Diabetic foot care

Read about diabetic foot care. Causes of foot problems in people with diabetes include footwear, nerve damage, poor circulation, trauma, infections, and smoking

Read about diabetic foot care. Causes of foot problems in people with diabetes include footwear, nerve damage, poor circulation, trauma, infections, and smoking

Diabetic Foot Care.gif

Posted: 05/31/2012 03:20 PM IST
Diabetic foot care

Diabetic_Foot_Care

Diabetic_footప్రపంచంలో ఎవరైనా తన కాళ్ల మీద తాను నిలబడి మనుగడ సాధించడానికి ఉపయోగపడే అత్యంత కీలకమైన భాగం... పాదం. అదో అద్భుతమైన అవయవం. దాని నిర్మాణంలో అత్యున్నత స్థాయి ఇంజనీరింగ్, కళాత్మకత... రెండూ ఉన్నాయంటాడు లియోనాడో డావిన్సీ. ప్రపంచవ్యాప్తంగా పాదాలను దెబ్బతీస్తున్న వ్యాధి మధుమేహం. దాన్ని నియంత్రణలో ఉంచుకోకపోతే శరీరంలోని ఏ అవయవాన్నీ వదలని చక్కెర దాన్నీ వదలదు. దానికి పాదం కూడా మినహాయింపు కాదు. చక్కెర వ్యాధి ఉన్నవారికి పాదానికి వచ్చే ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అనేక అంశాలపై అవగాహన కోసం.

సాధారణ ప్రజలు ప్రతి రోజూ దాదాపు 8,000 నుంచి 10,000 అడుగులు వేస్తారు. మన శరీరంలోని బరువంతా కాళ్లపైనే పడుతుంది. అందుకే... ఆ భారాన్ని తట్టుకోవడం కోసమేనేమో- మన శరీరంలోని ఎముకలన్నింటిలో 25 శాతం మన కాళ్లలోనే నిర్మితమయ్యేలా ప్రకృతి వాటిని రూపొందించింది. అయితే మనం అతి తక్కువ శ్రద్ధ కేంద్రీకరించే అవయవాల్లో అవీ ఒకటి. వాటికి ఏదైనా గాయం అయినప్పుడు కానీ మన దృష్టి వాటివైపు పోదు. చక్కెర వ్యాధి వల్ల పాదాలకు వచ్చే ఇన్ఫెక్షన్స్‌తో చాలామంది బాధపడుతుంటారు.

చక్కెర వ్యాధి వల్ల బాధపడే ఏడుగురిలో ఒకరు పాదాల సమస్యకు గురవుతుంటారు. చక్కెరతో పాదం ప్రభావితమైన వారిలో 15 శాతం మందికి పాదాన్ని తొలగించాల్సిన పరిస్థితి. వాళ్ల ప్రాణాలను కాపాడటం కోసం పాదాన్ని కోల్పోక తప్పని పరిస్థితి. అందుకే చక్కెర ఉన్న రోగులు పాదాలను కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

చక్కెరతో పాదాలపై పడే దుష్ర్పభావాలు:  చక్కెర వ్యాధి ఉన్నవారిలో పాదంపై అయ్యే గాయాలు, కోసుకుపోవడాలు, పుండ్లు, గోరు చర్మంలోకి పెరగడం లాంటి సమస్యలన్నీ ప్రమాదకరంగా పరిణమిస్తాయి. అయితే తగిన శ్రద్థ తీసుకుంటే వాటిని నివారించవచ్చు.

పాదంపై పుండు (ఫుట్ అల్సర్):  చాలా మందిలో పాదంపైన చర్మం తాలూకు పైపొర తొలగిపోయి లోపలి పొరలు కనిపిస్తుంటాయి. చాలావరకు ఇలాంటి సమస్య పాదం కింద వస్తుంటాయి. సాధారణంగా పాదం చర్మంపై ఏదైనా గాయం అయితే త్వరగా తగ్గిపోతుంది. కానీ... డయాబెటిస్ ఉన్నవారిలో ఆ గాయం త్వరగా తగ్గక పుండులా మారే అవకాశాలు ఎక్కువ. ఒక్కోసారి మనం ఖాళీ పాదాలతో చిన్న రాయి మీద కాలు వేసినా కూడా అది ఇలా పుండుగా పరిణమించే అవకాశం ఉంది.

ఎందుకిలా జరుగుతుంది?:  చక్కెర వ్యాధి ఉన్నవారిలో రెండు కారణాల వల్ల అది పుండుగా పరిణమించే అవకాశం ఉంది. మొదటిది... చక్కెర వ్యాధి ఉన్నవారిలో పాదాల వద్ద ఉన్న నరాలు మిగతా వారిలా క్రియాశీలంగా పనిచేయవు. చక్కెర వ్యాధి పెరుగుతున్న కొద్దీ క్రమంగా అక్కడి నరాలు దెబ్బతింటాయి. ఈ దుష్ర్పభావాన్ని వైద్య పరిభాషలో ‘పెరిఫెరల్ న్యూరోపతి’ అంటారు. సాధారణంగా పాదాల వద్ద ఉన్న గాయం తాలూకు నొప్పిని నరాలు మెదడుకు చేరవేసి అక్కడి బాధను తెలియపరచాలి. కానీ అక్కడి నరాలు సక్రమంగా పనిచేయకపోవడంతో నొప్పి తెలియదు. దాంతో గాయం మళ్లీ మళ్లీ రేగుతూ మరింత తీవ్రం కావచ్చు.రెండోది... డయాబెటిస్ ఉన్నవారిలో కాలి చివరన ఉన్న రక్తనాళాలు ముఖ్యంగా ధమనులు సన్నబడతాయి. రక్తనాళాల్లోని లోపలి పొరల్లో కొవ్వు పేరుకోవడం వల్ల రక్తనాళాలు సన్నగా మారతాయి. ఇలా రక్తనాళాలు సన్నబడటాన్ని అథెరోస్క్లీరోసిస్ అంటారు. దానివల్ల పాదం చివరి వరకు వెళ్లాల్సిన రక్తప్రవాహం సరిగా అందక గాయం మానదు సరికదా పాదాలు మరింత దెబ్బతినవచ్చు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు చిన్న గాయం కూడా ప్రమాదకరంగా పరిణమిస్తుంది.

పాదాలపై పుండ్లు పెరగడానికి దోహదపడే అంశాలేమిటి?

Diabetic_foot3పాదాలకు స్పర్శ తగ్గితే అక్కడ పుండ్లు పడటానికి అవకాశాలు ఎక్కువ. అయితే పాదాల వద్ద స్పర్శ తగ్గడానికి ఈ కింది అంశాలు దోహదపడతాయి. డయాబెటిస్ ఉన్నా నియంత్రణలో ఉంచుకోవాలి. లేదా డయాబెటిస్ వచ్చే సూచనలు కనిపిస్తుంటే దాన్ని ఆలస్యం చేయడం కోసం అవసరమైన చర్యలు... అంటే సరైన ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడంపై నిర్లక్ష్యం చేస్తున్నకొద్దీ ప్రమాదం మరింత పెరుగుతుంది డయాబెటిస్ వచ్చినవారిలో పొగతాగడం, శరీరం కదలికలు చురుకుగా లేకపోవడం, రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండటం, హైబీపీ ఉండటం, స్థూలకాయం వంటి సమస్యలు ఉన్నవారిలో పాదాలపై పుండ్లు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ సరైన పాదరక్షలు ధరించకపోవడం, పాదాలతో పోలిస్తే పాదరక్షలు చిన్నగా ఉండటం వంటి పరిస్థితుల్లో కాలికి పుండ్లు పడే అవకాశం ఎక్కువ. అందుకే పాదానికి తగిన పాదరక్షలు ఉపయోగించాలి. పాదంపై వచ్చే పుండ్లతో ప్రమాదం ఎంత: చక్కెరవ్యాధిగ్రస్తుల్లో పాదాలపై పుండ్లు పడితే అవి తీవ్రంగా పరిణమించేందుకు అవకాశం ఉంది. అయినా నిర్లక్ష్యం చేయకుండా తొలి దశల్లోనే చికిత్స తీసుకోవడం వల్ల వాటిని ప్రమాదకరంగా పరిణమించకుండా చూసుకోడానికి అవకాశం ఉంది. ఒకవేళ పరిస్థితి విషమిస్తే అవి తగ్గడానికి సుదీర్ఘకాలం పడుతుంది. ముఖ్యంగా పాదాల రక్తనాళాల్లో రక్తప్రవాహం తక్కువగా ఉన్నవారికి అవి మరింత ప్రమాదకారి కావచ్చు. ఎందుకంటే అలాంటి వారిలో అవి ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ మరీ తీవ్రమైతే గ్యాంగ్రీన్‌కు (పాదం కుళ్లిపోవడానికి) దారితీసే ప్రమాదమూ ఉంది. అందుకే వాటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.

