• masa
  • masa
Mesha Raasi

ఆదాయం : 14, వ్యయం : 14, రాజపూజ్యం : 3, అవమానం : 6

ఈ రాశివారికి అదృష్టసంఖ్య 9. 1, 2, 3, 6 సంఖ్యలతో కూడిన తేదీలు.. ఆది, బుధ, గురు వారాలతో కలిసి వస్తే మంచి ఫలితం దక్కుతుంది. శని, శుక్రవారాల్లో నియమాలు పాటిస్తూ.. ప్రతినెలలోని మొదటివారంలో శనీశ్వరునికి తైలాభిషేకం చేస్తే మంచి జరుగుతుంది. సోమవారం రుద్రాభిషేకం, స్త్రీలు అమ్మవారి స్తోత్రాలు పఠిస్తే.. అన్ని కార్యాలు బాగా జరుగుతాయి. శని అష్టమరాశి సంచారం కొంత దోషప్రదమంగా వుంటుంది. అనారోగ్య సూచనలు కూడా వున్నాయి కాబట్టి.. జాగ్రత్తగా వుండాలి.

ఈ రాశివారికి గురుబలం అంతగా లేకపోయినా.. తదుపరి సంవత్సరం మాత్రం బాగానే వుంటుంది. ప్రస్తుతం కొనసాగిస్తున్న వృత్తి, వ్యాపారంలో వృద్ధి కలిగి సంతోష జీవనం సాగిస్తారు. జూలై 14వ తేదీ నుంచి అర్ధాష్టమ గురుసంచారం తొలగి, పంచమస్థానం సంచారం వల్ల కార్యసాఫల్యత, సంతాన సౌఖ్యం, సుఖసంతోషాలు కలుగుతాయి. విద్యార్థులకు శ్రమాధిక్య వున్నప్పటికీ.. మంచి ఫలితం పొందుతారు. శనిసంచారం అనుకూలత లేదు కాబట్టి.. మానసిక అశాంతి, కొన్ని సందర్భాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. ఆశించిన కార్యక్రమాలు తగిన రీతిలో ముందుకు సాగకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వ్యాపారస్తులకు సంవత్సర ఉత్తరార్థం బాగానే కొనసాగుతుంది. సినీ, సాంకేతిక, క్రీడా రంగాల వారికి సంవత్సర ప్రారంభం కష్టకాలంగానే వుంటుంది. రాజకీయ, పరిపాలన సంబంధ అధికారులకు పరీక్షకాలంగా వుంటుంది. విదేశీయానం, దూరప్రయాణాలు అంతగా అనుకూలంగా వుండవు కాబట్టి.. జాగ్రత్తలు తీసుకోవాలి. లాయర్లు, ఇంజనీర్లు, కంప్యూటర్ నిపుణులకు, వైద్యులకు శుభం కలుగుతుంది.

మేషరాశికి చెందినవారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు.ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం కలిగి వాటిని అవసర సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలకు చేరుకుంటారు. సిమెంటు, ఇనుము తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో మేషరాశివారు రాణిస్తారు. వీటితోపాటు సూపర్ మార్కెట్లు ప్రారంభించినా లాభాలను సాధిస్తారు. మొత్తం మీద వీరి జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలో పయనిస్తారు.

మేష రాశికి చెందిన వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు.దీనికి కారణం వారి శ్రమ, పట్టుదలే. అత్యంత చతురత మనస్తత్వం కలిగిన వారు కావటంతో ఎక్కడికి వెళ్లినా అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు. వీరి బుద్ధి కులతే వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పవచ్చు.

ఈ రాశికి చెందినవారు తమ కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉంటారు. అదేవిధంగా అత్యంత ప్రేమ పాత్రంగా చూసుకుంటారు.దీనితో వీరంటే కుటుంబంలో ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది. వారు ఏదైనా ఆదేశిస్తే యావత్ కుటుంబం తూ.చ తప్పకుండా పాటిస్తుంది. మొత్తం మీద అత్యంత క్రమశిక్షణ కలిగినవారుగా ఉంటారు.

మేషరాశికి చెందిన వారికి బాల్యంలోనే ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నవారై ఉంటారు. ఫలితంగా కొన్నిసార్లు అప్పటి అనారోగ్య సమస్యలు తిరిగి ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్త్మా వంటి ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు వీరిని చిన్నతనంలోనే బాధిస్తాయి. మామూలు జ్వర సమస్యలు మొదులుకుని కంటి సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు వీరికి వచ్చే అవకాశాలు మెండు. కనుక ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధను ప్రదర్శించాల్సి ఉంటుంది.

valuprma