• masa
 • masa
Vrushaba Raasi

ఆదాయం : 8, వ్యయం : 8, రాజపూజ్యం : 6, అవమానం : 6

మార్చి : వృత్తి, వ్యాపారాల్లో అనుకూలత వుంటుంది. దేహ అసౌఖ్యం వున్నప్పటికీ ధైర్య వచనాలు, గాంభీర్యం ప్రదర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అలసత్వం, బద్ధకం వుంటాయి.

ఏప్రిల్ : కొన్ని విపత్కర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటారు. స్నేహితులతో, ఇతరులతో ప్రవర్థించేటప్పుడు తొందరపాటు వల్ల వైరుధ్యాలు పొడచూపగలవు. పెట్టుబడుల విషయాల్లో అవగాహన కలిగి వుంటే మేలు.

మే : స్థాయిక తగిన విధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార విస్తరణకోసం చేసే ప్రయత్నాలు కొంతమేర ఫలిస్తాయి. మాతృసౌఖ్యం, ఆశీర్వచనాలు లభిస్తాయి.

జూన్ : ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో వుంది. కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతాయి. ఆలోచనాశక్తి మందగించడం, తప్పుడు నిర్ణయాలు, సరైన మార్గ నిర్దేశకత్వం లేకపోవడం వల్ల ఈ మాసం ప్రతికూలంగా వుంటుంది.

జూలై : కొత్త వస్తువులు, వస్త్రాలకై ధనవ్యయం చేస్తారు. పితృమూలకంతో సౌఖ్యం పొందుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఇబ్బందులు. మాటకు విలువ వుండదు.

ఆగస్టు : ఈనెలారంభంలో అన్ని పనుల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటారు. శ్రవణానందకరమైన సమాచారం లభిస్తుంది. ధనధాన్య వృద్ధి వుంటుంది. స్త్రీ వల్ల అధికంగా ధనలాభం పొందుతారు. వ్యాపారంలో లాభాలు, మాతృసౌఖ్యం, మనోవాంఛిత వస్తు లాభాలు కలుగుతాయి.

సెప్టెంబర్ : అసౌఖ్య భోజనం, పనులయందు బద్ధకంగా వుంటారు. కొన్ని పనులను వాయిదా వేయడం వల్ల నష్టాలెదుర్కొంటారు. కుటుంబసభ్యుల్లోనే విరోధాలు, మాటపట్టింపులు పెరుగుతాయి. ఈ నెలాఖరున కుటుంబసభ్యులతో విందు, వినోదాలు, ఆహ్లాదకర కాలక్షేపం చేస్తారు.

అక్టోబర్ : శారీరక అసౌఖ్యం. ఇతరుల గురించి ఈర్ష్యాద్వేషాలు ప్రదర్శిస్తారు. అనవసర ఖర్చులు చేయడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. సమయానికి డబ్బూ అందదు. మాసాంతంలో అన్ని ఇబ్బందులు తొలిగి, సకల కార్యవృద్ధి కలుగుతుంది.

నవంబర్ : కుటుంబ వాతావరణం అనుకూలత లేదు. మీదొకదారి, కుటుంబసభ్యులది మరొకటి అన్నట్లుగా వుంటుంది. సమయానికి భోజనం లేకపోవడంతో ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు మంచివే.

డిసెంబర్ : దాయాదులతో కలహాలు పెరుగుతాయి. కడుపు స్థానం వద్ద అనారోగ్య సూచనలున్నాయి. ప్రభుత్వ సంబంధ వ్యవహారాల్లో అక్షింతలు. స్వల్పకాలిక ఒప్పందాలు మంచి చేస్తాయి. ఇదివరకు చేసిన వాగ్ధానాలను ఆచరిస్తారు.

జనవరి : పూర్వ పుణ్యకారాలు మళ్లీ చేయాలని అనుకుంటారు. ధనధాన్య, వస్త్రలాభాలు పొందుతారు. పెట్టుబడుల్లో జోరందుకుంటారు. యశస్సు, మనోల్లాసం అధికంగా పొందుతారు.

ఫిబ్రవరి : పై అధికారుల నుంచి మన్ననలు పొందుతారు. కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. మాసాంతంలో ముఖ్య వ్యవహారాల్లో అనాలోచనతో చేయు వ్యాఖ్యలు ఇబ్బందులు తెచ్చిపెడతాయి. స్త్రీ విషయాల్లో జాగ్రత్తగా వుండాలి. మాట తొందరపాటు వల్ల పలు చిక్కులు వచ్చిపడుతాయి.

మార్చి : ఈ మాసమంతా శుభాశుభ మిశ్రమంగా వుంటాయి. చేయని పనికి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శతృవృద్ధి కలుగుతున్నట్లు భావించాలి. ఆరోగ్య విషయంలో వైద్య సలహాలు పాటించాల్సి వస్తుంది.

rashi
 • Mesha Raasi
 • Vrushaba Raasi
 • Midhuna Raasi
 • Karkaataka Raasi
 • Simha Raasi
 • Kanya Raasi
 • Tula Raasi
 • Vruschika Raasi
 • Dhanus Raasi
 • Makara Raasi
 • Kumbha Raasi
 • Meena Raasi
 

valuprma