స్ధల పురాణం

May 16,2013 11:11 AM
స్ధల పురాణం

స్ధల పురాణం -

శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో ఒక బండరాయి మీద సేద తీరాడట. సేద తీరిన తర్వాత ఆబండరాయిని అనుగ్రహించి మరుజన్మలో నువ్వు మేరుపర్వత పుత్రుడు భద్రుడుగా జన్మిస్తావని అపుడు నీ కొండపైనే శాశ్వత నివాసం ఉంటానని వరమిచ్చాడట. దీనితో భద్రునిగా జన్మించి శ్రీరామునికై తపస్సు చేయసాగాడు.దీనితో బద్రున్ని అనుగ్రహించి భద్రగిరిపై వెలసి ఒక పుట్టలో ఉన్నాడట. కాలక్రమంలో శబరి శ్రీరాముడి అనుగ్రహంతో పోకల దమ్మక్కగా జన్మించి భద్రాచలం సమీపంలోని భద్రారెడ్డిపాలెంలో రామునికి పరమ భక్తురాలుగా ఉంటూ ఎపుడూ రామనామ స్మరణ చేస్తుందేది. ఒకరోజు కలలో రాముడు నేను భద్రగిరిపై ఎండకు ఎండి వానకు తడిసి ఉంటున్నాను నాకు ఎదైనా నీడ నిర్మించమని ఆదేశించాడట.

దమ్మక్క తెల్లవారగానే స్వామి చెప్పిన ప్రాంతంలోవెళ్ళి చూడగా పుట్టలో వెంచెసి ఉన్నాడట.పుట్టను శుభ్రం చేసి తాటాకులతో తనకుచేతనయినట్టు ఒక పందిరి వేసి విగ్రహలను ఉంచి పూజలు చేస్తుండెదట. భద్రారెడ్డి పాలెంకు కూతవేటు దూరంలో గల నేలకొండపల్లి గ్రామంలో కంచర్ల లింగన్న కామమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు కంచర్ల గోపన్న, చిన్నతనం నుండి శ్రీరామ భక్తుడు. యవ్వనం రాగానే గోపన్నకు దగ్గర బందువు అయిన అక్కన్న తానిషా ప్రభువు దగ్గర మంత్రిగా ఉండటంతో గోపన్నకు పాల్వంచ ప్రాంతానికి తహసీర్దారుగా నియమించాడు. ఆ పరగణాలోనే ఉన్న భద్రగిరి ప్రాంతంను దర్శించిన గోపన్న స్వామికి సరైన ఆలయం లేకపోవడంతో చలించి,

పన్నులుగా వసూలయిన ధనంతో రామాలయం ను సర్వాంగసుందరంగా నిర్మించాడట. దీనితో కొపోద్రిక్తుడైన తానిషా గోపన్నను చరసాలలో భందించి చిత్రహింసలకు గురి చేస్తాడు. తానిషాకు రామచంద్రుడు కరుణించి లక్ష్మణ సమేతుడై కలలో కనిపించి తన కాలం నాటి రామమాడలను చెల్లించాడట. తానిషా ఒక్కసారిగా మేలుకుని చూడగా ఆలయానికి గోపన్న ఎంతయితే వాడాడో అంత సొమ్ము రాశిగా పోసి ఉందట. దీనితో గోపన్న భక్తికి తన తప్పును తెలుసుకుని ఖైదునుండి విడుదల చేసాడట. గోపన్న ఎపుడూ రామకీర్తనలు పాడటంతో రామదాసుగా ప్రసిద్దికెక్కాడు. భద్రాచలం శ్రీసీతారాముల ఆలయానికి ఉన్న చరిత్ర.

భద్రాచలంలో జరిగే ముఖ్యమైన ఉత్సవాలు,పండుగలు-

శ్రీరామనవమి -

స్వామివారి ఆలయంలో ఎంతో కన్నులపండుగగా నిర్వహించేది సీతారాముల కళ్యాణ మహోత్సవం. చైత్రశుద్ద నవమినాడు స్వామివారి కళ్యాణం జరిపిస్తారు. కళ్యాణంలో స్వామివారు కట్టే తాళిబొట్టును రామదాసు చేయించాడు. ఇప్పటికి ఆ మంగళసూత్రాన్నే వినియోగిస్తున్నారు. కళ్యాణం నిమిత్తం అప్పటి తానిషా ప్రభుత్వ సాంప్రదాయం ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం ముత్యాల తలంబ్రాలు అందజేస్తుంది. సీతారాముల కళ్యాణమహౌత్సవం చూసి తరించడానికి రాష్ట్రం నలుమూలల నుండే కాక వివిధరాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి వస్తారు.

వైకుంఠ ఏకాదశి-

శ్రీమహవిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన వైకుంఠ ఏకాదశిని ఎంతో వైభవంగా ఇక్కడ నిర్వహిస్తారు. ఏకాదశికి గోదావరి నదిలో నిర్వహించే తెప్పోత్సవం, ఉదయం 5గంటలకు జరిగే వైకుంఠద్వార దర్శనం చూసేవారికి ఎంతో నయనానందకరంగా ఉంటాయి.

వాగ్యేయకార మహౌత్సవం -

భక్తరామదాసు పేర 1972నుండి వాగ్యేయకార మహౌత్సవాలు నిర్వహించబడౌతున్నాయి.

 

క్కడ ఉండాలి -

 

భద్రాచలంలో అన్నిరకాల ప్రజలను వారివారి స్తోమతమేరకు వసతి సౌకర్యం కలదు. ప్రభుత్వం సత్రాలు, కాటేజ్లు, గెస్ట్ హౌస్ లు, హౌటల్స్ కలవు.

