Pranalu theesina pakodi

pranalu theesina pakodi, karimnagar distict, Anil, Rawodi chetar, Auto travel, Police stations

pranalu theesina pakodi

pakodi.gif

Posted: 03/10/2012 12:09 PM IST
Pranalu theesina pakodi

pranalu  theesina pakodi

రౌడీషీటర్ ఉన్మాద దాడిలో మృతిచెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ గొడవకు పకోడి తిన్న తర్వాత బిల్లు చెల్లింపే కారణమని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన పూర్తి వివరాలు... కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరుకు చెందిన కొమ్ము శ్యాంసన్ కుమారుడు అనిల్(25) కుటుంబం జిల్లా కేంద్రంలోని కిసాన్‌నగర్‌లోని చింత్‌లో స్థిరపడింది. జులాయిగా తిరిగే అనిల్‌పై ఇప్పటికే పలు ఠాణాల్లో కేసులు నమోదై ఉన్నాయి. నేరాల తీవ్రత ఎక్కువవడంతో అతనిపై రౌడీషీట్ కూడాతెరిచారు. హోలీ ఆడిన తర్వాత కిసాన్‌నగర్‌కే చెందిన స్నేహితుడైన కోల్ల శ్రీనివాస్‌తో తీగలగుట్టపల్లికి వచ్చారు. అక్కడ మద్యం తాగుతూ పకోడి తిన్నారు. పకోడి బిల్లు రూ.30 చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో శ్రీనివాస్‌పై అనిల్ దాడి చేశాడు. బావమరుదులైన జెల్లోజి రాజు, నరేశ్‌కు శ్రీనివాస్ సమాచారం ఇచ్చాడు. మరో ముగ్గురు స్నేహితులతో కలిసి వీరంతా చింతల్‌కు రాత్రి 11 గంటల సమయంలో చేరుకున్నారు. గొడవపై అనిల్‌ను నిలదీశారు.

బలవంతంగా అనిల్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు ఆటోలో ఎక్కించారు. కొద్ది దూరం వెళ్లగానే దాహమవుతోందని, మంచనీళ్లు తాగుతాననడంతో అనిల్‌ను కిందికి దింపారు. అంతే ఒక్కసారిగా అనిల్ వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా ఆరుగురిపై దాడిచేశాడు. ఈ ఘటనలో సోదరులైన రాజు, నరేశ్ గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన కోల్ల శ్రీనివాస్, జనగామ కమల్, బత్తిని శశిధర్, పసుల విజయ్‌లను సాయిరాం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ జనగామ కమల్ ఉదయం మృతిచెందాడు. చికిత్స పొందుతున్న మిగతా ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉంది.

అనిల్‌ను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని డీఎస్పీ చక్రవర్తి తెలిపారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని జిల్లా ఎస్పీ రవీందర్ తెలిపారు. రాజు, నరేశ్, కమల్ కుటుంబ సభ్యులు, బంధువులు, కాలనీవాసులు రౌడీషీటర్ అనిల్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. అతడిని వదిలేస్తే మరెంతో మంది ప్రాణాలు తీస్తాడన్నారు. అనిల్‌ను మాకైనా అప్పగించాలంటూ మృతదేహాలతో ఆందోళనకు దిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Motkupalli attacked in own constituency
Sonia gandhi suffering from fever  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles