫ్రెండ్‌తో' అని చెప్పి ఊరుకుంటారు. వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో అని తల్లిదండ్రులకు బెంగ. బ్రిటన్‌కు చెందిన బెమిలో అనే సెల్‌ఫోన్ కంపెనీ ఈ బెంగలన్నింటినీ తీర్చేసే సర్వీస్ అందిస్తానంటోంది. 8-16 ఏళ్ల మధ్య పిల్లలకు ఈ సర్వీసులను ఆ సంస్థ ఆఫర్ చేస్తోంది. ఈ సర్వీస్ ఉన్న ఫోన్లను పిల్లలకు ఇస్తే.. ఫోన్ వినియోగంపై తల్లిదండ్రుల నియంత్రణ ఉంటుంది.

వారు ఎవరితో మాట్లాడొచ్చు, ఎవరికి మెసేజ్‌లు పంపొచ్చు వంటి విషయాలను కంట్రోల్ చేయవచ్చు. అవసరమనుకుంటే పిల్లల ఫోన్లను స్విచాఫ్ చేసే అవకాశం కూడా తల్లిదండ్రులకు ఉంటుంది. ఈ సర్వీసు కావాలనుకున్న వారు బెమిలో వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆప్షన్లను సెట్ చేయడం ద్వారా పిల్లల ఫోన్లను నియంత్రించే వీలుంటుంది.

పిల్లలు కొత్తగా ఏదైనా నెంబర్‌ను తమ కాంటాక్ట్ లిస్టులో చేర్చుకోవాలన్నా.. తల్లిదండ్రులు సైట్‌లో అనుమతించాల్సిందే. ఆ ఫోన్‌కి వచ్చే, ఆ ఫోన్ నుంచి వెళ్లే సూక్ష్మసందేశాలన్నింటినీ పేరెంట్స్ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. తమ ఫోన్‌కి వచ్చిన ఎస్సెమ్మెస్‌లను పిల్లలు డిలీట్ చేసినా సరే.. అవి వెబ్‌సైట్‌లో కనిపిస్తాయి. టైమర్ ద్వారా నిర్ణీత వేళలను సెట్‌చేస్తే, ఆ సమయంలో ఎంత ప్రయత్నించినా ఫోన్ ఆన్‌కాదు. మన దేశంలో ఇలాంటి సర్వీసులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysrs brother resigns from congress
Indian teenagers shortlisted for google science fair  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles