The historical story of warangal district

warangal, waranga district, warangal latest news, warangal story, history of warangal, warangal history, temples in warangal, the historical story of warangal

the historical story of warangal district where the number of old temples are availbable

‘‘వరంగల్’’లో దాగివున్న అద్వితీయమైన చరిత్ర!

Posted: 09/12/2014 04:20 PM IST
The historical story of warangal district

(Image source from: the historical story of warangal district)

యావత్తు ప్రపంచం మొత్తంలో ఎక్కడాలేని విధంగా కేవలం మన భారతదేశంలో మాత్రమే చారిత్రాత్మక కట్టడాలు అద్భుతంగా రూపుదిద్దుకుని వున్నాయనే విషయం అందరికీ తెలిసిందే! అతి ప్రాచీనకాలానికి చెందిన దేవాలయాలతోపాటు ఎన్నో ప్రతిష్టాత్మక కట్టడాలు నేటికీ చెరిగిపోకుండా అలాగే వున్నాయి. ప్రస్తుత కాలానికి అనుగుణంగా మార్పు చెందుతూ వస్తున్నాయి. రానురాను కాలక్రమంలో కొన్ని అంతరించిపోయినప్పటికీ.. మరికొన్ని ప్రాంతాలరూపంలో అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. అందులో వరంగల్ ప్రదేశం కూడా ఒక్కటి! ప్రస్తుతం సాంకేతికపరంగా ముందుకు దూసుకుపోతున్న ఈ ప్రాంతం... ఒక చరిత్ర కల భూమి!

తెలంగాణా రాష్ట్రంలో వుండే ఈ వరంగల్.. పురాతన కాలంలో ఓరుగల్లు లేదా ఒంటికొండగా పిలువబడేది. ఎందుకంటే.. ఈ ప్రాంతమంతా కేవలంస ఒకే రాతిలో వుండటం వల్ల దీనికాపేరు వచ్చింది. అంతేకాదు.. ఇది కాకతీయుల రాజ్యానికి రాజధానిగా వుండేది. అందుకు ఆధారంగా వారికి సంబంధించిన ఎన్నో శిధిలాలు వున్నాయి. వీటితోపాటు అక్కడ చూడదగిన పర్యాటక ప్రాంతాలు ఎన్నో వున్నాయి. వాటిలో ముఖ్యమైంది వరంగల్ కోట. దీని గురించి మార్కోపోలో తన ట్రావెల్ డైరీలో కూడా పేర్కొన్నాడు. అలాగే ఈ ప్రాంతంలో పాకాల సరస్సు, వేయి స్తంభాల గుడి, రాక్ గార్డెన్, ఇంకా తదితర పర్యాటక ప్రదేశాలు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి.

1000-pillars-temple

వేయి స్తంభాల గుడి : వరంగల్ లో చారిత్రాత్మక కల భూమిగా ప్రసిద్ధి చెందిందనడానికి ఈ గుడి అక్కడ సాక్షాత్తూ ఆధారంగా వుంటుంది. ఇందులో ప్రాచీన కాలానికి చెందిన కొన్ని ప్రత్యేకమైన శిల్పాలు చెక్కబడి వున్నాయి. అలాగే విష్ణు, శివుడు, సూర్యభగవానుడు తదితర దేవుళ్ల విగ్రహాలు కూడా ఎంతో అద్భుతంగా దర్శనం ఇస్తుంటాయి. ఈ దేవాలయ శిల్పశైలి వర్ణనాతీతం. ఇక్కడ నిత్యం పర్యాటకుల సంచారం వుంటుంది.

warangal-fort

వరంగల్ కోట : దక్షిణ బారతదేశ చరిత్రలో విశిష్టమైన నిర్మాణశైలిగా ఇది ప్రథమ స్థానాన్ని ఆక్రమించుకుంది. ఇది చాలా ప్రాచీనకాలం నాటికి చెందింది కాబట్టి.. ప్రస్తుతం కొంతమేర శిథిలమైనట్టుగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఇది ఎంతో ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ ఈ కోట లోపల వున్న భాగాలు ఎంతో అందంగా దర్శనమిస్తుంటాయి.

bhadarkali-temple-warangal

భద్రకాళి టెంపుల్ : వరంగల్ లో వున్న అతిపురాతనమైన ఆలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయానికి చుట్టూ ఆనాటి కాలానికి చెందిన వివిధ రాతి నిర్మాణాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ దేవాలయంలో వున్న భద్రకాళి మాత విగ్రహం చక్కని అలంకరణతో, వివిధ ఆయుధాలతో దర్శనం ఇస్తుంది.

padmakshi-temple-waranga

పద్మాక్షి టెంపుల్ : 12వ శతాబ్దం నాటి కాలానికి చెందిన అతి పురాతనమైన ఆలయం ఇది. దీనిని అనకొండ స్థంబం అని కూడా అంటారు. దీని నిర్మాణం ఎంత అద్భుతంగా వుంటుందంటే.. చూసిన ప్రతిఒక్కరూ ఆశ్చర్యపడక తప్పదు. ఈ స్థంబంపై అందమైన చెక్కడాలు, శాసనాలు కూడా వున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : warangal  telugu temples  telangana state  historical stories  telugu news  

Other Articles