State govt presents silk clothes to srisailam mallanna through ministers

state govt presents silk clothes to srisailam mallanna through ministers, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

srisailam-1.gif

Posted: 02/20/2012 11:00 AM IST
State govt presents silk clothes to srisailam mallanna through ministers

ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసి ఉన్నాయి. అత్యంత పురాతనమైనది, భ్రమరాంబా మల్లికార్జునులు కొలువుతీరిన రాష్ట్రంలోని సుప్రసిద్ధ శ్రీశైలం దేవాలయం "హరహర మహాదేవ శంభో శంకర" అని భక్తులు భక్తిపారవశ్యంతో పిలిచే పిలుపులతో మారుమోగుతోంది. చాలా దూరం నుంచి శ్రీశైలానికి కాలినడకన వచ్చేవారు కూడా లక్షల్లో ఉంటారు. ఈ రోజంతా ఉపవాసముండి రాత్రికి జాగరణ చేస్తారు. లింగోద్భవ కాలంలో శివదర్శనం చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడికొచ్చే భక్తులు ఒకరినొకరు పరిచయం లేనివారు కూడా శివా అని సంబోధించుకుంటారు.

నిన్న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫునుంచి దేవాదాయ శాఖా మంత్రి సి.రామచంద్రయ్య, న్యాయశాఖా మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి భ్రమరాంబిక అమ్మవారు, మల్లిఖార్జున స్వాములకు పట్టు వస్త్రాలను బహూకరించారు. ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లోకి మోసుకుని వచ్చి తమ భక్తిని చాటారు. ఈరోజు రాత్రి ఆలయంలో మహాన్యాసంతో కూడిన ఏకాదశ రుద్రాభిషేకం జరుపుతారు. రాత్రి 12 గంటలకు భ్రమరాంబా మల్లిఖార్జునుల వివాహ మహోత్సవం జరుపుతారు.

ప్రతి నెలా కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశినాడు మాస శివరాత్రి వస్తుంది. ఈ రోజు మాఘమాసంలో వచ్చే శివరాత్రి. దీన్నే మహాశివరాత్రి. అంటారు. ఈసారి శివునికి ఇష్టమైన సోమవారం నాడు మహా శివరాత్రి రావటంతో భక్తులంతా భక్తి శ్రద్ధలతో విశేష పూజలను చేస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Air travellers are subjected to inconvenience due to cancellation and belated service
Umpires mistakes too in cricket matches  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles