• masa
  • masa
Vruschika Raasi

ఆదాయం : 14 వ్యయం : 3 రాజపూజ్యం : 14 అవమానం : 1

ఈ రాశివారి అదృష్టసంఖ్య ‘9’. 1, 2, 3, 4 సంఖ్యలతో కూడిన తేదీలు ఆది, సోమ, మంగళ, గురువారాలతో కలిసి వస్తే యోగప్రదం. నిత్యం వెంకటేశ్వర స్వామి ఆరాధన, శనివార నియమాలు పాటించడం, శనైశ్చరుడికి తైలాభిషేకం చేయడం, పుణ్యక్షేత్ర సందర్శనాలు తరుచుగా చేస్తే గృహశాంతి కలుగుతుంది. స్త్రీలు మణిద్వీప వర్ణన నిత్యం పఠిస్తే సుఖసంతోషాలు కలుగుతాయి.

ఈ రాశివారికి గృహానుగ్రహం సామాన్యం. వివాహాది శుభకార్యాలు సఫలమవుతాయి. గృహనిర్మాణానికై చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. కొన్ని సందర్భాల్లో అకారణ విరోధాలు, అనవసరం ఖర్చులు వుంటాయి. ఉద్యోగులకు, అధికారులకు స్థాననష్టం. బంధుమిత్రులతో సఖ్యతగా వుంటారు. జీవిత భాగస్వామికి అనారోగ్య సూచనలున్నాయి. ఆర్థిక ఇబ్బందులు వున్నప్పటికీ.. ఏదో ఒక రూపంలో డబ్బు సర్దుబాటు అవుతుంది.

వ్యాపారులకు సంవత్సర ప్రథమార్థం మేలు. వ్యవసాయదార్లకు కృషికి, శ్రమకు తగిన ఫలితాలు అనుమానమే! విద్యార్థులు ఏకాగ్రత కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులు తమ చర్యలచే ప్రజల, ప్రభుతవ విశ్వనీయతను కోల్పోతారు. లాయర్లు, ఇతర వృత్తి ఆధారిత వారందరికీ ఎన్నో కష్టాలు. చిరు వ్యాపారులు పై అధికారుల బెడదనను ఎదుర్కొంటారు. అన్నిరంగాల వారికి ఖర్చు, ఆదాయం సముపాళ్లలో వుంటాయి.

సాఫ్ట్‌వేర్ వ్యాపార రంగంలో ఈ రాశివారికి విశేష అనుభవం ఉంటుంది. అలాగే ఎప్పుడూ కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు మదిలో ఎపుడూ కలుగుతూ ఉంటాయి. అయితే వాటిని అమలు చేయటంలో కొంత ఆలస్యం చేస్తారు.

బ్యాంకింగ్ ఉద్యోగస్తులకు, రక్షణశాఖవారికి ఈ సంవత్సర మొత్తం సామాన్యకాలంగా కొనసాగుతుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామిక అధికారులకు ఇది అనుకూలమైన సమయం కాదు.

కుటుంబంసభ్యులతో ఎక్కువగా కలిసిమెలిసి వుండరు. సౌఖ్యత తగ్గుతుంది. కుటుంబంలో అనైక్యతగా వుండడం ఇతరులకు లాభంగా మారుతుంది. ఇతరులు నిందలు మోయడం, గౌరవ మర్యాదలు పోగొట్టుకోవడం జరుగుతుంది.

గృహంలో అశాంతి వాతావరణంలో నెలకొనడంతో మానసిక భయాందోళనలకు గురవుతారు. స్థాన మార్పడిల వల్ల భంగం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తి ప్రాణహాని కలగవచ్చు. అయితే శుభగుని దృష్టి పడటం వల్ల కొంతవరకు శాంతి, ఊరటగా వుండవచ్చు. 

valuprma