Kalpana chawla biography columbia disaster special story

kalpana chawla, first India born woman in space, Interstellars Special Effects, NASA photo portrait, Kalpana Chawla Memorial Awardholds, Kalpana Chawla's story

kalpana chawla indian biography and columbia dister special story about kalpana chawla

కల్పనా చావ్లా (మార్చి 17, 1962 – ఫిబ్రవరి 1, 2003), భారతీయులందరికీ సుపరిచితురాలైన

Posted: 12/27/2014 03:33 PM IST
Kalpana chawla biography columbia disaster special story

కల్పనా చావ్లా (మార్చి 17, 1962 – ఫిబ్రవరి 1, 2003), భారతీయులందరికీ సుపరిచితురాలైన ఈమె ఒక ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి మరియు వ్యొమనౌక యంత్ర నిపుణురాలు.

కల్పనా చావ్లా, భారత దేశం లో హర్యానా లోని కర్నాల్ అనే ఊరులో ఒక పంజాబీ కుటుంబం లో పుట్టారు. తల్లిదండ్రులకు ఈమె చివరి సంతానం. సునీత, దీప, సంజయ్ ల తర్వాత ఈమె జన్మించారు. ఇంట్లో అందరూ ముద్దుగా "మోంటు" అని పిలుచుకొనే కల్పనా చావ్లా కులీన కుటుంబంలో పుట్టలేదు. తండ్రి బనారసీలాల్ చావ్లా సాధారణ వ్యాపారి కల్పనపై ఆయన ప్రభావం ఎక్కువ. పేదరికం నుంచే ఆయన పైకెదిగారు. పట్టుదల, అందుకు తగిన కృషి ఉంటె సాధించలేనికి ఏదీ లేదని నిరూపించిన వ్యక్తి ఆయన. చిన్నగా టైర్ల వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన తొలుత ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారు. అయినా దాన్ని వదలకుండా అనుకున్నది సాధించేందుకు ముందుకు సాగిపోయాడు. అప్పటి వరకూ టైర్ల తయారీకి విదేశీ యంత్రాన్ని ఉపయోగించేవారు. ఆ క్రమంలో ఆయన దేశీయంగానే ఆ యంత్రాన్ని రూపొందించారు. బనారసీలాల్ శ్రమ ఫలించింది. రాష్ట్రపతి నుంచీ అభినందనలు అందుకున్నారు. తత్వాత డబ్బుకోసం బనారసీ కుటుంబం ఇబ్బంది పడింది లేదు. ఆడపిల్లే అయినా జీవితంలో ఏదో సాధించాలన్న తపన కల్పనలో పాదుకోవడానికి తండ్రేకారణం. "పరిస్థితులు ఎలాగున్నా... కన్న కలల్ని నిజం చేసుకోవడమే అంతిమ లక్ష్యం అన్న మాటలు నా తండ్రి జీవితంలో నిజమయ్యాయి. ఫలితంగా అవే నాలోనూ జీర్ణించుకుకుపోయాయి. అందుకు నాన్నే కారణం." అంటూ తొలి అంతరిక్షయానం తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆలోచనలు ఏ విధంగా ప్రభావితమయిందీ కల్పన వివరించారు.

కల్పనా చావ్లా ముందుగా, కర్నాల్ లో ఉన్న టాగోర్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. తోటి పిల్లలంతా కామిక్ పుస్తకాలు చదువుతూ .....బర్బీ బొమ్మల్లా అలంకరించుకునే వయసులో... ఆమె తెల్లవారు జామునే లేచి సైకిల్ పై స్కూలు కెళ్ళేవారు. స్కూల్లో డ్రాఇంగ్ క్లాసులో విమానం బొమ్మలు గీయటానికి ఇష్టపడేవారు. నిజానికి ఈమె సోదరుడు సంజయ్ చావ్లా కమర్షియల్ పైలట్ కావాలని కలలు కనేవాడు. తన గదిలో విమానాల బొమ్మలుంచేవాడు. అవి కల్పనలో స్పూర్తిని రగిలించాయి. కల్పన తన కలల్ని నిజం చేసుకోవటానికి ఈమె సోదరుడు సంజయ్ ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇద్దరి కలలూ ఒకటే. ఆకాశంలో ఎగరడం. కర్నాల్ లోని టాగోర్ పాఠశాలలో ప్రాథమిక విద్య సాగింది.

పంజాబ్ ఇంజరీరింగ్ కాలేజీ లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. . 1982 లో ఈమె అమెరికా వెళ్లి అక్కడ "ఏరోస్పేస్ ఇంజనీరింగ్" లో మాస్టర్ అఫ్ సైన్సు డిగ్రీని, అర్లింగ్టన్ లో ఉన్న టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి 1984 లో పొందారు.1986 లో, చావ్లా రెండవ మాస్టర్ అఫ్ సైన్సు డిగ్రీని మరియు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పిహెచ్ .డి ని బౌల్డెర్ లో ఉన్న కోలోరాడో విశ్వవిద్యాలయం నుంచి పొందారు.అందమైన భవిష్యత్ కోసం కలలు కంటూ గాలిలో మేడలు కట్టకుండా జీవిత లక్ష్యాన్ని సాధించుకున్న మహిల కల్పనా చావ్లా. చదువులో ఎప్పుడూ ఏమె ముందు ఉండేది. ఈమెను ఎక్స్‌ట్రావెర్ట్ గా ఉపాధ్యాయులు పేర్కొనేవారు. సహజంగా ఒక వ్యక్తి 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయసులో కెరియర్ ను ప్రారంభించినా, అప్పతి నుంచి ఓ 15 ఏళ్ళు కష్టపడితే గాని పేరు రాదు. కానీ కల్పన పిన్నవయసులోనే గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఈమె నాసాలో వుద్యోగానికి దరఖాస్తు చేసినపుడు ఈమెతో 2 వేల మంది పోటీ పడ్డారు. అయితే ఈమె మత్రమే నాసా శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. తల్లిదండ్రులు సంప్రదాయవాదులే అయినా కొత్తను ఎప్పుడూ ఆహ్వానించేవారని అంటారీమె. తన కెరియర్ ను వారెప్పుడూ అడ్డుకోలేదనని, తాను కోరుకున్న దానికి ఆమోదం తెలిపేవారని అన్నారు.

