Actress keerthi reddy

Kirti Reddy Stills, Kirti Reddy Pictures, Kirti Reddy Photos, Kirti Reddy Tamil Cinema Photos, Kirti Reddy Hottest Photos, Kirti Reddy Hot Photos

Kirti Reddy Stills, Kirti Reddy Pictures, Kirti Reddy Photos, Kirti Reddy Tamil Cinema Photos, Kirti Reddy Hottest Photos, Kirti Reddy Hot Photos

కీర్తి రెడ్డి

Posted: 02/27/2013 06:32 PM IST
Actress keerthi reddy

ఉత్తరాదిభామల్ని మరిపించేంత అందమైన అమ్మాయిని చూపి పుణ్యం కట్టుకోమ్మా అని ప్రార్థిస్తున్న టాలీవుడ్ మొర ఆలకించినట్టుగా, తెరవెలిగే తెలుగు అందం కోసం మన నిరీక్షణకు తెరదించుతున్నట్టుగా తెరకెక్కిందామె. తొలిచూపుతోనే ప్రేక్షక ప్రేమను దక్కించుకున్న ముద్దుగుమ్మా వెండితెర కనుమరుగయ్యింది. ఆమె కీర్తి రెడ్డి. ఆమె గురించి.....

భరతనాట్యంలో తనకున్న ప్రావీణ్యంతోనూ, సంపన్న, పేరు ప్రతిష్టలున్న కుటుంబ నేపధ్యం తోనూ సులభంగానే గన్‌షాట్ అనే కామెడీ మూవీతో ఆరంగేట్రం చేసింది కీర్తి. అది నిరాశను మిగిల్చింది. ఆ తర్వాత తమిళ ‘దేవదాయి ’, ‘నందిని ’ సినిమాలు చేసిన కీర్తిరెడ్డి తొలి విజయాన్ని మాత్రం ‘తొలిప్రేమ’ సినిమాతో అందుకోగలిగింది. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో అపు రూపమైన లావణ్యాన్ని, అర్థవంతమైన అభినయాన్ని రంగరించి అటు సూపర్ హిట్‌నీ, ఇటు అవార్డునీ చెరో చేత్తో సగర్వంగా సొంతం చేసుకుంది. పాత ఫ్లాపును మరిపించి, ఈ సినిమానే ఇప్పటికీ కీర్తిరెడ్డి తొలి సినిమా అని చాలామంది అనుకునేంతగా ముద్ర వేసింది.నార్త్‌కు ఎర్త్ ఇచ్చే స్థాయిలో అందమైన అభినయం మనకూ ఉంది అని తెలుగు ప్రేక్షకులు కాలరెగరేసే లోగానే... ఉత్తరాది నుంచి కీర్తికి పిలుపొచ్చేసింది. అలాంటిలాంటి ఆఫర్ కాదు. ‘తేరా జాదూ చల్‌గయా’లో అభిషేక్ బచ్చన్ సరసన హీరోయిన్! ఇకనేం... ఛలో ముంబయి అంది కీర్తిరెడ్డి. బాలీవుడ్‌లో ఆమె వేసిన ఆ తొలి అడుగు, ఫ్లాప్‌వైపు పడింది. సనమ్‌తేరేహై హమ్, ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్, బధాయీహో బధాయి... ఇలా దక్షిణాది నుంచి వెళ్లిన ఏ తార కూడా అందుకో లేనంత స్పీడ్‌గా ఆఫర్లనూ ఆ వెంటే ఫ్లాప్‌లనూ అందుకుంది. రెండేళ్లలోనే ‘పీఛే ముఢ్’ అంది. దక్షిణాదికి వచ్చేసి ఓ కన్నడ సినిమాలోనూ, తెలుగులో మహేష్ బాబుకు అక్కగా అర్జున్ సినిమాలోనూ చేసింది. అయితే ఇవీ అంతగా ఫలించక... ఎంచక్కా పెళ్లికూతురై పోయింది.

అక్కినేని వంశపు నట వారసుడిగా అప్పుడప్పుడే విజయాలు చవిచూస్తూన్న సుమంత్‌ను ఆ‘కట్టేసుకుంది’. అయితే ఏమైందో ఏమోకాని... మృదుస్వభావి అనిపించే ఆ హీరోకి, మూడు మల్లెలెత్తు అన్నట్టుండే ఈ సుకుమారికీ... జోడీ కుదర్లేదు. స్వల్ప కాలంలోనే సుమంత్‌తో విడిపోయింది. కేవలం పదిహేడేళ్ల వయసుకే సినీ రంగ ప్రవేశం చేసి పదేళ్లపాటు రంగులలోకంలో విహరించి... అటు తారగా వెలగలేక ఇటు ఇల్లాలిగా ఇమడలేక.. ఎటు మళ్లిందో నాటి ఈ కాంతి కిరణం. ఆంధ్రకు చెందినవారైనా కీర్తిరెడ్డి కుటుంబం బెంగళూరులోని కోరమంగళం ప్రాంతంలో స్థిరపడ్డారు. కీర్తి తల్లి అహల్యా రెడ్డి బెంగళూరు కేంద్రంగా అంతర్జాతీయ ఫ్యాషన్ డిజైనింగ్ స్టోర్‌ను నిర్వహి స్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులోనే నివసిస్తున్న కీర్తి, సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పేసినట్టే నంటున్నారు. ఎటు వంటి ఇంటర్వ్యూల కైనా, ఫొటోలకైనా నో అని తేల్చి చెప్పేశారు. హీరో సుమంత్‌తో విడిపోయాక మరో వివాహం చేసుకున్నా రామె. ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యారు. అయితే ఎందుకనో, తన వ్యక్తిగత విషయాలు బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు.

తాతయ్య రాజకీయ దురంధరుడు. తండ్రి ఇంటీరియర్ డిజైనర్. తల్లి ఫ్యాషన్ డిజైనర్. అయితే తనకు అలాంటి హోదాలు కావాలని ఎప్పుడూ అనుకో లేదామె. ఎంతో కష్టపడిన తర్వాత మాత్రమే దక్కించుకునే కీర్తిని నామకరణ సమయంలోనే తన సొంతం చేసు కున్నప్పటికీ, సినిమా తారగా బోలెడంత పేరు తెచ్చుకోవాలనే తపన మాత్రం కీర్తిరెడ్డికి యుక్తవయసు నుంచే ఉండేది. తన సోదరి, సోదరుడి కెరీర్ ఎంపికకు భిన్నంగా ఆమె సినిమా రంగాన్ని ఎంచుకున్నారు. కోరుకున్న రంగానికి సులభంగానే చేరుకున్నా అక్కడ విజయాలకు చేరువ కాలేకపోయారు. ఆమెను తిరిగి తెరపై చూసే అవకాశం కోల్పోయామని తెలియడం కన్నా... అంత అందమైన తెలుగమ్మాయిని మళ్లీ టాలీవుడ్ స్క్రీన్‌పై ఎప్పుడు చూస్తామో అని బాధపడడంలో తప్పులేదు. త్వరలోనే కీర్తిని మరిపించే తెలుగమ్మాయి తెరవెలగాలని... కీర్తిరెడ్డి భవిష్యత్ జీవితం ఆనందమయం కావాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sridevi most beautiful lady in india
Hansika recent interview  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles