Garbage rolls

garbage rolls.GIF

Posted: 11/29/2011 09:39 AM IST
Garbage rolls

garbageనగర ప్రజలు జర జాగ్రత్తగా ఉండండి... ఎందుకంటే మీరు నిత్యం ఇంట్లో ఏదో పని చేస్తూనే ఉంటారు. దాని నుండి ఏదో ఒక రకమైన చెత్త మనకు తయారు అవుతుంది. ఆహార పదార్ధాలు మిగిలిపోయినప్పుడు కూడా చెత్త తయారవుతుంది. మరి ఈ చెత్తను కొందరు ఇంటి ముందు ఉన్న రోడ్డు మీదనో లేక నగర ప్రజల కోసం ఏర్పాటు చేసిన చెత్తకుండీలలో కాకుండా దాని ప్రక్కన వేస్తారు. అలాంటి వారు జర జాగ్రత్తగా ఉండండి.

ఈ చెత్తలో కూడా రెండు రకాలు ఉంటాయి. ఇంట్లో కానీ, ఆఫీసుల్లో కానీ తడి, పొడి చెత్త మనకు తయారవుతుంటాయి. ఈ రెండింటిని కలిపి పడవేసినా ఇక పై మనకు ‘తడి’ (జరిమానా) పడుతుంది. ఇక చెత్తే కదా అని తేలిగ్గా తీసుకుంటే మాత్రం మన జేబుకు భారీగా చిల్లు పడుతుంది.

ఘన పదార్ధాలకు సంబంధించిన కమిటీ తాజాగా ఈ సిఫార్సు చేసింది. దేశ వ్యాప్తంగా 28 పట్టణాలు, నగరాల్లో ఈ కమిటీ అధ్యయనం చేసింది. దీని పై కొన్ని కఠినమైన సిఫార్సులు చేసింది.

-  నగరాల్లో... పట్టణాల్లో పౌరుల ఆరోగ్యానికి విఘాతం కలించే వ్యక్తులను ఉపేక్షించ కూడదు. తడి, పొడి చెత్తలను వేరేచేయకపోయినా, రోడ్డు మీద చెత్త వేసినా సదరు వ్యక్తి నుంచి అప్పటికప్పుడు జరిమానా వసూలు చేయాలి. ఈ మేరకు పురపాలక శాఖలో తగినంత మంది సిబ్బందిని నియమించాలి.
-  జరిమానా కనిష్టం రూ. 100 నుండి గరిష్టం రూ. 5000 వరకు విధించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు జరిమానా మొత్తాన్ని నిర్ణయించుకోవచ్చు.
-  జరిమానాను ఎప్పటికప్పుడు కట్టకపోతే ఆ మొత్తాన్ని సదరు వ్యక్తి ఆస్తి పన్నులో బకాయిగా పేర్కొనాలి. అలా వీలుగాని పక్షంలో మున్సిపాలిటీలు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి.
-  ఘన పదార్థాల నిర్వహణలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గ దర్శకాలను పూర్తిస్ధాయిలో ఆచరణలో పెట్టాల్సి ఉన్నా అది జరగలేదు. వీటి అమలుతోపాటు పట్టణ జీవన ప్రమాణాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల్లో అవసరమైన మార్పులు చేయాలి.
- భవిష్యత్తులో వీధుల్లో చెత్త వేయడాన్ని పూర్తిగా నిషేదించాలి.

మరి వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత వరకు ఆచరిస్తాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana will be a reality soonkcr
24 lady dsps out of 46 newly joined duties  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles