Playback singer p leela

playback singer p leela, awarded padma bhushan, popular indian playback singer, porayathu leela, p leela songs, songs of p leela, best of p leela, all songs of p leela, p leela hit songs, p leela music, p leela songs mp3

playback singer p leela

గాన మాధుర్యం - ఖచ్చితమైన వ్యక్తిత్వం యొక్క సమాహారం "లీల "

Posted: 05/16/2013 07:55 PM IST
Playback singer p leela

తెలుగు సినిమా రంగానికి నటీనటుల దగ్గరి నుండి , వివిధ విభాగాల్లో సాంకేతిక నిపుణుల వరకు , కొదవే లేదు . హీరోయిన్ల కొరత ఉంది అని నిర్మాతలు ఇప్పుడు అంటున్నా , సరిగ్గా చుట్టూ చూడటం లేదు , అందుకే కొదవ కనిపిస్తుంది, ఉన్న వాళ్ళని , ముంబై వెళ్ళిపోయిన హీరోయిన్లని పట్టుకునే ప్రయత్నం చెయ్యడం మానేసి మన చుట్టూ ఉన్న టాలెంట్ వితికే ప్రయత్నం చేస్తే మనకే అర్ధం అవుతుంది అసలు టాలెంట్ ఏంటో . అటువంటి తెలుగు సినిమా జగత్తులో సంగీత ప్రియులని తన గాన మాధుర్యం తో అలరించిన ఒకానొక గాయనీమణి , పీ . లీల గారు .

పి.లీల, మళయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. ఈమె తమిళ, మళయాళ, తెలుగు భాషల్లో ఆమె 15 వేలకు పైగా పాటలు పాడింది. తెలుగులో లవకుశ, మాయాబజారు, పాండవవనవాసం, రాజమకుటం, గుండమ్మకథ, చిరంజీవులు తదితర సినిమాల్లో ఆమె పాడిన ఎన్నో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి..

ఘంటసాల ప్రోత్సాహంతో ఆయన సంగీత దర్శకత్వం వహించిన 'మనదేశం' చిత్రంలో బాలా త్రిపుర సుందరి... పాట పాడటంతో తెలుగులో గాయనిగా ఆమె కెరీర్‌ ప్రారంభం అయింది. కీలుగుర్రంలో దిక్కు తెలియదేమి సేతు, గుణసుందరికథలో 'ఓ మాతా రావా, మొర వినవా...' 'ఉపకార గుణాలయవై ఉన్నావు కదే మాతా ...,' కల్పకమ తల్లివై ఘనత వెలిసిన గౌరి..., 'ఏ ఊరు ఏలినావో...' శ్రీతులసీ ప్రియ తులసీ పాటలను, 'పాతాళభైరవి' చిత్రంలో 'తీయని ఊహలు హాయిని గొలిపే వసంత గానమె హాయి. కలవరమాయె మదిలో, నా మదిలో, ఎంత ఘాటు ప్రేమయో..., 'పెళ్ళిచేసి చూడు'లో 'మనసా నేనెవరో, నీకు తెలుసా...' ఏడుకొండలవాడా వెంకటరమణా, ఎవరో...ఎవరో, చంద్రహారంలో 'దయ గనవే తల్లిd...' కృప గనవా నా మొర వినవా...' ఏ సాధువులు ఎందు హింసలు బడకుండ... అని సాగే పద్యం, 'మిస్సమ్మ'లో 'తెలుసుకొనవె చెల్లిd...' 'కరుణించు మేరిమాతా...' 'రావోయి చందమామా...' 'ఏమిటో ఈ మాయా...' 'మాయాబజార్‌'లో 'నీవేనా నను తలచినది..' 'చూపులు కలసిన శుభవేళా...' 'విన్నావ యశోదమ్మా..', 'లాహిరి లాహిరి లాహిరిలో', నీ కోసమే నే జీవించునది... పెళ్ళి నాటి ప్రమాణాలులో 'వెన్నెలలోనే వేడి ఏలకో..' నీతోనే లోకము, నీతోనే స్వర్గము, లాలి మా పాపాయి ఆనందలాలీ...' 'అప్పుచేసి పప్పుకూడు'లో 'రామనామ శరణం, భద్రాద్రిరామ శరణం', 'ఎచట నుండి వీచినో ఈ చల్లని గాలి', 'సుందరాంగులను చూసిన వేళల...,' 'ఆనందం పరమానందం..' 'చేయి చేయి కలుపరావె హాయి హాయిగా...,' గుండమ్మకథలో 'వేషము మార్చెను...' ముద్దుబిడ్డలో జయమంగళ గౌరీదేవీ... 'పాండవ వనవాసం'లో దేవా దీనబాంధవా... వంటి పాటలు సోలో గీతాలుగాను, యుగళగీతాలుగాను పాడారు.

లీలపాడిన పాటల్లో అందమె ఆనందం, ఆనందమె జీవిత మకరందం, ఏమిటో ఈ మాయా..., లవకుశలో సుశీలతో కలిసి పాడిన పాటలు ఎంతో హాయినిస్తాయి.

కేవలం గాయని గానే కాక , సంగీత దర్శకురాలిగా కూడా లీల తన ప్రతిభను చాటారు . సావిత్రి దర్శకత్వంలో రూపొందిన 'చిన్నారి పాపలు' చిత్రానికి సంగీత దర్వకత్వం నిర్వహించారు.

సినిమా సంగీతంలో వచ్చిన మార్పులు, వాయిద్యాల హోరు పెరిగి పోవడంతో పాటలు తగ్గించారు పి. లీల. పాట పాడకుండా ఉండలేని స్థితి కారణంగా జమునారాణి, .పి. కోమల ప్రభృతులతో కలసి సినిమా పాటల కచేరి, శాస్త్రీయ సంగీత కచేరీలు నిర్వహించేవారు.

ఇలా , నిర్దిష్టమైన వ్యక్తిత్వానికి ప్రతిరూపం అయిన లీల గారు , ఇటువంటి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే స్వభావం ఉన్న ఎందరో మహిళలకు ఆదర్శం .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles