Peddi rama chandra reddy fire on tdp congress party

Peddireddy Ramachandra Reddy fire on congress, Peddireddy Ramachandra Reddy, Congress MLA Peddi Ramachandra Reddy,congress and TDP

peddi rama chandra reddy fire on tdp, congress party

పెద్దిరెడ్డి ఫైర్

Posted: 07/20/2013 08:00 PM IST
Peddi rama chandra reddy fire on tdp congress party

దేశ రాజకీయ చరిత్రలో అధికార, విపక్ష పార్టీల నేతలు చెట్టాపట్టాలేసుకుని తిరగుతూ మూడో ప్రత్యామ్నాయం లేకుండా చేసేందుకు కుయుక్తులు పన్నుతున్న సీఎం కిరణ్, విపక్ష నేత చంద్రబాబు చరిత్రహీనులుగా మిగిలిపోతారని మాజీ మంత్రి, పుంగనూరు మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పీలేరులో ఏర్పాటు చేసిన  సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయసాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక సీబీఐని అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయించి ఏడాదిపైగా జైల్లో నిర్బంధించారని దుయ్యబట్టారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారని తెలిపారు. జగన్ నాయకత్వంలో తిరిగి రాజన్న రాజ్యం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. అధికార, ప్రతి పక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా జగన్ మచ్చలేని నాయకుడుగా జైలు నుంచి బయటపడుతారని దీమా వ్యక్తం చేశారు. మహానేత రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఆయననే విమర్శించడం చూస్తుంటే కాంగ్రెస్ నేతల అవకాశవాద రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles