Telangana government will honor sania mirza soon for dedicated her us opens doubles match win to telangana

kcr, kcr latest news, sania mirza, telangana brand ambassador sania mirza, sania mirza latest news, sania mirza hot photos, sania mirza us open doubles, sania mirza kcr, kcr met sania mirza, sania mirza kcr news

telangana government will honor sania mirza soon for dedicated her us opens doubles match win to telangana

తెలంగాణాలో అడుగుపెట్టింది.. వరుసగా దోచేసుకుంటోంది!

Posted: 09/10/2014 01:26 PM IST
Telangana government will honor sania mirza soon for dedicated her us opens doubles match win to telangana

(Image source from: telangana government will honor sania mirza soon for dedicated her us opens doubles match win to telangana)

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను సీఎం కేసీఆర్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన విషయం అందరికీ తెలిసిందే! ఆ విషయం అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. ఆ విషయాలను పక్కనపెడితే.. ఈ అమ్మడు ఎప్పటినుంచైతే తెలంగాణాలో అడుగుపెట్టిందో.. అప్పటినుంచి వరుసగా డబ్బులను దోచేసుకుంటోంది. ఇప్పటికే కేసీఆర్ ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన నేపథ్యంలో కోటిరూపాయలు సమర్పించుకున్న విషయం విదితమే! తాజాగా మరోసారి ఈ అమ్మడికి మరిన్ని డబ్బులు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి.

ఇటీవలే జరిగిన యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జా తన అనూహ్యమైన ప్రతిభతో ఘనవిజయాన్ని సాధించింది. చాలారోజుల తర్వాత ఇటువంటి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో యావత్తు భారతదేశం మొత్తం ఆమెను అభినందనలు తెలిపారు. ఇండియాకు మంచి విజయం అందించిన ఆమెకు రాజకీయనాయకులతోపాటు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక, తెలంగాణ రాష్ట్రం కూడా ఆమెకు అభినందనలను తెలుపుకుంది. ఆమెను తెలంగాణాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసి కేసీఆర్ చాలా మంచి పనే చేశారంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సానియా మీర్జా ఇండియాకే కాదు.. తెలంగాణ పరువును కూడా కాపాడిందంటూ పేర్కొంటున్నారు.

ఇదిలావుండగా.. సానియా తన విజయాన్ని తెలంగాణాకు అంకితమిస్తున్నానని ఇదివరకే ప్రకటించింది. అలాగే ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన అనంతరం ఘనవిజయం సాధించడంతో హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం.. త్వరలోనే ఆమెను సన్మానించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. మంగళవారం సానియా సీఎం కేసీఆర్ ను కలిసిన నేపథ్యంలో ఆమెను సన్మానించనున్నట్టు చెప్పినట్లు తెలుస్తోంది. భవిష్యత్ లో సానియాకు ప్రభుత్వం తరఫున కావలసిన సహాయం అందిస్తామని చెప్పిన కేసీఆర్.. విజయాన్ని తెలంగాణ ప్రజలకు అంకితమివ్వడాన్ని ప్రశంసించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  kcr  us open doubles  telangana brand ambassador  

Other Articles