The great health benefits with hot water which cures health problems and beauty problems

hot water benefits, the health benefits, health tips, hot water health benefits, health tips, health problems tips, health tips of hot water, drinking hot water, hot water benefits, hot water health benefits, beauty benefits with hot water, hot water beauty benefits

the great health benefits with hot water which cures health problems and beauty problems

వేడినీటితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో...

Posted: 11/04/2014 05:49 PM IST
The great health benefits with hot water which cures health problems and beauty problems

నిజానికి మానవ శరీరానికి నీళ్లు ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. ప్రతిరోజూ నీటిని అధిక మోతాదులో తాగితే శరీరంలో వుండే మలినపదార్థాలు, హానికరమైన క్రిములు అప్పటికప్పుడే మటుమాయమవుతాయి. ముఖ్యంగా కిడ్రీలు ప్రతీసారి శుభ్రమవుతాయి. ఫలితంగా చాలావరకు శరీరరోగాల నుంచి దూరంగా వుండొచ్చు. అయితే వేడినీళ్లు లేదా గోరువెచ్చని నీళ్లను తాగితే మరింత ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. చల్లటి నీళ్లకంటే వేడినీళ్లే మానవ శరీరానికి ఎంతో ప్రయోజనాత్మకంగా పనిచేస్తుందని వాళ్లు చెబుతున్నారు. ప్రతిరోజూ 7 నుంచి 8 గ్లాసుల నీళ్లు ఎంతో ఎఫెక్టివ్ గా వుంటాయని.. చాలావరకు రోగాలు మటుమాయమవుతాయని వాళ్లు వెల్లడిస్తున్నారు. మరి వేడినీటితో కలిగే ఆరోగ్యప్రయోజనాలెంటో తెలుసుకుందాం...

1. దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలు వచ్చినప్పుడు వేడినీటిని తీసుకుంటే... ఇది దాదాపు వాటిని తగ్గించడంలో ప్రముఖపాత్రను పోషిస్తుంది. ముందుగా పొడిదగ్గును తగ్గించి, శ్వాసనాళాన్ని తేలికచేసి, సరైన శ్వాస పీల్చుకునేందుకు సహాయపడుతుంది. అలాగే గొంతునొప్పిని ఓ మోస్తరు వరకు ఉపశమనం కలిగిస్తుంది.

2. వేడి నీటిని నిత్యం తీసుకుంటే.. ఇది అజీర్తి సమస్యను పూర్తిగా తగ్గిస్తుంది. అలాగే శరీరంలో వున్న మలినాలను బయటకు నెట్టివేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వేడినీళ్లు తాగడం వల్ల శరీరంలో వేడిపుట్టి, చెమట పట్టడం ప్రారంభం అవుతుంది. దాంతో శరీరంలో వుండే టాక్సిన్స్ చెమటరూపంలో బయటకు నెట్టివేయబడుతుంది. అంటే.. ఇది డిటాక్సీగా పనిచేస్తుందన్నమాట!

3. క్రమం తప్పకుండా వేడినీళ్లు తీసుకుంటే.. ఇది శరీరాన్ని తేమగా, వెచ్చగా వుంచుతుంది. తద్వారా చర్మ ఆరోగ్య, సౌందర్య సమస్యలు దూరమవుతాయి. శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచి చర్మఛాయను అందిస్తుంది. అంతేకాదు.. ముఖంలో మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా సహాయపడుతుంది. అలాగే జుట్టుకు కావాల్సిన సెల్స్, శక్తిని అందించడంలో గొప్పగా పనిచేస్తుంది. తద్వారా జుట్టురాలే సమస్య తగ్గి, ఇంకా పెరుగుతాయి.

4. వేడినీళ్లు బరువును తగ్గించడంతో ప్రముఖపాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ వేడినీటిని తీసుకుంటే.. శరీరంలో జీవక్రియలను మెరుగుపరుస్తుంది. అలాగే చర్మం కిందిభాగంలో వున్న కొవ్వుకణాలను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది.

5. వృద్ధాప్య సమస్యను నివారించడంలో దీని పాత్ర అమోఘం. ప్రతిరోజూ వేడినీళ్లు తీసుకుంటే శరీరంలో వుండే టాక్సిన్స్ బయటకు నెట్టివేయడం వల్ల చర్మకణాలను రిపేర్ చేస్తుంది. అలాగే హానికరమైన ఫ్రీరాడికల్స్ మీద ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీతో స్కిన్ ఎలాసిటీ పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది.

6. మెనుష్ట్రువల్ క్రాంప్స్ ను నివారించడంలో హాట్ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. వేడినీటిలో కారమ్ విత్తనాలు వేసి తీసుకుంటే.. పీరియడ్స్ సమయంలో పొట్టతిమ్మర్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పీరియడ్స్ సమయంలో వేడినీళ్లు తీసుకుంటే పొట్ట ఉదరభాగంలోని కండరాలు మరింత తేలిక పరిచి, క్రాంప్స్ నుంచి ఉశమనం కలిగిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hot water health benefits  health tips  beauty tips  telugu news  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more