అప్పుడెప్పుడో ‘చిరుత’లో పాడి అలరించాడు. తర్వాత ‘అతిథి’కి స్వరమిచ్చి అందరి అభిమానాన్నీ సంపాదించాడు. ఈ మధ్య వచ్చిన ‘రచ్చ’ టైటిల్‌సాంగ్‌తో రచ్చ రచ్చ చేశాడు. శ్రావ్యమైన స్వరంతో, స్పష్టమైన ఉచ్చారణతో పాటకు అందాన్ని తెచ్చే ఆ గాయకుడు... దీపు. జీవితాంతం పాటలు పాడుతూనే ఉండాలన్నదే తన ఆశ అంటున్న దీపు చెప్పిన ముచ్చట్లు...
మీ బ్యాగ్రౌండ్...?
పుట్టింది, పెరిగింది, చదివింది... అంతా హైదరాబాద్‌లోనే. అమ్మ, నాన్న, అన్నయ్య, అక్క, నేను... హ్యాపీ హ్యాపీ ఫ్యామిలీ. డీవీఆర్ కాలేజ్‌లో ఇంజినీరింగ్ చేశాను.
సంగీతం పట్ల ఆసక్తి ఎలా కలిగింది?
చిన్నప్పట్నుంచీ పాటలంటే చాలా ఇష్టం. పోటీల్లో పాల్గొనేవాడిని. అది గమనించిన మా బంధువులు కొందరు సంగీతం నేర్పించమని అమ్మానాన్నలకు చెప్పారు. దాంతో వి.బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర, రామాచారి గారి ‘లిటిల్ మ్యుజీషియన్స్ అకాడెమీ’లోను సంగీతం నేర్చుకున్నాను. అన్నట్టు... మా అన్నయ్య ప్రవీణ్‌కి కూడా సంగీతమంటే ఇష్టం. తను కీబోర్డ్ ప్లేయర్. ఈ మధ్య ఓ సినిమాకి సంగీతం కూడా అందించాడు. అది రిలీజ్ కావాల్సి ఉంది.
సినిమా అవకాశం ఎలా వచ్చింది?
అప్పట్లో చాలా భక్తి క్యాసెట్లకు పాటలు పాడాను. ఓసారి సాయిబాబా ఆల్బమ్ కోసం పాడుతుంటే, మిక్కీ జె. మేయర్ నుంచి పిలుపు వచ్చింది. ఆడిషన్‌కి వెళ్లి సెలెక్టయ్యాను. అలా ‘టెన్త్‌క్లాస్’ సినిమాకి పాడే అవకాశం వచ్చింది.తొలిసారి మీ పాట మీరు విన్నప్పుడు...?
చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. చాలా క్యాసెట్లలో పాడినా... సినిమాకి పాడటం వేరు. నిజంగా మర్చిపోలేని అనుభూతి!
అత్యంత తృప్తినిచ్చిన పాట?
దాదాపు 200 పైగా పాటలు పాడాను. అన్నిట్లోకీ ‘అతిథి’లో ‘సత్యం ఏమిటో’, ‘యమదొంగ’లో ‘నాచోరే’ గాయకుడిగా తృప్తినిచ్చిన పాటలు.
కెరీర్‌లో బెస్ట్ కాంప్లిమెంట్....?
‘చిరుత’ కంపోజింగ్‌కి వెళ్లినప్పుడు మణిశర్మ చాలా మెచ్చుకున్నారు. ‘నీది చాలా మంచి వాయిస్. నువ్వు చాలా మంచి సింగర్‌వి అవుతావు. నేను తప్పక నీకు చాన్స్ ఇస్తాను’ అన్నారు. ఎంతో సంతోషం కలిగింది. అన్నట్టుగానే ఆయన అవకాశ మిచ్చారు. ఆయనే కాదు, కీరవాణి, కళ్యాణి మాలిక్, కోటి, శేఖర్‌చంద్ర... ఇలా అందరూ అవకాశాలిచ్చి ప్రోత్సహించారు.
బాధపెట్టిన సందర్భం..?
