• masa
  • masa
Tula Raasi

ఆదాయం - 8; వ్యయం - 8; రాజపూజ్యం - 7; అవమానం - 1

మార్చి : ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. పరోపకార బుద్ధి కలిగి వుంటారు. కుటుంబ వాతావరణం కాస్త అసౌకర్యంగానే వుంటుంది.

ఏప్రిల్ : కోపతాపాలు అదుపులో వుంచుకుంటే కొన్ని కార్యాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు, ప్రభుత్వాధికారులకు కాలపరీక్ష. మాసారంభంలో తీర్థయాత్రలు, సద్గురువుల ప్రవచనాలు ప్రభావితం చేస్తాయి.

మే : నూతన వస్త్ర, వస్తువుల కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. స్త్రీ సతానానికి వృద్ధి, శుభవార్తా శ్రవణం. ఇష్టార్ధ లాభం.

జూన్ : కుటుంబ వాతావరణం అసౌఖ్యంగా వుంటుంది. శతృ, రోగ భయం, మనోవ్యాకులం వంటివి చికాకు పెడతాయి. కొన్ని సమస్యలను బలప్రయోగం వల్ల కాకుండా సహన శాంతములతో పరిష్కరించగలమని గ్రహిస్తే మంచిది.

జూలై : ఆప్తుల కోసం ఎక్కువ శ్రమిస్తారు. సోదర, బంధు, మిత్రులతో నూతన విభేదాలు తలెత్తగలవు. పశు, ధననష్టం, ప్రభుత్వోద్యోగులకు జీతాల్లో పెరుగుదల వుంటుంది.

ఆగస్టు : ఉద్యోగులకు అప్రయత్నంగానే పదోన్నతి కలగడం వల్ల స్థానచలనం జరుగుతుంది. శ్రమైన జీవనం వున్నప్పటికీ.. సత్ఫలితం పొందుతారు. కొన్ని స్పర్థలు వున్నప్పటికీ.. సర్దుకుని ముందుకు సాగుతారు.

సెప్టెంబర్ : వృత్తి వ్యాపారాలు సక్రమంగానే జరుగుతాయి. అన్నిరంగాల వారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇష్టపూర్వకంగా బదిలీలకు యత్నించేవారు సఫలం కాగలరు. ఉద్యోగులకు పై అధికారులతో సదవగాహనలు వుంటాయి.

అక్టోబర్ : ఈ మాసారంభంలో బంధుమిత్రాదులతో స్వల్ప విరోధములు కలిగే సూచనలున్నాయి. అయితే మాసం గడిచేకొద్దీ సర్దుకుంటాయి. ఒక కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది.

నవంబర్ : అన్ని రంగాల వారికి ఈమాసం పరీక్షాకాలం. ప్రయత్నిస్తే ఏ కార్యంలోనైనా సిద్ధి కలుగుతుంది. ధైర్యంతో ముందుడుగు వేస్తూ కష్టానష్టాలను ఎదుర్కొంటారు. కుటుంబ వాతావరనం సంతోషకరంగా వుంటుంది.

డిసెంబర్ : సోదరసోదరీగణంతో మనస్పర్థలు తొలిగి, స్నేహ హస్తం అందిస్తారు. విద్యార్థులకు కృషి విఘ్నములు, చదువు యందు ఆసక్తి లేకపోవడం వల్ల పరాజయాన్ని చవిచూస్తారు.

జనవరి : కడుపునందు ఓ మోస్తరు నొప్పి వుండుట వల్ల శస్త్రచికిత్సలు చేయించుకుంటారు. స్త్రీలక్కూడా అనారోగ్య సూచనలున్నాయి. గతమాసంలో పెట్టిన పెట్టుబడులు ప్రస్తుతం ఫలిస్తాయి.

ఫిబ్రవరి : మంచివస్త్రాలను ధరించడం వల్ల సంకల్పం. పరోపకారం చేయాలని ఉద్దేశం కలిగి వుంటారు. పుణ్య నదీ స్నానం చేస్తే యోగప్రదం. కోర్టు సంబంధ వ్యవహారాలయందు అస్పష్టత.

మార్చి : మాతృ మూలకమైన ధనలాభం, వారసత్వ సంపదకోసం చేయు ప్రయత్నాలు ముందడుగు వేస్తాయి. కుటుంబ వాతావరణం స్నేహపూర్వకంగా వుంటుంది. శుభకార్యాలకు హాజరగుట, స్వయంగా ఆచరించుట వంటివి జరుగుతాయి.

rashi
  • Mesha Raasi
  • Vrushaba Raasi
  • Midhuna Raasi
  • Karkaataka Raasi
  • Simha Raasi
  • Kanya Raasi
  • Tula Raasi
  • Vruschika Raasi
  • Dhanus Raasi
  • Makara Raasi
  • Kumbha Raasi
  • Meena Raasi
 

valuprma