Tirumala full details

tirumala seva details, tirumala-full details, tirumala venkateswara temple

tirumala-full details

తిరుమల సమాచారం?

Posted: 04/19/2013 04:02 PM IST
Tirumala full details

శ్రీవారి అర్జిత సేవలు వసతి సమాచారం కోసం టీటీడీ కాల్‌ సెంటర్‌ నెంబర్లు

0877 - 2233333 , 2277777 , 2264252.

టీటీడీ దాతల వివరాలకు 0877 - 2263472 కు సంప్రదించండి.

ఉచితసేవలకు ఇతర కార్యక్రమాలకు లంచం అడిగితే విజిలెన్సు టోల్‌ ఫ్రి 18004254141 నెంబర్‌కు సంప్రదించండి.

అలిపిరి మెట్లదారిలో గాలిగోపురం, శ్రీవారిమెట్టు మార్గంలో ఉచిత సుదర్శనం టోకన్లు భక్తులకు టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాల నుంచి భక్తుల కోసం వారి లగేజిని ఉచితంగా తిరుమలకు తరలించే కేంద్రాలు ఏర్పాటు చేశారు.

టీడీడీ చైర్మెన్‌ , పాలకమండలి సభ్యులు, మంత్రులు, ఎంపిలు, శాసనసభ్యులు, ఇతర ప్రముఖుల సిఫారసు ఉత్తరాల పై తిరుమల జెఇఓ కార్యాలయంలో దర్శనం, సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చును. ఈ దరఖాస్తులను సేవకు ముందురోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జెఇఓ కార్యాలయంలో సమర్పించాలి. సాయంత్రం 5 గంటలకు సెల్‌ఫోన్‌ మెసేజ్‌ ఆధారంగా సేవలు మంజూరు అయినది లేనిది తెలియ పరుస్తారు.

50 రూపాయల సుదర్శన్‌ టోకన్లు తిరుపతిలోనే శ్రీనివాసం కాంప్లెక్సు, ఆర్టిసి బస్టాండు, అలిపిరి లగేజి కౌంటర్‌, శ్రీవారి సన్నిధి, రేణిగుంట రైల్వేస్టేషన్‌ సమీపంలో బయోమెట్రిక్‌ పద్దతి పైన భక్తులు పొందవచ్చు.

తిరుమలలోని కేంద్రీయ విచారణ కార్యాలయం (సిఆర్‌), వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ , అన్నదానం, కళ్యాణకట్ట, కాటేజి విచారణ కార్యాలయాల వద్ద పిర్యాదుల పెట్టెలను టీటీడీ ఏర్పాటు చేసింది.

భక్తుల సమస్యలను ప్రతినెలా మొదటి శుక్రవారం డయల్‌ యువర్‌ ఇఓ కార్యక్రమంలో 0877 - 2263261 నెంబరు ద్వారా ఫోన్‌లో కార్యనిర్వహణాధికారితో మాట్లాడి అమూల్యమైన సలహాలను అందించవచ్చు.

తిరుమలలో 18 వేల మంది భక్తులకు సరిపడే 3 యాత్రికుల వసతి సముదాయాలు అందుబాటులో ఉన్నాయి. మరుగుదొడ్లు, స్నానపు గదులు, తదితర సౌకర్యాలు ఉచితంగా పొందవచ్చు. ఇక్కడ ఉన్న లాకర్లలలో భక్తులు తమ లగేజీలను భద్రపరుచుకోవచ్చు.

సిఆర్‌ ఓ అడ్వాన్సు రిజర్వేషన్‌ కౌంటర్‌లో ముందుగా గదులు రిజర్వ్‌ చేసుకున్న భక్తులకు 100 రూపాయల గదులు హెచ్‌విడిసి, రాంభగీచా అతిధిగృహాలు, వరాహస్వామి అతిధిగృహాలు వీటిలో కేటాయిస్తారు.

సిఆర్‌ఓ టీబి కౌంటర్‌లో 100 రూపాయల గదులు శేషాద్రినగర్‌, సప్తగిరి అతిధిగృహాలు, టీబిసి, ప్రాంతాలలోని కాటేజిలను కేటాయిస్తారు.

సిఆర్‌ఓ జన్రల్‌లో, సప్తగిరి సత్రాలలో అద్దె గదులు పొందవచ్చు, ఉచిత గదులను కూడా ఇక్కడ కేటాయిస్తారు. 50 రూపాయలు అద్దె ప్రాతిపదికన శేషాద్రినగర్‌, శంఖుమిట్ట, అంజనాద్రినగర్‌, గరుడాద్రినగ ర్‌లోని గదులను ఈ కౌంటర్‌ ద్వారా పొందవచ్చు.

వివిఐపిల కోసం 100 రూపాయల నుంచి 6000 వేల రూపాయల వరకు వివిద రకాల అద్దె గదులను పద్మావతి అతిధిగృహంలో పొందవచ్చు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles