Cm kcr support modi on planning commission issue

CM kcr on modi ideology, kcr on modi replacing planning commission, kcr supports replacing planning commission, kcr on replacing planning commission, kcr welcomes modis idea

cm kcr support modi on planning commission issue

ముఖ్యమంత్రుల మండలిని స్వాగతించిన కేసీఆర్

Posted: 12/07/2014 10:15 PM IST
Cm kcr support modi on planning commission issue

ప్రణాళిక సంఘానికి కాలం చెల్లిందని, ప్రతిపాదిత ముఖ్యమంత్రుల మండలి ఏర్పాటుపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాల పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానితో రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రుల మండలికి నిధులు, అధికారాలు ఇవ్వాలని, శాఖల వారీగా రాష్ట్రాలకు కేంద్రం నిధులు కేటాయించాలని కోరారు. పంచవర్ష ప్రణాళిక స్థానంలో దీర్ఘకాల వార్షిక ప్రణాళిక ప్రవేశపెట్టాలన్నారు.

ప్రణాళిక సంఘం స్థానే ఏర్పాటు చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రుల మండలి సమర్థవంతంగా పనిచేసేందుకు ప్రత్యేక సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని సూచించారు. సారుప్యత ఉన్న సమస్యలపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉప సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. పంచవర్ష ప్రణాళికల స్థానంలో పది పదిహేనేళ్ల ప్రణాళికలు రూపొందించాలన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న మన ఊరు మన ప్రణాళికను ప్రధాని మోదీకి వివరించినట్టు కేసీఆర్ తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  planning commission  chief ministers meeting  Narendra modi  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more