 

వివిధ సత్రాలు,సదనాల వివరాలు -

 

నార్మల్

 

యాత్రిక సదనం - 20రూ

 

వేములవాడ సదనం - 45రూ

 

యాదగిరి సదనం - 75రూ

 

నాగిరెడ్డి సదనం - 60రూ

 

చంద్రమౌళి సదనం - 150రూ

 

హైక్లాస్

 

బ్రహ్మాజి కాటెజ్(.సి) - 300రూ

 

అల్లూరి నిలయం(.సి) - 300రూ

 

సీతా నిలయం (.సి) - 400రూ

 

నంది నిలయం(.సి) - 500రూ

 

గోల్డ్ స్టార్ (.సి) - 500రూ

 

భద్రాచలంలో చూడవలసిన ఇతర ఆలయాలు -

1.గోవిందరాజులస్వామి ఆలయం

2.నరసిమ్హస్వామి ఆలయం

3.యోగానంద నరసిమ్హస్వామి ఆలయం

4.శ్రీరామదాసు ద్యానమందిరం

.రంగనాయక స్వామి ఆలయం

6.వేణుగోపాలస్వామి ఆలయం

7.హరనాద ఆలయం

ఇంకా భద్రాచలానికి 35 కిలోమీటర్ల దూరంలో పర్ణశాల ఉంది. రాముడు వనవాస సమయంలో ఇక్కడే ఉన్నాడట.ఈ ప్రాంతం ఎంతో ప్రకృతి రమణీయంగా ఉంటూ భక్తులను ఆహ్లదపరుస్తుంది. ఈ పర్ణశాలలో వనవాస సమయంలో జరిగిన సన్నివేశాలు శిలా రూపంలో మనకు కనిపిస్తాయి. పక్కనే వేణు గోపాలస్వామి ఆలయం కూడా ఉంది.ఇక్కడే ఒక వాగు గోదావరి నదిలో ఐఖ్యమవుతుంది. ఈ వాగు గట్టుమీదే సీతమ్మవారు స్నానంచేసి తన నార చీరలను ఆరేసుకునెదట. అందుకే ఈ వాగును సీతమ్మవాగు అంటారు. విశేషమేమిటంటే ఇప్పటికి ఆవిడ ఆరేసిన ప్రాంతంలో చీర గుర్తులు 20 అడుగుల మేర కనిపిస్తాయి అక్కడ. ఇంకా అమ్మవారు కుంకుమకు ఉపయోగించిన రాళ్ళను కుడా అక్కడ చూడవచ్చు.

 

పర్ణశాల దగ్గరలో చూడవలసిన ప్రదేశాలు -

యటపాక -

ఈ ప్రాంతంలోనే రావణాసురుడుతో జటాయివు పోరాడి సీతాదేవి యొక్క సమాచారం శ్రీరాముడికి చేరవేసి మరణిచాడట.ఇక్కడ రామున్ని కులాసరాముడు అంటారు.

రధగుట్ట -

ఈ గుట్ట మిదే సీతాదేవిని అపహరించడానికి వచ్చిన రావణుడు రధం ను నిలిపాడట.

దుమ్ముగుడెం -

ఇక్కడ రాముడు రాక్షసులను చంపి దహనకాండ నిర్వహించాడట.వారి చితాభస్మాల ధూలి ఆప్రాంతం అంతా కమ్మి ఉండటంతో దీనికి దుమ్ముగుడెం అని పేరు వచ్చింది అని చెబుతారు.

గోదావరి నది -

పర్ణశాల ఒడ్డునే గోదావరి నది ప్రవహిస్తుంది.ఇక్కడికి వచ్చిన యాత్రికులు గోదావరి నదిని విక్షించడానికి వీలుగా మర పడవలు ఏర్పాటు ఉంది.

 

 

Other Articles

  • Air port

    May 16 | ప్లైట్ మార్గం ద్వారా - ప్లైట్ ద్వారా భద్రాచలం చేరుకోవాలంటే దగ్గరలోని ఎయిర్ పోర్ట్స్ రాజమండ్రి, హైదరాబాద్, చెన్నైలు కలవు.... Read more

  • Railway station

    May 16 | రైలు మార్గం ద్వారా - భద్రాచలానికి రైలుమార్గం ద్వారా చేరుకోవాలనేవారు దగ్గరలోని రైల్వే స్టేషన్ కొత్తగుడెం కలదు.... Read more

  • Bus station

    May 16 | ఎంతదూరం - ఎలావెళ్ళాలి ? రాష్ట్రంలోని అన్నిప్రాంతాల నుండి రవాణాసౌకర్యం కలదు.వివిధ ప్రాంతాల నుండి దూరం కిలోమీటర్లలో. రాజమండ్రి నుండి - 160 విజయవాడ నుండి - 201 హైదరాబాద్ నుండి -312 వైజాగ్... Read more

  • Darshna samayalu

    May 16 | భద్రాచలంలోని స్వామివారి ఆలయాన్ని ఉదయం 4.30 నుండి రాత్రి 9.00గంటల వరకూ తెరచి ఉంచుతారు. ఉచిత దర్శనానికి - 2.రూపాయలు అంతరాలయ దర్శనానికి - 10.రూపాయలు .  నిత్యం జరిగే సేవలు సుప్రభాత సేవ... Read more

Additional Info

  • Sub Title: Lord Rama
Last modified on Thursday, 16 May 2013 11:11