1986 సంవత్సరం లో, NASA ఏమ్స్ పరిశోదనా కేంద్రం లో ఓవర్ సెట్ మేతడ్స్,ఇంక్. కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఇక్కడ ఈమె వి /స్టోల్ మీద సిఎఫ్ డి పరిశోధన చేసారు. [2] చావ్లా విమానాలకు,గ్లైడర్లు లకు మరియు ఒకటి లేదా ఎక్కువ యంత్రాలు ఉండే విమానాలకు, వ్యాపార విమానాలకు శిక్షణ ఇచ్చే యోగ్యతాపత్రం కలిగి ఉన్నారు. ఆమె 1983 లో విమానయాన శిక్షకుడు మరియు విమాన చోదక శాస్త్ర రచయిత ఐన జీన్-పియర్ హారిసన్ ను వివాహం చేసుకున్నారు, 1990 లో యునైటెడ్ స్టేట్స్ దేశ పౌరురాలి గా అయ్యారు.

1994 లో మొట్టమొదటి సారి కల్పనా చావ్లా పేరు ప్రపంచానికి తెలిసింది. ఎందుకంటే అప్పుడామెను "నాసా" వ్యోమగామిగా ఎంపిక చేసింది. నిజానికి కల్పనా చావ్లా "నాసా" కు దరఖాస్తు చేసేనాటికి ఆమెతో పాటు దాదాపు 2000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చెసుకున్నారు. అంతమందినీ పరిశీలించి... కేవలం 23 మందినే నాసా ఎంపిక చేసింది. 1995 లో మిగతా 22 మందితో కలసి నాసాకు చెందిన వ్యోమగామి శిక్షణ కార్యక్రమాన్ని ఈమె పూర్తి చేసుకున్నారు. టెక్సాస్ లోని హూస్టన్ లో గల జాన్సన్ స్పేస్ సెంఆట్ర్లో తన శిక్షణ చాలా ఆనందంగా గడిచిందంటారీమె... అక్కది శిక్షణ గురించి వ్యాఖ్యానిస్తూ "శిక్షణ చాలా ఉత్కంఠభరితంగా తమాషాగా ఉండేది. తమాషాగానూ ఉండేది లెండి." అనేవారు. తరువాత పైలట్ గా వివిధ రకాల విమానాలు నడిపేందుకు అర్హత సాధించారు.

1997 లో కల్పనా చావ్లా అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. అప్పుడీమె 376 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు. భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మిలియన్ మైళ్ళు అంతరిక్ష యానం చేశారు. నాసా వ్యోమగామిగా కల్పనను ఎంపుక చేసేటప్పుడు ఒక తమాషా సంఘటన జరిగింది. అదేమిటంటే ఈమెకు వైద్య పరీక్షలు చేశారు. ఒక డాక్టరు ఈమె ఎక్స్‌రే పరిశోలిస్తూ "నువ్వు శాఖాహారివా?" అంటూ ప్రశ్నించారు. "అవును, నేనెప్పుడూ మాంసం ముట్టలేదు" అని కల్పన జవాబిచ్చారు. "అది ఎక్స్‌రే చూడగానే తెలిసిందిలే. ఎందుకంటే లోపలంతా చాలా స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంది" అంటూ డాక్టరు పెద్దగా నవ్వేశారు. కల్పన కూడా ఆయనతో గొంతు కలిపారు.

2003, జనవరి 16 న రెండోసారి అంతరిక్షం లోకి వెళ్ళే ముందు కల్పనా చావ్లా విలేకరులతో మాట్లాడారు. "భారతదేశంలో మొట్టమొదటి విమానాన్ని నడిపిన జె.ఆర్.డి.టాటా యే నాకు స్ఫూర్తి, అందుకనే ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ ను కెరీర్ గా తీసుకున్నా" అని చెప్పారు. భారత మహిళలకు మీరిచ్చే సందేశమేమిటని అడిగితే..... "ఏదో ఒకటి చేయండి, కానీ దాన్ని మిరు మనస్ఫుర్తిగా చేయాలనుకోవాలి. ఎందుకంటె ఏదైనా పనిని కేవలం ఒక లక్ష్యం కోసం చేయడం కాక,... దానిలో లీనమై అనుభవించాలి" అనేవారు. అలా అనుభవించలేని వారు తమకు తాము వంచించుకున్నాట్లేయని చెప్పెవారు.

1991 లో భర్త తో కలసి చావ్లా, తన కుటుంభ సభ్యులతో సెలవలు గడపటానికి చివరిసారిగా భారతాదేశం వచ్చారు. వివిధ కారణాలవల్ల, చావ్లా వ్యోమగామి ఐన తర్వాత భారతదేశం రమ్మని ఆహ్వానించినప్పటికి ఆమె దానిని అనుసరించ లేక పోయారు. కొలంబియా వ్యొమనౌక విపత్తు లో చనిపోయిన ఏడుగురి బృందం లో ఈమె కూడా ఒకరు.


హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kalpana chawla  first india born woman in space  colombia disaster  

Other Articles