పోటీకి దిగిన ప్రతిసారీ అద్భుతాలు సృష్టించే చాలా మంది ఫుట్‌బాల్ ఆటగాళ్లు నటనలోనూ గొప్పవాళ్లే. ఆస్కార్ అవార్డు స్థాయిలో వారు మైదానంలో నటించేస్తుంటారు. అవసరం లేకపోయినా ‘డైవ్’ చేస్తారు. ప్రత్యర్థి తనకు ఢీకొన్నా, లేకపోయినా పెద్ద దెబ్బతగిలినట్టు కింద పడి గిలగిల కొట్టుకుంటారు. బాధతో అల్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తారు. డైవ్ చేసినా, ప్రత్యర్థి ఆటగాడు లేదా ఆటగాళ్ల వల్ల గాయపడినా తమ జట్టుకు ‘పెనాల్టీ’ లభిస్తుందన్న ఆశే వారితో అసాధారణ నటన చేయిస్తుందని క్వీన్స్లాండ్ యూనివర్శిటీకి చెందిన రోబీ విల్సన్ పరిశోధన స్పష్టం చేస్తున్నది.
స్పెయిన్, జర్మనీ, నెదర్లాండ్స్, ఇటలీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా దేశాల్లో లీగ్ పోటీలకు సంబంధించి 60 మ్యాచ్‌లను ఆమెను క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ మ్యాచ్‌లలో ఆటగాళ్లు డైవ్ చేసిన లేదా కిందపడి అల్లాడిపోయిన సంఘటనలు 2,803 ఉన్నాయి.
వీటిలో కేవలం 169 మాత్రమే నిజమైన డైవ్‌లు లేదా గాయపడిన సంఘటనలని రోబీ తేల్చిచెప్పింది. మిగతా 2,633 సంఘటనల్లో ఆటగాళ్లు నటించారే తప్ప నిజానికి కిందపడాల్సిన అవసరంగానీ, గిలగిల కొట్టుకోవాల్సిన ఆగత్యంగానీ లేవని రోబీ సాక్ష్యాధారాలతో నిరూపించింది. మ్యాచ్‌లు డ్రాగా ముగుస్తున్నప్పుడు లేదా తమ జట్టు ఓడడం ఖాయంగా కనిపించినప్పుడు ఫుట్‌బాలర్లు ఆటకు బదులు నటనపైనే ఆధారపడతారని ఆమె నివేదిక పేర్కొంటున్నది. ఇదే సూత్రం మిగతా క్రీడలకూ వర్తించే అవకాశం లేకపోలేదు.
ప్రత్యక్షంగానో లేదా టీవీలోనో మ్యాచ్‌ని చూస్తూ, కిందపడి బాధతో విలవిల్లాడే ఆటగాళ్లను చూసి జాలిపడని వాళ్లు ఉండరు. వీటిలో ముప్పాతిక సంఘటనలు కేవలం కల్పితాలని, ఆటగాళ్లు నటిస్తున్నారని తెలిసిన తర్వాత సగటు అభిమాని తెగబాధపడిపోతాడేమో! మైదానం నలువైపులా ఉంచిన లెక్కకు మించిన కెమేరాలతో మ్యాచ్‌లను కవర్ చేస్తూ, ప్రతి చిన్న కదలికను కూడా రికార్డు చేస్తున్న ఈ రోజుల్లో కెమేరా కంటికి కూడా చిక్కకుండా అంతా నిజమేనని నమ్మించే స్థాయిలో నటించడం సులభం కాదు. ఈ ఆటగాళ్లకు ఆస్కార్‌ను మించిన అవార్డును కనిపెట్టి మరీ ఇవ్వక తప్పదు!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more