Andhra pradesh police raids in puttur

Andhra pradesh Police-Raids-in-puttur, police raided a house in Puttur, Terrorist In Puttur

Andhra pradesh Police-Raids-in-puttur, police raided a house in Puttur

పుత్తూరు ఉగ్రవాదులు-పోలీసుల తనిఖీలు

Posted: 10/16/2013 11:33 AM IST
Andhra pradesh police raids in puttur

ఆపరేషన్‌ పుత్తూరు తర్వాత పుంగనూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. పుంగనూరులో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లీ విస్తృతంగా గాలించారు. ఉగ్రవాదులు పుత్తూరు నుంచి పుంగనూరుకు స్థావరాన్ని మార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉబెదుల్లా కంపౌండ్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రతి ఇంట్లోనూ క్షుణ్ణంగా పరిశీలించారు. కుటుంబ సభ్యుల వివరాలపై ఆరా తీశారు. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరించినా, కొత్త వారు కనిపించినా సమాచారమివ్వాలని స్థానికులకు సూచించారు. పోలీసుల తనిఖీలతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. ఉగ్రవాదులు మాటు వేశారేమోనని భయపడిపోయారు. పోలీసులు మీడియాకు సమాచారమివ్వకుండా గోప్యంగా ఉంచారు. దీంతో పుంగనూరులో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles