Samaikyandra movement effect laghu darshan at tirumala

samaikyandra movement effect laghu darshan at tirumala, laghu darshan at tirumala, samaikyandra movement, samaikyandhra in tirupati, seemandhra movement effect on rtc, breaking news, ap politics, political news, andhra news

samaikyandra movement effect Laghu Darshan at Tirumala

లఘుదర్శనం- భారీగా నగదు స్వాధీనం

Posted: 08/19/2013 06:43 PM IST
Samaikyandra movement effect laghu darshan at tirumala

సమైక్యాంద్ర ఉద్యమం దెబ్బ తిరుమలను తాకింది. తిరుమలలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. గత కొన్ని రోజులుగా సమైక్యాంద్ర కోసం సీమాంద్రలో జరుగుతున్న ఆందోళనుల, వాహనాలు బంద్ కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. నిత్యం భక్తులతో కిక్కిరిసి ఉండే క్యూలైన్లు బోసిపోయాయి. తీరువీదులు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి, కాలినడకన వచ్చిన భక్తులకు రెండు గంటల సమయం మాత్రమే పడుతోంది. దీంతో భక్తులకు లఘుదర్శనం ద్వారా స్వామివారిని దగ్గర నుంచి దర్శిచుకునే అవకాశం కల్పిస్తున్నారు.

భారీగా నగదు స్వాధీనం

తిరుపతిలో అలిపిరి పోలీసులు భారీగా నగదును ఈరోజు మధ్యాహ్నం స్వాధీనం చేసుకున్నారు. బెంగుళూరుకు చెందిన మునిరాజు అనే వ్యక్తి ఆరు బ్యాగుల్లో డబ్బును ఐటీడీఎస్ బస్సులో తీసుకు వచ్చి బస్సాండ్ సమీపంలో హోటల్‌లో ఉంచాడు. తమకు అందిన విశ్వాసనీయ సమాచారంతో ఆర్టీసీ బస్టాండ్ వద్ద కాపుకాసి నగదును స్వాధీనం చేసుకుని మునిరాజును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా డబ్బు అక్రమంగా తీసుకురాలేదని, బ్యాంక్ నుంచి తీసుకువస్తున్నట్లు మునిరాజు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని పోలీసులు పేర్కొన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles