What is the namaskar means

namaskar, namaskar means, hindu saampradaaya, namaste literally mean, namaskar, best namaskar photos, namaskar images, namaskar pictures.

what is the namaskar means

నమస్కారం వెనుక ఆంతర్యం

Posted: 05/15/2013 03:05 PM IST
What is the namaskar means

మన శాస్త్రాలు పెద్దలకు, దేవుడికి ఎలా నమస్కరించాలనే విషయాలన్ని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆ నియమనిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదు ... అయితే, మన జీవన శైలి రోజుకో కొత్త పుంత తుక్కుతున్నా , నేటికీ కొన్ని విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు , శుభకార్యాలు నిర్వహించేటప్పుడు , పండుగలని జరుపుకునేటప్పుడు , పూర్తి స్థాయి లో కాకపోయినా, చాల వరకు మన సంప్రదాయాలని తప్పక అనుచరిస్తాం . ఇందులో ముఖ్యమైనది ఆ బగవత్ స్వరూపానికి నమస్కరించడం . 'నమస్కరించే' ఆచారం గురించి మరింతగా అన్వేషిస్తే ;

భగవంతునికే కాక పెద్దలు, అగ్రజులు, గృహస్థులకు నమస్కరించాలని పెద్దలు చెబుతుంటారు. తమకంటే చిన్నవారి దగ్గర్నుంచి నమస్కారాలను అందుకున్న పెద్దలు, తప్పకుండా ఆశీర్వచనాలను ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఇలా నమస్కారాన్ని స్వీకరించిన పెద్దలు, పిల్లలకు 'దీర్ఘాయుష్మాన్భవ'చిరంజీవ భవ' అని ఆశీర్వదిస్తుండేవారు. అదే సమయంలో ఆశీర్వచనాలను ఇవ్వని పెద్దలకు నమస్కరించవనవసరం లేదని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే 'నమస్కారం' వెనుకగల అసలు ఉద్దేశం ఆశీర్వచనములను అందుకోవడమే తప్ప ఎదుటి వ్యక్తిని మానవాతీత వ్యక్తిగా చూడడం కోసం కాదు.

మన సంస్కృతిలో నమస్కారానికి ఇంత అంతరార్ధం ఉంది. మన భారతీయ సంస్కృతిలో నమస్కారానికి ఎంతో విశిష్టత ఉంది. అసలు నమస్కార ప్రక్రియ మనలోని వినయ భావాన్ని వ్యక్తీకరించడానికి ఏర్పడింది. సంస్కృతంలో 'నమస్' అంటే 'వినయం, భక్తితో కూడిన ప్రణామం' అని అర్థం. 'తే' అంటే 'మీకు' అని అర్థం. కాబట్టి 'నమస్తే' అంటే, 'మీకు భక్తితో కూడిన ప్రణామం' అని అర్థం. అందుకే పెద్దలను చూసినపుడు గౌరవ భావంతో నమస్కరిస్తుంటాం.

అలాగే మనం నిత్యజీవితంలో తెలిసో తెలియకో, కొన్ని తప్పులను చేస్తుంటాం. ఆ తప్పులను పోగొట్టుకునేందుకు భగవంతుని ముందు మోకరిల్లి నమస్కరిస్తాం. ఎవరైనా ఏదైనా తప్పు చేసినపుడు అతనితో 'పాప పరిహారార్ధం దేవునిముందు ప్రణమిల్లమ'ని మనం చెబుతుంటాం. ప్రతి మతంలో ఇలా నమస్కార పద్ధతిలో తప్పులను సరిదిద్దుకోవడం కనిపిస్తుంటుంది. కొన్ని మతాలలో వంగి దణ్ణం పెట్టే సంప్రదాయం ఉంది.

ఈ సందర్భంగా కొంతమందికి అసలు నమస్కారాన్ని ఎలా చేయాలన్న సందేహం కలుగుతుంటుంది. ప్రతి మతంలో నమస్కారం పెట్టేందుకు కొన్ని నియమాలు ఉద్దేశించబడ్డాయి. అయితే కొందరు 'సెల్యూట్' పెట్టినట్లుగా నమస్కరిస్తుంటారు. మరికొంతమంది రెండు చెంపలను వాయించుకుంటూ నమస్కరిస్తుంటారు. ఇంకొందరు రెండు అరచేతులను జోడించి నమస్కరిస్తుంటారు. కొన్ని ప్రాంతాలలోని ప్రజలు ముందుగా చేతులతో భూమిని తాకి, తర్వాత తలను నేలకు ఆనించి నమస్కరిస్తుంటారు.

సాధారణంగా మన సంప్రదాయాల్లో సాష్టాంగ మనస్కారం, పంచాంగ నమస్కారాలను చూస్తుంటాం. పంచాంగ నమస్కారంలో మన శరీరంలోని ఐదు భాగాలు భూమిని తాకుతాయి. -అష్టాంగ - అంటే శిరస్సు, మొండెము, రెండు భుజాలు, రెండు కాళ్ళు, రెండు చేతులను నేలకు ఆనించి నమస్కరించే పధ్ధతి. స్త్రీలకు మాత్రం పంచ - అంగ నమస్కారం ఉద్దేశించబడింది. స్త్రీలు రెండు భుజములు, మొండెము వదిలి మిగతా అయిదు అవయవములతో (శిరస్సు, రెండు కాళ్ళు, రెండు చేతులు) నేలను తాకుతూ నమస్కరించాలి.

స్త్రీలకు మాత్రమే ఎందుకు ఇలాంటి నియమం అని ప్రశ్నించుకున్నప్పుడు, దీనివెనుక హిందూ ధర్మం స్త్రీ మూర్తికిచ్చిన గౌరవమర్యాదలే. ఇందుకు సంతోషం కలుగుతుంది. మొత్తానికి స్త్రీలకు పంచాంగ నమస్కారం ఉద్దేశించబడింది. మాతృత్వానికి మన సంప్రదాయంలో అంతటి మర్యాద.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles