Diwali 2013 special article

diwali 2013 special article, Diwali celebrations , Diwali celebrations 2013, iwali, safety, measures, crackers, dos, donts, fireworks

diwali 2013 special article, Diwali celebrations , Diwali celebrations 2013, iwali, safety, measures, crackers, dos, donts, fireworks

దీపావళీ పండగ గురించి

Posted: 11/02/2013 12:18 PM IST
Diwali 2013 special article

భూమి మీద ఒకప్పుడు అందరికీ వెలుగు అందకుండా దూరం చేసిన వాడొకడు ఉండేవాడట. అందుకే వాడు చనిపోతే అందరూ కరువుతీరా దీపాలు వెలిగించుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు. ఎన్నో వరుసలలో దీపాలు వెలిగించుకున్నారు కనుక ఈ వేడుకని దీపావళి అన్నారు. లోకంలో కావలసిన వాటిని, కోరుకోదగిన వాటిని వెలుగుగాను, పనికి రాని వాటిని, హాని కలిగించేవాటిని చీకటిగానూ చెబుతుంటాము.

అవిద్య, అజ్ఞానం, అనారోగ్యం, దుఃఖం, బాధ, చికాకు, దరిద్రం, అపకీర్తి, అవమానం, పాపం మొదలైన మనిషి నాశనానికి, నిరాశానిస్పృహలకి హేతువులైనవన్నీ చీకటిగానూ, జ్ఞానం, ఆరోగ్యం, సంతోషం, ఆనందం, ఆహ్లాదం, కీర్తి, పుణ్యం మొదలైన మానవునికి కోరుకోదగిన, ఉపయోగపడేవన్నీ వెలుగుగానూ సంకేతించారు. ఈ దీపావళి రోజున లక్ష్మీ దేవిని పూజిస్తారు.  లక్ష్మీ దేవికి శ్రీ అని పేరు. శ్రీ అంటే ఆశ్రమం ఇచ్చేది.... ఆశ్రయింపబడేది. తన గునాల చేత వ్యాపించేది. దోషాలను తొలగించేది. మన మాటలు వినేది, వినిపించేది. ఈ ఆరు లక్షణాలు లక్ష్మీ దేవికి ఉన్నాయి.

ఇవి స్త్రీ లోనూ కనిపిస్తాయి. తండ్రీ, భర్త, పిల్లలూ... కుటుంబ జీవనంలో భాగంగా అంటూ మహిళ క్రమశిక్షణను తెలియజేస్తుంది. పిల్లలూ, కుటుంబ సభ్యుల చేత ఆశ్రయించబడుతుంది. సమాజంలో ఉన్న దోషాలను తొలగించడంలోనూ మహిళ పాత్ర కీలకం. వ్యక్తిత్వం, వాత్సల్యం, ఎదుటి వాళ్ళకు మాట్లడటాన్ని, సంస్కారాన్నీ నేర్పిస్తుంది స్ర్తీ అందుకే ఈ రోజు లక్ష్మీ దేవికి పూజ చేస్తారు.

నరకాసురుణ్ని సత్యభామ చంపడంతో లోకాలకు శాంతి చేకూరుతుంది. ఆ సంతోషాన్ని దీపాలు వెలిగించి, ఈ లోకానికి వెలుగు వచ్చిందనే సంతోషంలో ఈ దీపావళిని జరుపు కుంటారు. దీనిని ధన త్రయోదశి, నరక చతుర్ధశి, దీపావళి, బలి పాడ్యమి, భగినీ ద్వితీయ పేరుతో ఐదు రోజులు చేసుకుంటారు.

శరీరంలోని పంచ కోశముల శుద్ధీ, పంచేంధ్రియాల సాధన... ఇదే అసలైన దీపావళి అంతరార్ధం. నరకుడు విర్రవీగే అహంకారానికి నిదర్శనం... సత్యభామ స్ర్తీకి ప్రతీక. ఆమె భూదేవి అవతారం. అందుకే నరకాసురుణ్ని చంపి.... ఇంద్రుడి ఛత్రం, కుండలాలు వెతికి తీసుకొచ్చింది. ఛత్రం అంటే అధికారం. కుండలాలు అంటే శాస్త్రం. 

ప్రపంచంలోని అన్ని దేశాలవారు, అన్ని జాతులవారు ఏదో ఒక సందర్భంలో దీపాల పండుగ చేసుకుంటారు. ప్రతిమనిషి గుండెలోని, సమాజంలోని అన్ని విధాలైన చీకట్లను పోగొట్టి, సకల శుభాలను, సుఖసంతోషాలను, ఆనందోత్సాహాలను విజయ దీపావళి నింపాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles