• masa
 • masa
Kumbha Raasi

ఆదాయం - 5; వ్యయం - 2; రాజపూజ్యం - 5; అవమానం - 4

మార్చి : ఏ పని తలచినా దానికోసం అధికంగా శ్రమించాల్సి వస్తుంది. అనుకోకుండా విరోధాలు పెరుగుతాయి. అనారోగ్యం సమస్యలు తలెత్తుతాయి. భోజనం సౌఖ్యంగా లేకపోవడం, అపవాదములు ఎదుర్కోవలసి వస్తుంది. చివరి వారంలో దాయాదులతో చర్చాకార్యక్రమాలు జరుపుతారు.

ఏప్రిల్ : సినీ, నట, గాయక రంగముల వారికి శ్రమకు తగిన ఫలితాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు వృద్ధి కలుగుతుంది. విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. కుటుంబ వాతావరణం సంతోషకరంగా వుంటుంది.

మే : మనసులో తలచిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. పిల్లల విద్యాప్రమాణాల గురించి యోచిస్తారు. ఇష్టద్రవ్య ప్రాప్తి. వ్యాపారజనులకు వృద్ధి. సకల జనామోదమైన మాటలు, వ్యవహారాలు వన్నె తెస్తాయి.

జూన్ : అనారోగ్య సూచనలున్నాయి. మనసున కొన్ని దురాలోచనలు మెదులుతాయి. జీర్ణసంబంధమైన అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాదులందు అనాసక్తి కలుగుతంది.

జూలై : కోపతాపాలు అదుపులో వుంచుకుంటే మంచిది. లేకపోతే అనూహ్య సంఘటనలు, రిక్కులు ఎదురవుతాయి. సరదా సంభాషణలు వికటిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శన, సహనంతో మెలుగుట.

ఆగస్టు : భూ సంపాదన కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కొన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంతో ముందుకు సాగుతారు. సంఘంలో కీర్తిప్రతిష్టలు కలుగుతాయి. విద్యావంతులైన స్నేహితుల సాయంతో కొన్ని విషయాలు పరిష్కరించుకోగలరు.

సెప్టెంబర్ : ప్రభుత్వ సంబంధిత, కోర్టు వ్యవహారాల యందు ఆచితూచి వ్యవహరించాలి. మాటతొందర, కంగారుల వల్ల చిక్కుల్లో పడతారు. కొన్ని సందర్బాల్లో కష్టాలు తప్పవు.

అక్టోబర్ : ఏ కార్యం మొదలుపెట్టిన అధికంగా శ్రమించక తప్పదు. శ్రమైక జీవనం కొనసాగిస్తారు. వృత్తిలో అనుకోకుండా కొన్ని సమస్యలు ఎదరవుతాయి. ప్రభుత్వోద్యోగులకు సహనానికి పరీక్ష. ఉద్యోగవశాత్తూ తప్పని దూరప్రయాణాలు. శ్రీమంతులతో వైరం అయినప్పటికీ ధైర్యంతో పోరాడుతారు.

నవంబర్ : పిల్లల భవిష్యత్ గురించి ప్రణాళికలు చేస్తారు. విద్యాసంబంధ విషయాల్లో తలమునకలై పోతారు. బంధుమిత్రులతో సమావేశాలు నిర్వహిస్తారు. ప్రభుత్వం వారి నుంచి సహకారములు లభిస్తాయి.

డిసెంబర్ : చేయని తప్పుకు నీలాపనిందలు భరించాల్సిందేకాక వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ముఖ్యమైన వారి ఆరోగ్యం ఆందోళనకు గురిచేస్తుంది. వృత్తివ్యాపారాలయందు చురుకుతనం పాటించాలి.

జనవరి : ముఖ్యమైన కార్యాల్లో తత్తరపాటుకు గురికావడం వల్ల ఆ కార్యం నిలిచిపోవడం లేదా వాయిదా పడటం జరుగుతుంది. నిరంతర శ్రమించడం వల్ల అది ఆరోగ్యంపై ప్రభావితం చూపుతుంది. రాజకీయ రంగంలో వున్నవారికి పదవి గండం తప్పదు.

ఫిబ్రవరి : రుణాలకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టకార్య సిద్ధి. వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది. కుటుంబవాతావరణం సంతోషంగా సాగుతుంది. పాత మిత్రులను తిరిగి కలుసుకుంటారు.

మార్చి : శుభకార్యం చేపట్టడం వల్ల ధనవ్యయం అధికమవుతుంది. అలాగే ధనలాభములు చేకూరుతాయి. ప్రయత్నం చేస్తే ఏ పనినైనా ముగించగలరు. మనోబలంతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. మానసిక ఒత్తిళ్లు తప్పవు.

rashi
 • Mesha Raasi
 • Vrushaba Raasi
 • Midhuna Raasi
 • Karkaataka Raasi
 • Simha Raasi
 • Kanya Raasi
 • Tula Raasi
 • Vruschika Raasi
 • Dhanus Raasi
 • Makara Raasi
 • Kumbha Raasi
 • Meena Raasi
 

valuprma