• masa
  • masa
Midhuna Raasi

ఆదాయం : 11 వ్యయం : 5 రాజపూజ్యం : 2 అవమానం : 2

మార్చి : ఆరోగ్య సౌఖ్యం, ఆశించిన ధన, ద్రవ్య, వస్తు లాభం చేకూరుతుంది. పై అధికారులతో అనుకూల సంభాషణలు కలుగుతాయి. ఉద్యోగులు ఉద్యోగదర్పం వల్ల అధిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మాసారంభంలో విందువినోదాల్లో పాల్గొంటారు.

ఏప్రిల్ : బంధుమిత్రులతో ప్రేమాభిమానాలు పెరుగుతాయి. కష్టంలో వున్నవారికి ధైర్యవచనాలు, ఉపకారం చేస్తారు. సోమరితనాన్ని జయిస్తే మరింత వృద్ధి కలుగుతుంది.

మే : ప్రతీ పని, వ్యవహారంలో జయం సాధిస్తారు. అప్రయత్నకార్య లాభం కలుగుతాయి. ఆరోగ్యం మిశ్రమంగా వుంటుంది. ఆర్థికసంబంధ విషయాల్లో నిపుణులతో చర్చలు జరుపుతారు.

జూన్ : ఉద్యోగులకు ఆశించిన స్థానం లభించకపోవడంతోపాటు పై అధికారుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారంనందు ఆసక్తి వుండదు. ప్రతిపనిని కష్టంగా భావిస్తారు. స్త్రీలు వంటవార్పులు సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

జూలై : శరీర ఉష్ణం పెరగడం, దుస్వప్నాలు రావడం, కుటుంబసభ్యుల నుంచి అప్పియ వాక్యాలు వంటివి వుంటాయి. కొన్ని సందర్భాల్లో విపరీత ధోరణులు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తాయి.

ఆగస్టు : తలచిన కార్యాలు ముందుకు సాగుతాయి. మధ్యలో ఎన్ని ఇబ్బందులో వచ్చినప్పటికీ వాటిని పూర్తి చేస్తారు. విద్యార్థులు కృషి, శ్రద్ధ కలిగి వుంటారు. మాసాంతంలో కార్య ఉత్సాహం. అవసరానికి ధనప్రాప్తి.

సెప్టెంబర్ : వ్యాపార వర్తకులకు అనుకూలమైన కాలం. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఆశించిన మేర లభించకపోయినప్పటికీ.. కొంతవరకు పొందగలరు.

అక్టోబర్ : కోర్టు, ప్రభుత్వ సంబంధ వ్యవహారాల్లో జయం పొందుతారు. వాక్చాతుర్యంతో అధికారులను దారిలోకి తెచ్చుకుంటారు. సోదర, సోదరీమణులతో అనుకూల వాతావరణం ఆస్తి విభజన కార్యక్రమాలు జయప్రదంగా పూర్తిచేస్తారు.

నవంబర్ : శ్రమకు తగిన ఫలితం చేకూరుతుంది. సినీ, నాటక రంగంలో వున్నవారికి పురస్కార, సన్మానాలు కలుగుతాయి. గృహవాతావరణం బంధుమిత్రులతో కళకళలాడుతూ ఆహ్లాదకరంగా వుంటుంది. చిరువ్యాపారులు లాభబాటలో పయనిస్తారు.

డిసెంబర్ : ఆరోగ్య విషయమై జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది. ఆసుపత్రి సందర్శనలు తప్పక పోవచ్చును. ప్రభుత్వ సంబంధిత, కోర్టు వ్యవహారాల యందు అక్షింతలు.

జనవరి : కోపతాపాలను అదుపులో వుంచుకోవాలి. మాసారంభంలో అపవాదములు కలిగినా క్రమంగా తొలిగిపోతాయి. తీర్థయాత్రలు చేయుట, సంకల్పములు, బీజావాపన జరుగుతుంది.

ఫిబ్రవరి : అత్యుత్సాహం వల్ల కార్యభంగం కలుగుతుంది. పూర్తిగా వచ్చిన వ్యవహారాలు, కార్యాలు మళ్లీ ప్రారంభదశకు చేరుకోవడంతో నిరుత్సాహంగా వుంటారు. ఆర్థిక సంబంధ విషయాల్లో నూతన వ్యక్తులను నమ్మకూడదు. మెలుకువగా పాటించాల్సి వుంటుంది.

మార్చి : ఇతరులకు చెల్లించాల్సిన బాకీల విషయంలో ఎప్పటికప్పుడు విశ్లేషణలు చేయడం మంచిది. ముఖ్యమైన కార్యాల్లో బద్ధకం ప్రదర్శించి చిక్కులు కొనితెచ్చుకుంటారు. పూర్వ స్నేహితులను కలుసుకుంటారు. మనోల్లాసం, ధర్మసిద్ధిని పొందుతారు.

rashi
  • Mesha Raasi
  • Vrushaba Raasi
  • Midhuna Raasi
  • Karkaataka Raasi
  • Simha Raasi
  • Kanya Raasi
  • Tula Raasi
  • Vruschika Raasi
  • Dhanus Raasi
  • Makara Raasi
  • Kumbha Raasi
  • Meena Raasi
 

valuprma