Samaikyandhra bandh effect in tirupathi

samaikyandhra bandh effect in tirupathi, Samaikyandhra Bandh Exclusive in Tirupati, Seemandhra bandh affects Tirumalam Seemandhra Bandh – Impact on Tirupathi Devasthanam, Seemandhra bandh affects Tirumala

samaikyandhra bandh effect in tirupathi, Samaikyandhra Bandh Exclusive in Tirupati,

శ్రీవారిని తాకిన బంద్ ఎఫెక్ట్

Posted: 09/24/2013 04:27 PM IST
Samaikyandhra bandh effect in tirupathi

సీమాంధ్రలో ఈరోజు బంద్‌కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో తిరుమలపై సమైక్యాంధ్ర బంద్ ప్రభావం పడింది. అలిపిరి వద్ద వాహనాలను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక చేసేది లేక భక్తులు కాలినడకన తిరుమల చేరుకుంటున్నారు. తిరుమలలో కాలినడకన వచ్చిన భక్తులకు టీటీడీ అధికారులు అల్పాహారం, వసతి ఏర్పాట్లు చేస్తోంది. అలాగే తిరుమల ఘాట్ రోడ్‌లో కూడా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. తిరుమలకు వెళ్ళాల్సిన టీటీడీ సిబ్బంది కూడా అలిపిరి వద్ద పడిగాపులు కాస్తున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ప్రైవేట్ వాహనాలను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. సమైకాంధ్ర ఉద్యమంలో భాగంగా ఈరోజు బంద్ నిర్వహిస్తుండటంతో టీటీడీ తరపున ప్రత్యామ్నాయ రవాణా వసతి కల్పించలేమని టీటీడీ ఈవో ఎంజీ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు ప్రకటించారు. తమ వద్ద 10 బస్సులే అందుబాటులో ఉన్నాయన్నారు. కొండపైన పనిచేసే ఉద్యోగులను తరలించడానికి ఆ బస్సులు వినియోగిస్తున్నామన్నారు. భక్తులను తరలించేందుకు సరిపడా వాహనాలు లేవన్నారు. ఈ విషయంలో తమకు సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని విష్ణునివాసం, రెండోసత్రం, అలిపిరి లింకు బస్టాండు వద్ద భక్తుల సౌకర్యార్థం షామియానా వేస్తున్నామన్నారు. అక్కడ వేచి ఉండే భక్తులకు అల్పాహారం అందిస్తామన్నారు. ఏపీ ఎన్జీవోలు చేపట్టిన బంద్‌తో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరుమలకు వచ్చే వాహనాలను నిలిపివేశారు. ప్రస్తుతం అలిపిరి నుంచి తిరుగుతున్న ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేటు వాహనాలు, ద్విచక్రవాహనాలు కూడా తిరుమలకు రానీయకుండా అడ్డుకున్నారు. దీంతో భక్తులు తిరుమలకు రావాలన్నా.. తిరుగు ప్రయాణానికి కాలిబాటలే శరణ్యమయ్యాయి. రైళ్లలో వచ్చే భక్తులు అలిపిరికి చేరడానికి కూడా ప్రైవేటు వాహనాలు లేవు. అంటే రైల్వే స్టేషన్ నుంచే తిరుమలకు నడక సాగించాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles