జుట్టు సంబంధిత సమస్యల నుంచి వెంటనే ఉపశమనం పొంది, వాటిని నిత్యం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా వుంచుకోవాలంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుందని బ్యూటీషియన్లు అంటున్నారు. తరచూ ఇతర ప్రోడక్టులు వాడటం కంటే ప్రకృతి సహజంగా లభించే పదార్థాల ద్వారా రెమెడీలు చేసుకుని, జుట్టుకు తగిలిస్తేనే చాలా శ్రేయస్కరమని వారు అంటున్నారు. పైగా.. ఈ రెమెడీలను ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా...
* వగరుగా ఉండే ఉసిరి... జుట్టుకెంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అది వెంట్రుకల కుదుళ్లకు దృఢంగా, ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. ఉసిరికాయల్ని బాగా ఎండబెట్టి వాటిని, కొన్ని కుంకుడు కాయల్ని, శీకాయల్ని కలిపి నీళ్లలో వేసి పది నిమిషాల పాటు ఉడకబెట్టాలి. ఈ మిశ్రమంతో మాడునీ, వెంట్రుకల్నీ శుభ్రం చేసుకుంటే మురికి మొత్తం పోతుంది. ఈ మిశ్రమాన్ని షాంపూల్లా కూడా వాడుకోవచ్చు. ఈ ఉసిరితో మరో రెమెడీ కూడా చేయొచ్చు. ఉసిరి పొడికి కాస్త నిమ్మరసం కలిపి దాన్ని మాడుకి రాసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా తరచూ చేస్తుంటే హెయిర్ ఫాల్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఉసిరి రసాన్ని హెన్నాలో కలిపి తలకు పెట్టుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. వెంట్రుకలు నల్లబడవు. జుట్టు కావాల్సిన పోషకాలూ అందుతాయి.
* డ్రై ఫ్రూట్స్‌తో హెల్దీ హెయిర్ పొందాలంటే ఈ టిప్స్ పాటించండి. వాల్ నట్స్‌లో విటమిన్ ఈ ఎంతగానో తోడ్పడుతుంది. కేశాలకు కావలసిన పోషకాలు అందించే గుణాలు ఇందులో మెండుగా ఉన్నాయి. ఇది తల మాడుకు రక్త ప్రసరణను బాగా అందజేస్తుంది. అంతే కాదు వాల్ నట్స్‌లో జింక్ అధిక శాతం కలిగి ఉంటుంది. జింక్ శరీరానికి అంధించడం వల్ల కేశాలకు మంచి మెరుపు వస్తుంది. అలాగే ఎండు ద్రాక్షలో ఐరెన్ ఎక్కువగా ఉండి, రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచి శరీరానికికే కాకుండా కేశాలకు అందజేస్తుంది. కేశాలకు తగినంత రక్త ప్రసరణ జరిగేందుకు కావల్సిన హెయిర్ పాలిసెల్కు కావల్సిన న్యూట్రియట్స్‌ను అందజేస్తుంది. అలాగే రోజుకు రెండు బాదం గింజల్ని తీసుకోవడం ద్వారా జుట్టును దట్టంగా పెంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
* కొబ్బరినూనెలో వెల్లుల్లి పాయలను వేసి ఉడికించాలి. ఆపైన వడకట్టి, నూనెను సీసాలో నిల్వ చేసుకుని రోజూ రాసుకుంటూ ఉంటే వెంట్రుకలు క్రమంగా నల్లబడిపోతాయి. జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే.. ఉల్లిపాయను మెత్తని పేస్ట్‌లా చేసి, దానిలో కాసింత తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి. కొన్నాళ్లపాటు వారానికోసారి ఇలా చేస్తే ఫలితముంటుంది. దుమ్ము, ధూళి పేరుకుపోయి ఒక్కోసారి జుట్టు నిస్సారంగా తయారైతే.. అలాంటప్పుడు గోరింటాకు రుబ్బి, అందులో బీట్ రసాన్ని కలిపి తలకు పట్టించి, ఆరిన తర్వాత కుంకుడుకాయ రసంతో తలంటుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే వెంట్రుకలు మెరుపులీనుతాయి.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more