Occasionally makeup tips

makeup tips

makeup tips

ప్రత్యేక సందర్భాల్లో మేకప్ కొరకు

Posted: 05/10/2013 08:37 PM IST
Occasionally makeup tips

పెళ్లిళ్లకు హాజరవ్వడం దగ్గరినుండి , చుట్టాల ఇంట్లో చిన్న పార్టీ వరకు , నలుగురితో మెలగడం ఈ మధ్య ప్రతీ ఇంట సర్వ సాధారణం అయిపొయింది . ఇటువంటి సమయం లో మన సహజ సౌందర్యానికి కాస్త మెరుగులు దిద్దుకుని , సందర్భం ఏదైనా మెరిసిపోయేలా కనిపించడం ఎంతైనా అవసరం . మరి దీని కోసం మెక్ అప్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంటే;

కళ్ళకు మించిన సౌందర్యం లేదు . కోటి భావాలని కళ్ళు పలికిస్తాయి . అలాగే , కళ్ళకు సంరక్షణ గా నిలిచే కనుబొమ్మలు కూడా . కనుబొమ్మలు , రెప్పలు అందంగా కాస్త ఒత్తుగా ఉంటె , ముఖానికే కొత్త అందం ఒచ్చినట్టుగా ఉంటుంది . మరి ఇలా ఉండాలంటే , తీరైన కనుబొమ్మలని , పెన్సిల్ తో దిద్దుకోవడం తో పాటు , కనురెప్పలకు మస్కారా మొదళ్ళ నుండి అద్దాలి . అయితే ఈ మస్కారా వాటర్ ప్రూఫ్ అయితే మరీ మంచిది .

లిప్ స్టిక్ లు , లిప్ లైనర్ లు ఎక్కువ సేపు మీ పెదాల పై చెక్కు చెదరకుండా , స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే , ఇవి వాడే గంట ముందు వరకు , వీటిని ఫ్రిజ్ లో ఉంచడం ఉత్తమం . పగటి పూట వెళ్ళే పార్టీలకు న్యాచురల్ కలర్లో ఉన్న లిప్ స్టిక్ లు , లిప్ లైనర్ లు , రాత్రి పూట పార్టీలకు ముదురు రంగులు ఉపయోగించడం ఉత్తమం .

మీ కళ్ళు పెద్దగా , మెరుస్తున్నట్టుగా కనిపించాలి అనుకుంటున్నారా ? అయితే నలుపు రంగు ఐ లైనర్ కి బదులుగా , బ్రవున్ కలర్ వాడండి . కాస్త మన్దమ్ గా , కంటి చుట్టూ లైనర్ ని గీయండి . మెరిసే కళ్ళ కోసం , కాస్తంత షిమ్మర్ కంటి చుట్టూ రాయండి ...

ఫవుండేషన్ మీ స్కిన్ టోన్ కి తగ్గట్టు గా ఉండేలా జాగ్రత్త తీసుకోండి . చిక్ రోజ్ న్యాచురల్ కలర్ నే వాడండి ... పింక్ , రెడ్ కలర్లు మరీ ముదురుగా ఉన్నవి ఎంచుకుంటే , మన అందాన్ని ఇవి డామినేట్ చెయ్యడమే కాకుండా , ఒకింత ఇబ్బందికరంగా మన ఆహార్యం కనిపించేందుకు ఆస్కారం ఎంతైనా ఉంది .

ఎలా చూసినా , మన అందం ఎదుటివారు చూడటానికి , మనకీ కూడా ఇబ్బందిగా మారకూడదు గా మరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more