పాదాలకు అయ్యే పుండ్ల నివారణ ఎలా:

చక్కెరకూ, ఇతర వ్యాధులకూ చికిత్స తీసుకోవడం: చక్కెర వ్యాధి ఉన్నవారికి డాక్టర్లు సూచించిన మందులను, వారు సూచించిన జాగ్రత్తలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పాటించడం చాలా ముఖ్యం. అలాగే చక్కెర వ్యాధిగ్రస్తుల్లో ఉండే ఇతరత్రా సమస్యలు... అంటే హైబీపీ, హై కొలెస్ట్రాల్ వంటి రిస్క్‌ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు వాటిని అదుపులో ఉంచుకోవడం కోసం డాక్టర్లు సూచించిన మందులు వాడటం వల్ల పాదాలనూ సురక్షితంగా ఉంచుకోవచ్చు. పాదాలను క్రమం తప్పకుండా పరీక్షించుకుంటూ ఉండటం: చక్కెర వ్యాధి ఉన్నవారు తమ ఆరోగ్య పరిస్థితిని ప్రతి మూడు నెలలకు ఒకమారు తప్పనిసరిగా పరీక్షించుకుంటూ ఉండాలి. ఇందులో భాగంగా పాదాలకు స్పర్శ తగ్గిందా, రక్తప్రసరణ తగ్గిందా అన్న అంశాలను కూడా పరీక్షింపజేసుకోవాలి.

Diabetic_foot1పాదానికి పుండ్లు పడినప్పుడు ఏం చేయాలి?

మీ డాక్టర్‌ను లేదా పొడియాట్రిస్ట్‌ను కలిసి పాదం పరీక్ష చేయించుకోవాలి. పాదంపై పుండు ఇన్ఫెక్షన్‌కు దారతీయకుండా జాగ్రత్త తీసుకోవాలి.
అవసరాన్ని బట్టి దాన్ని కవర్ చేయాలా లేక డ్రస్సింగ్ చేయాలా అవసరాన్ని బట్టి కట్టు మారుస్తూ ఉండాలా అన్నది సాధారణంగా జనరల్ సర్జన్ నిర్ణయిస్తారు.

పాదంపై చర్మం ఎక్కడైనా గట్టిపడి ఉండి, దాని వల్ల గాయమయ్యే అవకాశాలు ఉంటే దాన్ని డాక్టర్లు తొలగిస్తారు. మాటిమాటికీ దెబ్బతగిలి పుండు మరింత రేగే అవకాశం ఉంటే అక్కడ ప్యాడింగ్ వేసి దాన్ని సంరక్షిస్తారు.

పుండును బట్టి తగిన పాదరక్షను సూచించడం లేదా కొత్త పాదరక్షను రూపొందించడానికి నిపుణులు సహాయపడతారు.

పాదంలోని రక్తనాళాలు సన్నబడ్డా, రక్తప్రసరణ సరిగా లేకపోయినా అవసరాన్ని బట్టి రక్తాన్ని బైపాస్ చేయడానికి, రక్తనాళాలను విశాలం చేయడానికి అవసరమైన సర్జరీ నిర్వహించాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Malawada duryodhana temple
Historical information of dresden in germany  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles