Kolleru land issue

kolleru land issue, forest department, villagers in kolleru area, kolleru lak, kolleru land issue,

Kolleru land issue

చావనైనా చస్తాం... మేము వదులుకోం ?

Posted: 04/30/2013 06:43 PM IST
Kolleru land issue

 అటవీ అధికారులకు, కొల్లేరు పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు మధ్య అంతరాన్ని పెంచుతున్నాయి. ఆటపాక వలస పక్షులు సంరక్షణ కేంద్రం మాదిరిగా గోనెపాడులో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అటవీ అధికారులు ప్రయత్నించారు. ఇటీవల ఆ పనులను ఆటపాక, గోనెపాడు గ్రామస్తులు అడ్డుకున్న విషయం విదితమే. నత్తగుళ్ళపాడులో కొల్లేరు భూమిని సర్వే చేయడానికిఅటవీశాఖ రేంజర్ రత్నకుమార్, డెప్యూటి రేంజర్ ప్రసాద్ సిబ్బందితో వెళ్లారు. గ్రామస్తులు కొల్లేరు సమీపంలోని నాగేంద్రుని గుడి వద్ద సమావేశమయ్యారు. అక్కడకు వచ్చిన అటవీ అధికారులను పక్షుల కేంద్రం ఏర్పాటు పనులను విరమించుకోవాలని కోరారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను తెలుసుకోడానికి వచ్చామని చెప్పినప్పటికీ గ్రామస్తులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ప్రభుత్వమే మాకు సొసైటీలను ఏర్పరచి చేపల సాగుకు అవకాశం ఇచ్చిందని, కొల్లేరు ఆపరేషన్ సమయంలో వాటిని రద్దు చేశారని చెప్పారు. జీవనోపాధిని కోల్పోయామన్నారు. పశువులు తాగడానికి సైతం నీరు లేదని వాపోయారు. ఇటువంటి సమయంలో సొసైటీ భూముల స్థానంలో పక్షుల కేంద్రం ఏర్పాటు తగదన్నారు. చావనైనా చస్తాం కానీ... కొల్లేరు భూములను వదులుకోం అంటూ ఆవేశంగా మాట్లాడారు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో అదనంగా ధ్వంసం చేసిన 7500 ఎకరాలను పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కొల్లేరు సంఘం తరఫున కోరామని... ఆ నిర్ణయం వచ్చేవరకు వేచి ఉండాలని అధికారులను కోరారు. రెవెన్యూ లెక్కల ప్రకారం ఈ గ్రామంలో 400 ఎకరాలు ఉందని, వాటిలో కొన్ని ఎకరాలు మినహాయించే అవకాశం ఉందని అధికారులు చెప్పినప్పటికీ గ్రామస్తులు సమ్మతించలేదు. దీంతో అధికారులు వెనుతిరిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more