Stop the olympic games

Stop the Olympic Games,Olympic Games were held in Olympia, Greece,Unlike ancient Greece, modern nations have not stopped

Stop the Olympic Games

Stop.gif

Posted: 04/11/2012 01:11 PM IST
Stop the olympic games

Stop the Olympic Games

ప్రపంచ క్రీడలకు తలమానికం ఒలింపిక్స్. అతి పెద్ద క్రీడా ఈవెంట్ కూడా ఇదే. దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ పాల్గొనే ఏకైక క్రీడోత్సవమైన ఒలింపిక్స్ పుట్టినిల్లు గ్రీస్‌లో ఇప్పుడు క్రీడలకు గ్రహణం పట్టింది. ఆర్థిక మాంద్యం పేరుతో క్రీడా రంగానికి బడ్జెట్‌లో భారీగా కోత పెట్టడం చివరికి అన్ని రకాల పోటీలకు తెరదించే పరిస్థితిని కల్పించింది. దేశ వ్యాప్తంగా అన్ని స్థాయిల్లోనూ పోటీలు, టోర్నమెంట్లు, సిరీస్‌లను రద్దు చేస్తున్నట్టు గ్రీస్ అథ్లెటిక్ సమాఖ్య ప్రకటించడం ఈ సంక్షోభానికి పరాకాష్ట. మే 12, 13 దేశాల్లో దేశ వ్యాప్తంగా వివిధ నగరాలు,
పట్టణాల్లో జరగాల్సిన ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్‌షిప్‌ను కూడా అధికారులు రద్దు చేశారు. క్రీడా ప్రాంగణాల్లో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు, ఆధునీకరణ పనులను పక్కకు ఉంచితే, వాటి నిర్వహణకు కూడా బడ్జెట్ కేటాయింపులు లేవు. గ్రీస్ అథ్లెటిక్ సమాఖ్య (జిఎఎఫ్)కు ఏటా తక్కువలో తక్కువ 8.7 మిలియన్ డాలర్లు అవసరమవుతాయి.

కానీ, వరుసగా మూడో ఏడాది కూడా 2.7 మిలియన్ డాలర్ల కోత పడింది. బడ్జెట్‌లో కేటాయించిన మొత్తాలు సైతం చేతికి అందకపోవడంతో జిఎఎఫ్ గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నది. గత్యంతరం లేకే దేశంలో అన్ని స్థాయిల పోటీలను రద్దు చేసినట్టు సమాఖ్య అధ్యక్షుడు వాసిలిస్ సెవాస్టిస్ అంటున్నాడు. కోచ్‌లకు, క్రీడా సమాగ్రిని సరఫరా చేసిన వివిధ సంస్థలకు ఏళ్ల తరబడి చెల్లింపులు జరగడం లేదని వాపోతున్నాడు. అతని మాటలు అక్షర సత్యాలని గ్రీక్ క్రీడారంగ దుస్థితిని చూస్తే స్పష్టమవుతుంది.

ఒక దేశంలో అన్ని రకాల క్రీడా పోటీలను రద్దు చేయడం ప్రపంచం చరిత్రలోనే ఇది మొదటిసారి. అయితే, ఈ పరిస్థితి కేవలం గ్రీస్‌కు మాత్రమే పరిమితమైందని, భవిష్యత్తులో మరే ఇతర దేశానికీ ఈ స్థితి రాదని అనుకోవడానికి వీలులేదు. ‘పెట్టుబడి’, ‘ఉత్పత్తి’ మధ్య ఊగిసలాడుతూ, ఖర్చుచేసే ప్రతి రూపాయికీ లాభనష్టాలను వెతుక్కునే నేటి సమాజంలో క్రీడలపై కోట్లకు కోట్లు కుమ్మరించడం అవివేకమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సాకర్, క్రికెట్ వంటి ఒకటిరెండింటిని మినహాయిస్తే మిగతా ఏ క్రీడా పోటీలకూ ప్రజలు బ్రహ్మరథం పట్టడం లేదు. టోర్నమెంట్ నిర్వహణకు అవుతున్న ఖర్చులో కనీసం సగం కూడా టికెట్లు, స్పాన్సర్‌షిప్‌లు, అండార్స్‌మెంట్లు, ప్రసార హక్కులు వంటి అన్ని రూపాల్లో కలిపినా వసూలు కావడం లేదు. క్రీడలకు గ్రహణం పట్టడానికి ఇదే ప్రధాన కారణం.

క్రీడలకు కేటాయింపులు క్రమంగా తగ్గుముఖం పట్టడం, ఒకటిరెండు ఆటల మినహా మిగతా వాటిని పట్టించుకోకపోవడం నేడు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో కనిపిస్తున్న కఠోర సత్యం. చాలా కాలం క్రితమే వ్యాపార ధోరణులు చొచ్చుకురావడంతో క్రీడా రంగ పతనం ఆరంభమైంది. స్పాన్సర్‌షిప్స్ అందించే బహుళజాతి సంస్థల ప్రయోజానాలకు అడుగుమడుగులొత్తే ప్రక్రియ క్రమంగా వేళ్లూనుకుంటున్నది. క్రీడా సమాఖ్యలు వ్యాపార సంస్థలుగా మారిపోతున్నాయి. కాసులు రాల్చే ఆటలకే ఇప్పుడు పాధాన్యం. ప్రమాణాలు మట్టికొట్టుకుపోతున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. ప్రభుత్వాల ఉదాసీనత క్రీడా రంగానికి శాపంగా మారింది. ప్రతిభకు, సామర్థ్యానికి మట్టిపాతర వేస్తున్నది. నిధులు రాల్చకుండా క్రీడాభివృద్ధి గురించి ఎన్ని మాటలు చెప్పినా వృథానే. ప్రోత్సహించకుండా అద్భుతాలు జరగాలనుకోవడం అత్యాశే. గ్రీస్ విషయంలో ఇదే జరిగింది.

మిగతా దేశాలూ ఇదే దారిని అనుసరిస్తున్నాయి. ఇప్పటికే సాంప్రదాయ క్రీడలెన్నో కాలగర్భంలో కలిసిపోయాయి. రానున్న తరాల వారికి సాకర్, క్రికెట్ వంటి ఒకటిరెండు ఆటలు మినహా మిగతావి చరిత్ర పుటల్లో తప్ప వాస్తవంగా కనిపించని ప్రమాదం పొంచివుంది. ఆరోగ్యవంతమైన సమాజానికి క్రీడలే పునాది అన్న సత్యాన్ని గ్రహించకపోతే క్రీడలకు పట్టిన గ్రహణం ఎన్నటికీ వీడదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anuj tikku gets clean chit in fathers murder case
Football games  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles