3 ex mps who attended first parliament to be felicitated

Kandala, Meira Kumar, Vizianagaram former MP, first Indian Parliament

Initially, government thought only two former MPs of first parliament were present, however, a Telugu association took it to the notice of the speaker Meira Kumar. On getting the information that Kandala was alive, Meira Kumar has sent the felicitation invitation to him immediately. The other two former MPs who would be felicitated include 91-yaer-old Rishang and 87-year-old Resham.

3 Ex MPs who attended first parliament to be felicitated.gif

Posted: 05/12/2012 07:01 PM IST
3 ex mps who attended first parliament to be felicitated

MP_Kandala_Subramanyam

Tilakమన పార్లమెంటు ఏర్పడి రేపటికి (మే 13కి) 60 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం అప్పటి పార్లమెంటుకి ఎన్నికైన వారికి ఘన సన్మానం చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం సన్మానించనున్న మొదటి లోక్ సభల్లో మన తెలుగు వారు మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం ఒకరిగా నిలిచారు. అలనాటి లోక్ సభ కొలువుదీరిన చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకొని స్పీకర్ మీరా కుమార్ ఆధ్వర్యంలో వచ్చే ఆదివారం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ నుంచి విజయనగరం మాజీ ఎంపీ కందాళ సుబ్రహ్మణ్యం ఆలియాస్ తిలక్ (92) కు ఆహ్వానం లభించింది. మొదటి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన సభ్యులు దేశంలో ఇద్దరే భావించింది. అయితే తెలుగు శక్తి స్వచ్చంధ సంస్థ సుబ్రహ్మణ్యం కూడా ఉన్నాడని స్పీకర్ కి తెలపగా దానికి వెంటనే స్పీకర్ స్పందించి ఆయనకు ఆహ్వానం పంపారు. దీంతో ఈ గౌరవం దక్కనున్న వారి సంఖ్య మూడుకి పెరిగింది. ఆ ముగ్గురిలో తిలక్ తో పాటు రిషాంగ్ కేయిషింగ్ (91), రేషమ్ లాల్ జంగ్దే (87) ఈ సన్మానం అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన మనతో పంచుకున్న అలనాటి మధుర ఘట్టాలు మీకోసం...

ఒక్కసారేనని ప్రజలకి మాటిచ్చాను....

దేశవ్యాప్తంగా మొదటి లోక్ సభకు ఎన్నికైన 499 మంది సాధించిన భారీ మెజారిటీలో నాకు 3వ స్థానం లభించింది. ఆనాడు మొదటి రెండు స్థానాల్లో చాచా నెహ్రూ, తెలంగాణ నుండి రావి నారాయణ రెడ్డి నిలిచారు. సోషలిస్టు పార్టీ తరుపున బరిలో నిలిచిన నన్ను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు. నా ప్రత్యర్థులు (కాంగ్రెస్ తో సహా) అందరికీ డిపాజిట్లు దక్కలేదు. పోటీలో ఉన్న ముగ్గురికి 30 వేలకు మించకుండా ఓట్లు వేస్తే... నాకు మాత్రం 1.80 లక్షల ఓట్లు వేసి జనం గెలిపించారు. నేను ఒక్కసారే ప్రజా ప్రతినిధిగా నిలుచుంటానని ఆనాడు ప్రజలకు మాటిచ్చాను. ఆ మాట ప్రకారం రాజకీయాలకు దూరంగా విశాఖలోని ఒక ప్రాంతంలో సాదారణ జీవనం సాగిస్తున్నాను.

స్వతంత్ర భారతావని తొలి అడుగులు....

ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో స్వతంత్ర భారతం తొలి అడుగులు వేసింది. అనాటి నేతలు దేశాభివ్రుద్ధికి సహకరించే పనులు ఏకగ్రీవంగా అంగీకరించేవారు. నెహ్రూ అంటే అందరికి అభిమానం , గౌరవం ఉండేది. ఇంతటి అక్షరాస్యత లేని ఆ రోజుల్లో డబ్బుతో సబందం లేకుండా ప్రజలు ప్రజాప్రతినిధులను ఎన్నుకునేవారు. 1 7 సంవత్సరాలు ప్రధానిగా పనిచేసిన నెహ్రూ తొలినాళ్ళలో అవినీతిని అంతమొందించేందుకు నిత్య ప్రయత్నం చేశారు. కానీ రాను రాను దాని ప్రభావం అధికమయింది. ప్రతిపక్ష నాయకులు సమ గౌరవం దక్కేది. నేతలు ప్రతి సమస్యపై పక్షపాతం లేకుండా నిర్ణయాలు వెల్లడించేవారు.

వ్యక్తిగత జీవనం....

నేను నిరుపేద కుటుంబంలో జన్మించాను. 27 సంవత్సరాల వయస్సు నుండే ఉద్యమాలలో పాల్గొన్నాను. స్వతంత్ర పోరాటంలో భాగస్వాముడిగా నిలిచాను. 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకు వెళ్లాను. స్వతంత్రం అనంతరం మొదటి పార్లమెంటుకు ఎన్నికయ్యాను. తదనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను.

ప్రస్తుత రాజకీయాల గురించి....

ప్రస్తుతం దేశాభివ్రుద్ధి కోసం క్రుషి చేసే నాయకులు లేరు. డబ్బు ఆధిపత్యమే సమాజాన్ని శాసిస్తోంది. రాజకీయాల్లో క్రమశిక్షణ కలిగిన రాజకీయ నాయకులు కరువయ్యారు. ఆనాడు లాల్ బహుదూర్ శాస్త్రి ఇచ్చిన జై జవాన్... జై కిసాన్ నినాదానికి దేశ వ్యాప్తంగా ఆదరణ లభించింది. నేడు ప్రభుత్వాలు రైతులను విస్మరిస్తున్నాయి. దేవాలయం లాంటి పార్లమెంటులో కొట్టుకుంటూ నేతలు దాని గౌరవాన్ని కించపరుస్తున్నారు. అన్నా హజారే ఉద్యమం యువతలో మంచి స్ఫూర్తి రగిల్చింది. ఆయన మార్గదర్శకత్వంలో యువత నిలిచినప్పుడే ప్రయోజం ఉంటుంది. దేశాభివ్రుద్ధిలో అందరు భాగస్వాములు అయిప్పుడే దేశ ప్రగతి సాధ్యమౌవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Historical information of dresden in germany
The asteroid mining company  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles