Health benefits with custard fruit

health tips, health benefits, custard fruits, health benefits with custard fruits, blood pressure, heart attack disease, skin cancer, eye sight

Health benefits with custard Fruit which prevents cancer and other dangerous diseases

సీతాఫలంతో ఆరోగ్యఫలాలు!

Posted: 10/14/2014 04:10 PM IST
Health benefits with custard fruit

మానవ శరీరానికి అవసరమయ్యే ఔషధగుణాలను అందించే ఆహారపదార్థాల్లో ‘‘సీతాఫలం’’ ఒకటి! శరీరానికి కావలసిన కేలరీలతోపాటు తగిన మోతాదులో మాంసకృతులను సైతం అందిస్తుంది. ఇది ఒక ఆహారపదార్థంగా ఆకలిని తీర్చడంతోపాటు ఆరోగ్యాన్ని పెంచుతుంది. సీతాఫలం ఆకు మొదలుకుని, గుజ్జు తిన్న తరువాత పారవేసే గింజల వరకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యశాస్త్రం బల్లగుద్దిమరీ చెబుతోంది. దేహాపుష్టి పెంపు నుంచి కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను నశింపచేసే శక్తి ఇందులో వుంది. రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేసే ఔషధ గుణగణాలు ఇందులో దాగివున్నాయి. ఈ పండు ద్వారా కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

1. గర్భిణీ స్త్రీలు సీతాఫలాన్ని తినడం వల్ల పొట్టలో పెరిగే శిశువు మెదడు, నాడీవ్యవస్థ, వ్యాధినిరోధకత తదితరలు పెరగడానికి సహాయపడుతుంది. గర్భస్రావాన్ని నివారించడంలో ఇది కీలకపాత్రను పోషిస్తుంది.

2. ఎవరైనా బరువు పెరగాలంటే సీతాఫలం జ్యూస్ తో తేనె, పాలు బాగా మిక్స్ చేసుకొని, రెగ్యులర్ గా తాగాలి. ఇది క్యాలరీలను పెంచడంతోపాటు ఆరోగ్యంగా వుంచుతుంది.

3. సీతాఫలంలో విటమిన్ బి6 ఎక్కువ మోతాదులో లభ్యమవుతుంది. దీనివల్ల బ్రోంకైల్ ఇన్ఫ్లమేషన్ పూర్తిగా తగ్గి.. ఆస్త్మాటిక్స్ అటాక్ ను నివారిస్తుంది.

4. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది కార్డియక్ అటాక్స్ నుంచి రక్షించడంలో ప్రముఖపాత్రను పోషిస్తుంది. తద్వారా గుండెపోటు నుంచి సురక్షితంగా వుండొచ్చు.

5. సీతాఫలంలో జీర్ణక్రియను మెరుగుపరిచే కాపర్, డైటర్ ఫైబర్ అధిక మోతాదులో వుంటాయి. ఇక, అడిషన్ గా బౌల్ మూమెంట్ క్రమంగా వుంటుంది. మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

6. ఈ పండులో షుగర్ పోషణను పూర్తిగా తగ్గించే డైటరీ ఫైబర్ పుష్కలంగా వుంటుంది. దీనివల్ల టైప్ 2 డయాబెటిస్ తగ్గుతుంది.

7. బ్లడ్ ప్రెజర్ లెవల్ ను పూర్తిగా కంట్రోల్ లో వుంచే పొటాషియం, మెగ్నీషియం వంటి రసాయనాలు సీతాఫలంలో పుష్కలంగా లభిస్తాయి.

8. కొలెస్టిరాల్ లెవల్స్ ను పూర్తిగా తగ్గించే నియాసిన్, డైటరీ ఫైబర్ వంటి ఔషధ గుణాలు ఇందులో అధికంగా వుంటాయి.

9. కళ్ల ఆరోగ్యానికి ఎంతో అవసరమైన రెబోప్లెవిన్, విటమిన్ సి వంటి ఔషధగుణాలు పుష్కలంగా లభ్యమవుతాయి. ఇవి ఫ్రీరాడికల్స్ ను నివారించి, మంచి కంటిచూపును అందిస్తుంది.

10. స్కిన్ అలర్జీ, క్యాన్సర్ ను నివారించే అద్భుత ఔషధగుణాలు ఇందులో అధిక మోతాదులో వుంటాయి. సీతాఫలాన్ని రెగ్యులర్ గా తీసుకుంటే మంచిది.

11. సీతాఫలంలో వుండే మరో ముఖ్యమైన ఆరోగ్యప్రయోజనం ఏమిటంటే.. ఇందులో వుండే మెగ్నీషియం శరీరంలో వాటర్ లెవల్ ను బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుంది. దానివల్ల జాయింట్ పెయిన్స్ పూర్తిగా తగ్గుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : custard fruits  health tips  health tips custard fruits  heart attack  skin cancer  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more