Young Hero Naveen Chandra To Get Marriage In Next Year | Tripura Movie updates | Tollywood | Kollywood

Naveen chandra marriage news next year family members tripura tamil telugu movies

naveen chandra, naveen chandra marriage, tollywood news, andala rakshasi movie, allari naresh, manchu manoj, manoj marriage news, allari naresh marriage news

Naveen Chandra Marriage News Next Year Family Members Tripura Tamil Telugu Movies : Young Hero Naveen Chandra Family Members planning for his marriage. They look a hyderabadi girl for him. accroding to source their marriage will be next year.

పెళ్లకొడుకు కాబోతున్న ‘రాక్షసి’ హీరో

Posted: 05/19/2015 10:51 AM IST
Naveen chandra marriage news next year family members tripura tamil telugu movies

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. మొన్నటివరకు సినిమాలతో ఫుల్ బిజీగా వున్న బ్యాచిలర్ హీరోలందరూ ఇప్పుడు వరుసగా ఓ ఇంటివారు అవుతున్నారు. ఇప్పటికే మంచు మనోజ్ ఈ నెల 20న ప్రణతితో, అలాగే హీరో అల్లరి నరేష్ కూడా మే 29న పెళ్లి చేసుకుని సెటిలవుతుండగా.. తాజాగా వీరి జాబితాలో మరో యంగ్ హీరో చేరిపోయాడు. అతనెవరో కాదు.. ‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర! ఈ హీరో త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడని సమాచారం!

‘అందాల రాక్షసి’ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా నవీన్ చంద్రకు మాత్రం మంచి గుర్తింపే వచ్చింది. అటు తమిళంతోపాటు ఇటు తెలుగులోనూ ఈ హీరోకి అవకాశాలు రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ హీరో చేతిలో రెండు మూడు సినిమాలున్నాయని, ఓ వైపు తెలుగులో మరోవైపు తమిళ చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడని సమాచారం! ఇతను ఈ విధంగా సినిమాలతో బిజీగా వుండగా.. అటు అతని కుటుంబసభ్యులు ఇతని పెళ్లి కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలోనే వారు ఓ యువతిని చూశారని.. ఆమెను ఇతడు పెళ్లాడే అవకాశం వుందని చెబుతున్నారు.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. నవీన్ చంద్ర పెళ్లాడబోయే వధువు హైదరాబాద్కు చెందిన యువతి అని తెలుస్తోంది. ఇప్పటికే ఇరుకుటుంబాలు వీరి పెళ్లి గురించి మాట్లాడుకున్నారి, త్వరలో నిశ్చితార్థం జరిపేందుకు సన్నాహాలు జరుపుతున్నారని తెలిసింది. అయితే పెళ్లి మాత్రం వచ్చే ఏడాదేనని నవీన్ చంద్ర సన్నిహితులు తెలిపారు. ఏదేమైనా.. ఈ యువహీరో కూడా ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడన్నమా!

ఇదిలావుండగా.. నవీన్ చంద్ర ప్రస్తుతం స్వాతి ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘త్రిపుర’ చిత్రం షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళంలో రూపొందుతోంది. ఇక తమిళ చిత్రం శివప్పుతో పాటు మరో కోలివుడ్ చిత్రానికి సైన్ చేశాడు. అంతేకాకుండా నవీన్ చంద్ర చేతిలో రెండు, మూడు తెలుగు చిత్రాలు ఉన్నాయి. పెళ్లి సమయానికి ఆ సినిమాలన్ని పూర్తి చేసుకోవాలనే ప్లాన్లో నవీన్ వున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naveen chandra  allari naresh  manchu manoj  tollywood  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more