• masa
 • masa
Meena Raasi

ఆదాయం - 2; వ్యయం - 8; రాజపూజ్యం - 1; అవమానం - 7

మార్చి : వృత్తి వ్యాపారాలయందు కష్టాలు తప్పవు. ఇతరులకు అసాధ్యమైన కార్యాలు ఎంచుకుని, సాధించే ప్రయత్నం చేస్తారు. కొంతవరకు సఫలం కాగలరు. బ్యాంకు రుణాలకోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపార అభివృద్ధికి పాటుపడతారు.

ఏప్రిల్ : వృత్తి నేపథ్యం, ఇతర కార్యాలు పూర్తి చేయడం కోసం అధిక ప్రయాణాలు చేస్తారు. తద్వారా అలసట, మోకాళ్లు - పాదముల స్థానంలో అనారోగ్య సూచనలున్నాయి. ఆర్థికంగా క్రమేజి ముందుంజ లోటు రాదు.

మే : మాసమంతా అనుకూల పవనాలే వీస్తాయి. మనసున తలచిన కార్యాలు నిరాటంకంగా ముందుకు సాగుతాయి. అపూర్వ వస్తు, వస్త్రములకై ధనవ్యయం వెచ్చిస్తారు. విలాస జీవితం కోసం ప్రాకులాడుతారు.

జూన్ : కుటుంబ వాతావరణం సౌఖ్యంగా వుంటుంది. దాయాదులతో వివాదంలో వున్న భూసంబంధ విషయాలు సామరస్య పూర్వకంగా పరిష్కారమవుతాయి. విందు వినోదాలు, స్త్రీ సంతాన అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగులకు ఇష్టపూర్వ స్థల, స్థాన మార్పిడులు.

జూలై : నిర్మాణ రంగంలో వున్న ఉద్యోగులకు ప్రభుత్వం ద్వారా ఇంక్రిమెంట్లు, బోనస్ లు వుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కుటుంబంలో విరోధాలు చోటు చేసుకుంటాయి. పుత్ర, కళత్ర, బంధు సౌఖ్యం.

ఆగస్టు : ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు వుండవు. విద్యావైజ్ఞానిక రంగంలోని వారికి పురోభివృద్ది కలుగుతుంది. ఆలోచనలు పలు విధాలుగా మనసును కలవరపరుస్తాయి. అకారణ విరోధాలు, హిత వాక్యాలు పెడచెవిన పెట్టడం వల్ల నష్టపోతారు.

సెప్టెంబర్ : పలు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. పుణ్యకార్యాలు, దేవతా దర్శనాల యందు ఆసక్తి కలిగి వుంటారు. శ్రమాధిక్యత వున్నప్పటికీ ఫలితం వుంటుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

అక్టోబర్ : ఆదాయ, వ్యయాలకు పొంతన లేక ఆర్థికంగా కొంత ఇబ్బంది కలుగుతుంది. కుటంబంలో విభేదాలు చోటు చేసుకుంటాయి. మనోధైర్యంతో కార్యాలు పూర్తి చేయడానికి ముందుకు సాగుతారు. ధర్మసిద్ధి.

నవంబర్ : కోపతాపాలు, దురుసు ప్రవర్తన వంటి వాటివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. విలువైన వస్తువుల పట్ల అజాగ్రత్తగా వుండటం వల్ల వాటిని కోల్పోతారు. వృత్తివిద్యను నేర్చుకునేవారికి ఆటంకాలు, మానసిక అశాంతి వంటివి బాధిస్తాయి. వ్యాపార స్థలమందు దొంగతనాలు జరిగే అవకాశాలు వున్నాయి.

డిసెంబర్ : సర్వబాధల నుంచి విముక్తి పొందుతారు. పూర్వ పరిచయాలు మేలు కలిగిస్తాయి. బంధుమిత్రుల సహాయంతో ఒక విపత్తు నుంచి గట్టెక్కుతారు. డాంబికమైన కబుర్లు, తనకెదుకు లేదనుకొనుట వంటివి మానసిక దౌర్బల్యములు కలిగిస్తాయి.

జనవరి : చెల్లించవలసిన రుణాలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అనుకోకుండా కలహాలు కలుగుతాయి. సోమరితనం వల్ల, లెక్కలేనితనం వల్ల చాలా నష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. మాసాంతంలో ఆర్థికపరంగా ఎన్నో ఇబ్బందులు. వృత్తివ్యాపారంలో తిరోగమనం.

ఫిబ్రవరి : ఇష్టపూర్వకంగా చేసే కార్యాలు సిద్ధిస్తాయి. అంచనాలు కొంతమేరకు నిజమవుతాయి. గతంలో వున్న సమస్యలు ఇప్పుడు కాస్త తొలిగి స్పష్టత ఏర్పడుతుంది. విద్యార్థిలోకం ప్రతి నిముషం కష్టించవలసి వుంటుంది.

మార్చి : శుభకార్య మూలక ధనవ్యయం ఎక్కువగా వెచ్చిస్తారు. వృత్తివ్యాపారాల్లో గతంకంటే మేలు, క్రమేపి ధనసంపాదన పెరుగుతుంది. నూతన గృహనిర్మాణం లేదా ప్రస్తుతమున్న గృహంలో మార్పుచేర్పులు చేస్తారు.

rashi
 • Mesha Raasi
 • Vrushaba Raasi
 • Midhuna Raasi
 • Karkaataka Raasi
 • Simha Raasi
 • Kanya Raasi
 • Tula Raasi
 • Vruschika Raasi
 • Dhanus Raasi
 • Makara Raasi
 • Kumbha Raasi
 • Meena Raasi
 

valuprma