అలాంటివెప్పుడూ ఎదురు కాలేదు. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, ముందు మాతో పాడిస్తారు. కానీ ఏవో కారణాల వల్ల మళ్లీ వేరే వాళ్లతో పాడించి రీప్లేస్ చేస్తారు. అలాంటప్పుడే కాస్త బాధనిపిస్తుంది. అభిమానుల స్పందన...?
అభిమానుల స్పందన ఎలా ఉంటుందో భీమవరంలో ఓ ఇంజినీరింగ్ కాలేజ్‌లో షో చేసినప్పుడు తెలిసింది. షో జరుగుతున్నంత సేపూ ‘దీపు దీపు’ అని అరుస్తూనే ఉన్నారు. తర్వాత నేను ఉన్న గెస్ట్‌హవుస్ దగ్గరక్కూడా వచ్చేశారు. వాళ్ల అభిమానం చూసి చాలా ఆనందం కలిగింది.
మరి ఇంట్లోవాళ్ల స్పందన...?
(నవ్వుతూ) మా ఇంట్లోవాళ్లు నన్ను ఎప్పుడూ పొగడరు కానీ ఎప్పుడైనా సరిగ్గా పాడకపోతే మాత్రం వెంటనే చెప్పేస్తారు. నిజానికి అదే మంచిదనుకోండి! మా అమ్మయితే చాలా బాగా జడ్జ్ చేస్తుంది. ఇక నాన్న... ఆయన ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ నాకు. చిన్నతనం నుంచీ నన్ను కాంపిటీషన్స్‌కి తిప్పుతూ, నా వెంటే ఉండి నడిపించారాయన.పాడలేక కష్టపడిన సందర్భం ఏదైనా ఉందా?
ఆ పరిస్థితి ఎప్పుడూ రాలేదు. కానీ ‘నాచోరే నాచోరే’ పాడినప్పుడు కాస్త వాయిస్ మార్చాల్సి రావడంతో కాస్త ఇబ్బంది పడ్డాను. రెండోసారి పాడాల్సి వచ్చింది.
గాయకుడిగా మీ రోల్‌మోడల్ ఎవరు?
ఇంకెవరు... బాలుగారే! మాలాంటి వాళ్లందరికీ ఆయనే స్ఫూర్తి. ఆయనంత ఎత్తుకు ఎదగడమన్నది ఊహకు కూడా అందని విషయం. అందుకే నేనూ బాగా పాడాలని, కనీసం మంచి గాయకుడిగా పేరు తెచ్చుకోవాలని ఆశపడుతున్నాను.మీ ప్లస్/మైనస్ పాయింట్స్...?
దేవుడిచ్చిన ఈ స్వరమే నాకు ప్లస్. అందరినీ త్వరగా నమ్మేయడమే మైనస్. నమ్మడంలో తప్పు లేదు కానీ, మరీ ఎక్కువగా నమ్మేస్తుంటాను. అదే ఇబ్బంది!
భవిష్యత్తు ప్రణాళికలు...?
ఏముంది... ఈ మధ్య పాడిన ‘రచ్చ’ టైటిల్‌సాంగ్ సూపర్‌హిట్టయ్యింది. జీవితాంతం ఇలా మంచి పాటలు పాడుతూ ఉంటే చాలు. రెహమాన్, ఇళయరాజాల దగ్గర కూడా పాడాలని ఉంది. అవకాశం కోసం చూస్తున్నాను. అలాగే తరచుగా నా ఆల్బమ్స్ రిలీజ్ చేయాలన్న ఆశ ఉంది. త్వరలోనే ఓ ఆల్బమ్‌ని తీసుకొస్తాను!
పుట్టినరోజు: ఏప్రిల్ 10
నచ్చే కలర్స్: బ్లూ, బ్లాక్
నచ్చే ఫుడ్: చికెన్‌తో చేసిన వంటకాలు చాలా ఇష్టం.
నచ్చే ప్రదేశం: మలేషియా
నచ్చిన సినిమా: అహనా పెళ్లంట. కామెడీ సినిమాలెక్కువ చూస్తా.
నచ్చే నటీనటులు: సూర్య, మహేష్‌బాబు, తమన్నా, అనుష్క
తీరిక వేళల్లో: హరిహరన్ గజల్స్ వింటాను. క్రికెట్ ఆడతాను
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more