నీళ్ళమీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు
బయట మూరెడైన బారలేదు
నెలవుదప్పుచోట నేర్పరి కొరగాడు
విశ్వదాభిరామ వినురవేమ
ప్రతిపదార్థం-
నీళ్ళమీద నోడ- ఓడ నీటి మీద, నిగిడి- ఎక్కి, తిన్నగా-చక్కగా, ప్రాకున్-పయనిస్తుంది, బయటన్- నేలమీద, మూరెడైన- ఒక మూర కూడా, బారలేదు-ముందుకు పోలేదు. నెలవు-తనదైన స్థానము, తప్పుచోట- కానిచోట, నేర్పరి-పని చెయ్యగల నేర్పు గలవాడు కూడా, కొరగాడు-పనికిరాడు.
తాత్పర్యం-
నీటిమీద చాలా చక్కగా పోగల ఓడ నేల మీది కొస్తే కొంచెం కూడా ముందుకు కదలలేదు. అలాగే ఎంత నేర్పుగలవాడైనా తనకు అనుకూలమైన స్థానం దొరకనప్పుడు ఎందుకూ పనికిరాడు.
వివరణ-
పనిచెయ్యగలగటమే కాదు అందుకు తగ్గ వాతావరణం కూడా ఉండాలి. గొప్ప సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ పల్లెటూరిలో వ్యవసాయం మాత్రమే చేసే చోట ఏం చెయ్యగలడు. ఎంతో గొప్ప వైద్యుడు వేరే పనిలో వెనకబడి వుండవచ్చు.
ఈ మాటలు ఎవరికీ తెలియనివా అంటే అందరికీ తెలిసినవే కానీ, ఆ దిశగా ఆలోచించకపోవటం వలనే ప్రత్యేకంగా సూక్తుల రూపంలో చెప్పవలసి వస్తుంది.
ఎవరి పనిలో వారు నిష్ణాతులై వుండవచ్చు కానీ వేరే పని చెయ్యలేరు అంటే అర్థం, మీరు ఎలాగైతే మీ పనిలో చాకచక్యాన్ని కలిగివున్నారో అలాగే ఇతరులు కూడా వారి పనిలో వారు నైపుణ్యాన్ని కలిగివుంటారు కాబట్టి ప్రపంచంలో ఎవరినీ తక్కువగా అంచనా వెయ్యవద్దన్న నిగూఢార్థం కూడా ఇందులో ఉంది.
–శ్రీజ
(And get your daily news straight to your inbox)
Apr 15 | తప్పులెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : ప్రపంచంలో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలవరకు... Read more
Apr 14 | పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు పట్టెనేని బిగియఁ బట్టవలయు పట్టు విడుటకన్న, బరగఁ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : పట్టుదల లేనిదే ఏ కార్యాన్నిగాని, పనినిగాని మొదలుపెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ... Read more
Apr 12 | చంపదగిన యట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు సేయరాదు పొనగ మేలుచేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : మనకు ఎల్లప్పుడూ హాని కలిగించే మన శత్రువును చంపే సమయం వచ్చినప్పుడు.. అతనిని... Read more
Apr 11 | చెప్పులోన ఱాయి చెవిలోని జోరిగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ ! భావం : చెప్పులో రాయి రావడం, చెవిలో జోరిగ తిరగడం, కంటిలో నలుసు పడటం,... Read more
Apr 08 | చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీట గలిసె బ్రాప్తి గలుగుచోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ ! తాత్పర్యము : ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు ముత్యంగా మారిపోతుంది. అదే చినుకు... Read more