Ileana hot at snehitudu audio launch

ileana hot at snehitudu audio launch images,ileana hot images,ileana snehitudu movie images,hot ileana,hot images,snehitudu movie,ileana images,telugu actress

ileana hot at snehitudu audio launch images,ileana hot images,ileana snehitudu movie images,hot ileana,hot images,snehitudu movie,ileana images,telugu actress

ileana snehitudu movie interview.gif

Posted: 01/24/2012 03:06 PM IST
Ileana hot at snehitudu audio launch

interview-image1

Ileana-interviewక్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తన కెరియర్ లో తొలి డబ్బింగ్ మూవీకి దర్శకత్వం చేస్తున్నాడు. హిందీలో సూపర్ హిట్ అయినా 'త్రీ ఇడియట్స్'  సినిమాని తమిళ్, తెలుగు వెర్షన్లలో రీమేక్ చేశారు. జెమినీ ఫిలింస్ సర్య్యూట్ పతాకంపై విజయ్, ఇలియానా జంటగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'స్నేహితుడు'. మరి ముగ్గురి ఇడియెట్స్ సరసన నటించిన ఇలియానా చెప్పిన విషయాలు."ఐదేళ్ళ తరువాత తమిళంలో నటించా. శంకర్ దర్శకత్వంలో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. 'కేడీ' చిత్రం తరువాత తమిళంలో 'నన్బన్' చేశా. ఈ చిత్రం ఇటీవలే విడుదలై విజయవంతమైంది. ఇప్పుడు తెలుగులో కూడా సూపర్‌హిట్ అవుతుందని ఆశిస్తున్నా'' అన్నారు.

ఓపిగ్గా ఉండటం నేర్చుకున్నా.....
సీన్స్ విషయంలో దర్శకుడు శంకర్ చాల పర్టిక్యులర్‌గా ఉంటారు. చాలా ప్లాన్‌గా షాట్స్ తీశారు. అతని నుంచి ఎంతో నేర్చుకున్నా. ముఖ్యంగా ఓపిగ్గా ఉండటం. ప్రతి సీన్‌ని చాలా నాచురల్‌గా వివరిస్తారు. ఈ చిత్రంలో మూడు పాటలుంటాయి. ఒరిజినల్ 'త్రీ ఇడియట్స్'లో ఒకే పాట ఉంటుంది. రెండు పాటలు అదనంగా ఇందులో ఉన్నాయి. నేను ఇందులో ఓ పాటలో చాల కష్టపడి నృత్యం చేశా. ఈ సినిమాలో నేను డాక్టర్‌గా నటించా. నా పాత్రను ఎంతో చక్కగా తీర్చిదిద్దారు నేటి విద్యా వ్యవస్థ మీద తీసిన సినిమా ఇది. ఈ సినిమా చేస్తున్నంత సేపు నా కాలేజి రోజులు గుర్తుకొచ్చాయి. స్టూడెంట్‌గా ఉన్నప్పుడు నేను ఎదుర్కొన్న ఇబ్బందులు, అప్పట్లో చదువు మీద నాకు ఎలాంటి అభిప్రాయం ఉండేది గుర్తుకొచ్చింది.

ఎవరినీ ఫాలో కాలేదు....
ఈ చిత్రంలో నటించక ముందు 'త్రీ ఇడియట్స్' చిత్రం ఐదారు సార్లు చూశా. అందులో కరీనాకపూర్ చేసిన పాత్ర రియలీ అమేజింగ్. ఆమె ఎంతో చక్కగా నటించారు. కానీ నేను ఆమెను ఫాలో కాలేదు. నా స్టైల్లో ఈ చిత్రంలో నటించా. దర్శకుడు చెప్పిందే చేశా. అంతే కానీ ఎవరినీ ఫాలో కాలేదు. కట్, కాపీ, పేస్ట్ నాకు ఇష్టం ఉండదు. ఇది మెసేజ్ ఉన్న సినిమా. నా పాత్రను చూసి చాలా మంది అభినందించారు. ముఖ్యంగా విజయ్. అతను చాలా సింపుల్‌గా ఉంటారు. సినిమా పరిశ్రమలో 17ఏళ్ళుగా ఉంటున్నా ఎంతో వినయంగా అందరితో కలిసి మెలిసి ఉంటాడు. షూటింగ్‌లో అతని క్రమశిక్షణ చూసి ఆశ్చర్యపోయా. అలాగే జీవా, శ్రీకాంత్ కూడా. ఈ సినిమాలో ఎంతో చక్కగా నటించారు.

