Rory mcilroy breaks off engagement with caroline wozniacki

Rory McIlroy, Caroline Wozniacki, Rory McIlroy Breaks Off Engagement, Rory McIlroy Breaks Off Engagement,

Rory McIlroy Breaks Off Engagement With Caroline Wozniacki

నా లవర్ జీవితం సుఖమయం కావాలి?

Posted: 05/22/2014 03:50 PM IST
Rory mcilroy breaks off engagement with caroline wozniacki

ఏ ప్రేమికుడైన .. తన లవర్ జీవితం సుఖమయం కావాలని కోరుకుంటారా? కానీ గోల్ఫర్ రొరీ మెకిల్‌రొయ్ తేల్చి చెప్పాడు. ప్రపంచ మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణి కరొలిన్ వొజ్నియాకితో ప్రేమాయణం సాగిండం వరకూ సరేగానీ పెళ్లికి మాత్రం కాదని బ్రిటన్ గోల్ఫర్ రొరీ మెకిల్‌రొయ్ తేల్చి చెప్పాడు. ప్రేమించిన మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే వివాహానికి మాత్రం ససేమిరా అన్నాడు. పెళ్లి శుభలేఖను అందరికీ పంచిన తర్వాత తాను పెళ్లికి సిద్ధంగా లేనని అతను ప్రకటించడం సంచలనానికి కారణమైంది. చాలాకారంగా వీరిద్దరి ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది.

ఈఏడాది జనవరి ఒకటిన త్వరలోనే వివాహం చేసుకోనున్నట్టు ఇద్దరూ ప్రకటించారు. ఇటీవల పెళ్లి కూడా ఖాయమైంది. శుభలేఖలు పంచడం పూర్తయింది. అయితే మెకిల్‌రొయ్ హఠాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం తాను వివాహానికి తయారుగా లేనని పేర్కొన్నాడు. వొజ్నియాకి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత కంటే ఎక్కువగా చెప్పలేనని, వొజ్నియాకితో వివాహం జరగదని అతను తెలిపాడు. చాలా సందర్భాల్లో తనకు అండగా నిలిచిన ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని, ఆమె జీవితం సుఖమయం కావాలని కోరుకుంటున్నానని తెలిపాడు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles