One week time problem finish

one week time problem finish, BJP party, Karnataka Politics, CM , CM chair, New CM ,

one week time problem finish

one week time problem finish.gif

Posted: 07/07/2012 03:27 PM IST
One week time problem finish

 కర్నాటకలో తలెత్తిన నాయకత్వ సంక్షోభం వారంలో ఒక కొలిక్కి వస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరప్ప తెలిపారు. రాష్ట్రంలో నాయకత్వ సమస్యను అధిష్ఠానం పరిష్కరించిందనీ, వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటామనీ ఆయన స్పష్టం చేశారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర నాయకులు తమ ఆమోదం తెలుపుతారనే భావిస్తున్నానని ఆయన చెప్పారు. వారం రోజుల్లో పార్టీ అధినాయకత్వం తన నిర్ణయాన్ని వెలువరిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలనను అందించడాన్ని తమ పార్టీ కొనసాగిస్తుందని తెలిపారు. యడ్యూరప్ప, సదానంద గౌడ వలే మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తున్నట్లు ఈశ్వరప్ప పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్నా ఇటీవల జరిగిన కౌన్సిల్ ఎన్నికల్లో ఆరు స్థానాలకు గాను ఐదు స్థానాలను తమ పార్టీకి కట్టబెట్టి రాష్ట్ర ప్రజలు తమ పాలనపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్లుగా అసెంబ్లీని రద్దు చేసే ప్రసక్తే లేదని తెలిపారు. ఐదేళ్లూ అధికారంలో కొనసాగాలని రాష్ట్ర ప్రజలు తమను ఆశీర్వదించారని ఆయన పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలు జరపాలని కాంగ్రెస్ కుట్రపన్నితే ఎదుర్కోవడానికి తమ పార్టీ సిద్ధంగా ఈశ్వరప్ప అన్నారు. కాగా, రాష్ట్ర నాయకత్వ మార్పుపై బిజెపి అధిష్ఠానం వచ్చే మూడు రోజుల్లో మార్గనిర్దేశనం చేస్తుందని కర్నాటక హోం మంత్రి అశోక్ చెప్పారు. కర్నాటక సి ఎం సదానంద గౌడను తొలగించి ఆయన స్థానంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జగదీష్ శెట్టర్‌ను ముఖ్యమంత్రిగా నియమించాలని యడ్యూరప్ప వర్గం కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Will balakrishna contest from gudivada
Yashwant sinha attacks pm says govt at sixes and sevens  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Konda surekha fire on kcr

    Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more