నాకు ఇక్కడే బాగుంది....
ప్రస్తుతం 'బర్ఫీ' చిత్రంలో నటిస్తున్నా. ఈ చిత్రం జులైలో విడుదల కానుంది. నాకు ప్రియాంకచోప్రాకి మధ్య గొడవలున్నాయని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదు. ఆమె నాకు మంచి ఫ్రెండ్. చాలా మంచి నటి ఆమె. షూటింగ్‌స్పాట్‌లో చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు. ఆమెతో పోటీ పడి నటించా. ఓ సీన్‌లో అయితే బాగా ఏడ్చేశా. ఇందులో నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నా. చాలా టిష్యూ పేపర్లనే వాడాల్సి వచ్చింది. ఈ చిత్రంతో బాలీవుడ్‌లో మంచి బ్రేక్ వస్తుందని భావిస్తున్నా. ఎందుకంటే నా క్యారెక్టర్‌ని దర్శకుడు అనురాగ్‌బసూ అంత చక్కగా తెరకెక్కించాడు. ఈ చిత్రం నాకు బాలీవుడ్‌లోకి హ్యూజ్ వెలకం పలుకుతుందని ఆశిస్తున్నా. అయితే నాకు బాలీవుడ్‌కంటే దక్షిణాది చిత్రాల్లో నటించడమే ఇష్టం. నాకు ఇక్కడే బాగుంది. అవకాశాలొస్తే బాలీవుడ్ ఛాన్సులు వదులుకోను.

నా ఫేవరేట్ దర్శకుడితో మరోసారి....
నాకు గత ఏడాది కొంత నిరాశే మిగిల్సింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 'శక్తి' మూవీ, ప్రయోగాత్మకంగా రూపొందించిన 'నేను నా రాక్షసి' చిత్రం కొంత డిజప్పాయింట్ కల్గించాయి. ఇవి బాక్సాఫీస్ వద్ద ఎందుకు హిట్‌కాలేదో ఇప్పటికీ అర్థం కావడంలేదు. ఈ ఏడాదిని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నా. ప్రస్తుతం నా ఫేవరేట్ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీతో కలిసి నటిస్తున్నా. ఇందులో నా పాత్ర ఏంటనేది ఇప్పుడే రివీల్ చేయను. డెఫినెట్‌గా నా పాత్ర చాలా బాగుంటుంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సినిమా తప్ప మరే సినిమాలోనూ నటించడం లేదు.బాలీవుడ్‌లో కూడా. అక్షయ్‌కుమార్‌తో కలిసి 'కిలాడీ' చిత్రంలో నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లోగానీ, పూరీజగన్నాథ్ దర్శకత్వంలో రవితేజతో కలిసి నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లోగానీ నిజంలేదు. ఇండస్ట్రీలోకి ఎంతమంది హీరోయిన్లు వచ్చినా నాకు పోటీ కాదు. నేను ఎవరికీ పోటీలో లేను. ఇక్కడ చాలా స్పేస్ ఉంది. ఎంత మంది వచ్చినా అవకాశాలు బాగానే ఉంటాయి. అంతేగానీ ఎవరు ఎవరికీ పోటీ కాదు. తెలుగు బాగా నేర్చుకున్న తరువాత తెలుగులో డబ్బింగ్ చెబుతా. డబ్బింగ్ చెబితే అంతా తెలుగమ్మాయి అనుకోవాలి. అప్పుడే డబ్బింగ్ చెబుతా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chit chat with businessman director puri jagannath
Prince mahesh babu at businessman success meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more