కలియుగ దైవం అయిన శ్రీనివాసుడికే మొన్నటి వరకు నీటి కష్టాలు వచ్చాయి. తన దగ్గరికి వచ్చే భక్తులకు తాగేందుకు కూడా నీరు లేని పరిస్థితి వచ్చింది. భక్తుల కష్టాలు చూడలేని శ్రీనివాసుడు వారిని కరుణించాడు. అప్పపీడన ధ్రోణి కారణంగా తిరుపతిలో కురిసిన భారీ వర్షానికి తాగునీటికోసం నిర్మించిన డ్యాంలలో జలకళ ఉట్టిపడుతోంది.ఎన్నడూలేని విధంగా ఈ సంవత్సరం వేసవిలో తిరుమలలో నీటి ఎద్దడి తలెత్తింది. భక్తుల దాహార్తిని తీర్చడానికి నిర్మించిన డ్యామ్‌లలో నీరు అడుగంటడంతో భక్తులు భారీగా నీటి ఎద్దడినికి చవిచూశారు. అయితే ఇప్పడు కురిసిన భారీ వర్షాలతో తిరుమలలోని దాదాపుగా అన్ని డ్యామ్‌లలో నీళ్లు చేరాయి. పాపవినాశనం డ్యామ్ పూర్తిస్థాయికి చేరింది. రెండు గేట్టు కూడా ఎత్తేశారు.5240 లక్షల గ్యాలన్ల నీటి నిల్వ సామర్థ్యం గల ఈ డ్యామ్‌లోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరుతోంది. 10 క్యూసెక్యుల నీరు చేరుతుండడంతో 7.5 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. పాపవినాశనం డ్యామ్‌తో పాటు ఆకాశగంగా, కుమారధార, పసుపుధార, గోగర్బం డ్యామ్‌కూడా నిండే అవకాశం వుంది. అన్ని జలాశయాలు పూర్తిగా నిండితే మరో రెండు సంవత్సరాల పాటు భక్తులకు పుష్కలంగా నీటిని అందించవచ్చని టిటిడి అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జలాశయాలన్నీ పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకోవడంతో త్వరలో గంగపూజను నిర్వహించడానికి టిటిడి అధికారులు సిద్దమౌతున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more