• masa
  • masa
Midhuna Raasi

ఆదాయం : 11 వ్యయం : 5 రాజపూజ్యం : 2 అవమానం : 2

ఈ రాశివారి అదృష్ట సంఖ్య 5. 1, 3, 6, 8 సంఖ్యలతో కూడిన తేదీలు ఆది, గురు, శుక్రవారాలతో కలిపి వస్తే యోగప్రదం. నిత్యం దత్తేత్రేయ అష్తోత్తర పఠనం, సాయి ఆరాధన, ఈశ్వరారాధన చేస్తూ.. గురు, శుక్రవారా నియమాలు పాటించాలి. బృహస్పతి, రాహువు గ్రహమంత్ర జపములు, ధానములు చేస్తే.. శుభం కలుగుతుంది. స్త్రీలు లలితా అష్టోత్తర, సహస్ర పఠనములు చేస్తే.. బాధల నుంచి విముక్తి కలుగుతుంది.

ఈ రాశివారికి సంవత్సరమంతా శనిబలం యోగదాయకంగా వుంటుంది. గృహనిర్మాణ, స్థిరాస్తి, వృద్ధి, కార్యాలు నిరాటంకంగా కొనసాగుతాయి. తలచిన కార్యాలు శరవేగంగా జరుగుతాయి. సమయానికి ధనం చేతికందడం వల్ల వివిధ రకాలైన కార్యాలు ఉత్సాహంతో పూర్తి చేస్తారు. కొన్నాళ్లపాటు బంధుమిత్రులతో విరోధం పెంచుకున్నప్పటికీ తిరిగి కలుస్తారు. శారీరకపరమైన అనారోగ్యం తప్పదు. ఆర్థికపరమైన లావాదేవీల్లో గతకాలం కంటే అనుకూలంగా కాగలుతాయి. తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణం చేసుకోవడానికి ముందు సమాలోచనలు చేస్తే మంచిది. మొత్తం మీద ఈ సంవత్సరం మిశ్రమ ఫలితం దక్కుతుంది.

విద్యార్థులు చక్కటి కృషితో ముందుకు సాగుతారు. మత్స్య, కోళ్ల పరిశ్రమలకు మంచి గిరాకీ. అప్పుడప్పుడు కొన్ని గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. లాయర్లు, విద్యాశాఖ ఉద్యోగులు, యంత్ర సంబంధ ఇంజనీర్ల వారికి శుభసమయం.

ధనాదాయంలో అంతగా లోపం రాదు కానీ... రాజకీయాల్లో వున్నవారికి, సినీరంగాలలో వున్న వారికి, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నిరాశే మిగులుతుంది. అన్ని రంగాలవారు చాలా కష్టం మీద తమ వ్యాపారాలను, కార్యక్రమాలను కొనసాగిస్తారు.

జీవితంలో ఊహించని మార్పులు సంభవిస్తాయి. నమ్మినవారు సులభంగా నమ్మకద్రోహం చేసి వెళ్లిపోతారు. వాళ్లవల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. ధన నష్టం, ధన వ్యయం ఎక్కువగా అవుతుంది.

వీరు ఇతరులను కూడా తమ కుటుంబ సభ్యల లెక్కలో చూస్తుంటారు. ఇది కుటుంబ సభ్యుల కోపానికి దారితీస్తుంది. మానసిక అశాంతితో నిత్యం దు:ఖంలో వుంటారు. ఇళ్లలో గొడవలు, అశాంతి వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో.. ధనవ్యయం ఎక్కువగా వెచ్చించాల్సి వస్తుంది. 

కోర్టుకు సంబంధించిన సమస్యలు, ఉన్నతాధికారులతో గొడవలు, పోలీస్ స్టేషన్ లలో నిత్యం తగాదాలు జీవితంలో ఊహించని మలుపులకు దారితీస్తుంది. 

మిధునరాశి వారు అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. కుజుడి ప్రభావంవల్ల రక్తపోటు, వైద్య చికిత్సలు, వృత్తిలో మార్పులు సంభవిస్తాయి. గృహం, బయటా వివాదాలు పెరగడంతో శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతారు.

valuprma