Ttd s golden chariot and 18 boys run from juvenile observation home

TTD s golden chariot, 18 Boys Run From TTD Juvenile Observation Home, TTD golden chariot, srivariki golden chariot, boys Run From Juvenile Observation Home, Juvenile Observation Home Tirupati, juvenile flee from Observation Home

TTD s golden chariot, 18 Boys Run From TTD Juvenile Observation Home

వారికి బంగారు రథం- 18 మంది బాలురు పారిపోయారు

Posted: 09/25/2013 10:40 AM IST
Ttd s golden chariot and 18 boys run from juvenile observation home

శ్రీవేంకటేశ్వరస్వామివారికి అతి పెద్ద స్వర్ణరథాన్నితితిదే తయారు చేసింది. నిర్మాణ పనులు ఈనెల 27తో పూర్తి కానున్నాయి. గతంలో ఉన్న రథం 21 అడుగుల ఎత్తు ఉండగాకొత్తది 32 అడుగులతో దేశంలోనే అతి పెద్దదని తితిదే సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరాజు పేర్కొన్నారు. సుమారు 29 టన్నుల బరువున్నస్వర్ణరథం తయారీకి 74 కిలోల బంగారాన్ని, 2, 900 కిలోల రాగిని, 25 టన్నుల దారుచెక్క, ఇనుమును వినియోగించినట్లు చెప్పారు. 18 అంగుళాల గేజ్ రాగి రేకులపై 9 పొరలతో బంగారు పూత పూసినట్లు తెలిపారు. బీహెచ్ఈఎల్ సహకారంతో ఇనుప చక్రాలు, హైడ్రాలిక్ బ్రేక్ లను రూపాందించామన్నారు. స్వర్ణరథం తయారీ వ్యయం రూ. 24, 34 కోట్లుగా చెప్పారు. రథాన్ని ఈనెల 30న ప్రయోగాత్మకంగా తీరువీధుల్లో నడపనున్నారు.

srivari golden chariot

18మంది పరార్ ..

బాల నేరస్థుల గృహం నుంచి 18మంచి నేరస్థులు పరారయ్యారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలోని మంగళం రోడ్డులో ఉన్న బాల నేరస్థుల గృహంలో రాత్రి చోటుచేసుకుంది. ఈ గృహంలోని బాత్ రూమ్ కిటికీలను తొలగించుకొని పరారయినట్లు తెలుస్తుంది. పరారయిన వారిలో 23కేసుల్లో నిందితుడైన హిస్రుద్దీన్, నెల్లూరు జంట హత్య కేసు నిందితుడు వంశీ ఉన్నారు. మొత్తం 18మందిలో నెల్లూరుకు చెందిన వారు ముగ్గురు, ఓంగోలుకు చెందిన వారు ఐదుగురు ఉండగా.. తిరుపతికి చెందిన వార ఏడుగురు ఉన్నారు. వీరిలో తొమ్మిది మందిని రేణిగుంట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles