• masa
  • masa
Tula Raasi

ఆదాయం : 8 వ్యయం : 8 రాజపూజ్యం : 7 అవమానం : 1

ఈ రాశివారి అదృష్టసంఖ్య ‘6’. 5, 7, 9 సంఖ్యలతో కూడిన తేదీలు బుధ, శుక్ర, శనివారాలతో కలిసి వస్తే యోగప్రదం. శనైశ్చర, రాహు, కేతు జపములు చేయిస్తే శ్రేయస్కరం. దుర్గా, చండీ పారాయణలు, హోమాలు చేయించుట ఉత్తమం. స్త్రీలు విష్ణుసహస్రనామ పారాయణలు, ప్రదోష కాలమున శివదర్శనం చేయడం శుభం.

ఈ రాశివారికి గురుసంచార బలం మోస్తరుగా వున్నా.. ఏడాదిమొత్తం యోగదాయంగానే వుంటుంది. విద్యా, వేద, వైజ్ఞానిక రంగంలో నిత్యం కృషి చేసేవారికి యోగకాలం. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. శనిసంచారం ప్రభావం వల్ల వృధాఖర్చులు, అకారణ విరోధాలు, ప్రతిపని ఆటంకాలతో పూర్తవడం లాంటివి జరుగుతాయి. అధిక ధనవ్యయం, ధననష్టం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. విదేశీ ప్రయాణం అనుకూలత లేదు. ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి కష్టసాధ్యం కాని, అసాధ్యం కాదు.

ఉద్యోగులకు కార్యాలయంలో తన స్థానంలో సంతృప్తి లేకపోవడం వల్ల స్థానమార్పిడికి ప్రయత్నిస్తారు. రుణభారం కొంతమేర తగ్గి, ఆర్థిక వికాసం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో నిరుత్సాహం తప్పదు. రాజకీయ నాయకులకు ఇంట్లోనే పోరుంటుంది. అన్నిరకాల వ్యాపారులు మెలుకువగా వ్యవహరించాలి. సినీవర్గాల వారికి కష్టానికి తగ్గ ఫలితం లభించగలదు.

కొత్త వ్యాపారాలను నిర్వహించుకోవడానికి నిత్యం ప్రయత్నాలు చేస్తూ వుంటారు. అయితే అవి బెడిసికొట్టి ఎటువంటి పలితాలను అందించవు. వ్యవసాయదారులు, శ్రామికులు, ఇంకా అన్నిరంగాలవారు చేసే శ్రమకు సరైన ఫలితం లభించదు.

పెట్టుబడులు పెట్టుకున్న వ్యాపారవేత్తలకు ఎటువంటి ఫలితాలు దక్కవు. వ్యవసాయదారులు, శ్రామికులు శ్రమకు తగ్గ ఫలితాలను పొందుతారు.  సినీ నటులకు, రాజకీయ నాయకులకు, గాయకులకు, ఇతరులకు ఎంత శ్రమించినా.. వారికి కేవలం శ్రమే మిగులుతుంది. వైద్యులు, న్యాయవాదులు, వృత్తి కళాకారుల జీవితంలో ధనవృద్ధి సామాన్యంగానే వుంటుంది. బంగారం, ఇంధనం, వస్త్ర, ధాన్య, కిరణా వ్యాపారస్తులకు అనేక సమస్యలు ఎదురవుతాయి. ఆర్థికంగా ఎటువంటి లాభాలు చేకూర్చవు. వ్యవసాయదారులకు, కార్మికులకు ఈ సంవత్సరం మిశ్రమంగా వుంటుంది.

కుటుంబ సభ్యులతో మనస్పర్థలు, నిత్యం గొడవలు, వివాదాలు జరుగుతాయి. గృహంలో అశాంతి వాతావరణం అలుముకుంటుంది.

ఆరోగ్య విషయాదుల్లో వీరు శ్రద్ద చూపించరు. ఆరోగ్యానికి సంబంధించిన విషమ సమస్యలను ఎదుర్కోవలసి వుంటుంది. నేత్రా బాధలు, శారీరకంగా బాధలను అనుభవించాల్సి వుంటుంది.

valuprma