Health benefits with egg

health tips, egg tips, egg curries, health benefits with egg, egg health benefits, egg news, health news

the health benefits with egg which contains nutiens in high level

రోజూ గుడ్డు తినండి.. ఆరోగ్యంగా వుండండి!

Posted: 10/10/2014 05:42 PM IST
Health benefits with egg

మానవ శరీరానికి అవసరమయ్యే పౌష్టికాహారాల్లో గుడ్డు అత్యంతమైనది. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు అందరికీ కావలసిన పోషకవిలువలు గుడ్డులో పుష్కలంగా వుంటాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు కోడిగుడ్డు చాలినన్ని ప్రోటీన్లను అందజేస్తుంది. ప్రతిరోజూ గుడ్డ తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా వుంటారని వైద్యులు కూడా సలహాలిస్తుంటారు. గుడ్డులో వుండే పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించి.. ప్రతియేటా అక్టోబర్ రెండో తేదీన వరల్డ్ ఎగ్ డే నిర్వహించడం కూడా జరుగుతోందంటే.. గుడ్డు ఎంత పౌష్టికాహారమో ఇట్టే తెలిసిపోతుంది. శరీరంలో ప్రతి అవసరం మీద గుడ్డు మంచి ప్రభావం చూపుతుందని నిపుణులు పరిశోధనల ద్వారా కనుగొన్నారు. గుడ్డును కేవలం ఉడికించి తినాలనే ప్రత్యేక నిబంధనలంటూ ఏమీ లేదు.. దానిని ఎన్నిరకాలుగా కావాలంటే అన్ని రకాల కూరలలో వేసుకుని తీసుకోవచ్చు.

గుడ్డులో లభించే పోషక విలువలు ఏ స్థాయిలో వుంటాయనే విషయాన్ని నిపుణులు కొన్ని పరిశోధనల ద్వారా ప్రజలకు తెలియజేశారు. క్యాలరీలు: 70-80, ప్రోటీన్లు : 6 గ్రాములు, క్రొవ్వులు: 5 గ్రాములు, కొలెస్టిరాల్‌: 190 గ్రాములు, నీరు: 87%, గుడ్డులో పలురకాల లవణాలు, అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం, ఐరన్‌, జింక్‌లు వంటి శరీరానికి మేలుచేసే ఎన్నోరకాల పోషక విలువలు కలిగి వుండటం వల్లే దీనిని ప్రతిరోజూ సేవించాలంటూ నిపుణులు బల్లగుద్దిమరీ చెబుతున్నారు. అంతెందుకు.. టీవీల్లో యాడ్ ల ద్వారా గుడ్డు తినాల్సిందిగా ప్రచారాలు ఇప్పటికీ జరుగుతూనే వున్నాయి.

గుడ్డుతో కలిగే ఉపయోగాలు :
1. మానవ శరీరానికి కావలసిన పోషక విలువలు ఇందులో పుష్కలంగా వుంటాయి. ముఖ్యంగా పిల్లల పెరుగుదలకు ఇది చాలా మంచిది.
2. రోజూ గుడ్డు తినడం వల్ల కంటి సమస్యలు చాలావరకు తగ్గి, దృష్టికి ఎంతో మేలు కలుగుతుంది. శుక్లాలు వచ్చే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి.
3. తక్కువ క్యాలరీల (80 క్యాలరీలు) శక్తిని అందిస్తుంది కాబట్టి.. శరీర బరువు అదుపు వుంచుతుంది. డైటింగ్ లో వున్నవారు దీనిని రెగ్యులర్ గా తీసుకుంటే చాలామంచిది.
4. మానవ శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు గుడ్డులో వుంటాయి కాబట్టి.. గుడ్డు తినగానే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. దీంతో పరిమిత ఆహారం తీసుకుని, శరీర బరువును నియంత్రించుకోగలుగుతారు.
5. గుడ్డుతినడం వల్ల గుండెజబ్బులు వస్తాయని గతంలో అపోహలు బాగానే షికార్లు చేశాయి... కానీ అటువంటిదేమీ లేదని తాజాగా నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు.
6. గుడ్డుసొనలో 300 మైక్రోగ్రాముల కోలిన్ అనే పోషక పదార్థం.. మెదడు కణాలను ఆరోగ్యంగా కాపాడటంలో ప్రముఖపాత్రను వహిస్తుంది. మెదడు నుంచి సంకేతాలను వేగంగా చేరవేయడంలో కోలిన్ సహాయపడుతుంది.
7. శరీరానికి కావలసిన ఐరన్ గుడ్డులో పుష్కలంగా లభిస్తుంది. శరీరం ఆ ఐరన్ ను చాలా సులభంగా గ్రహిస్తుంది. అది గర్భిణీస్త్రీలకు, బాలింతలకు ఎంతో మేలు చేస్తుంది.
8. ప్రతిరోజు గుడ్డు తీసుకోవడం వల్ల లైపిడ్స్ లో ఎటువంటి మార్పులు రావడని.. శరీరానికి మేలు చేసే కొలెస్టిరాల్ శాతం పెరుగుతుందని తేలింది.
9. నిపుణులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఒక వారంరోజుల వరకు గుడ్డును ఆహారంగా తీసుకున్న స్త్రీలకు.. రొమ్ము క్యాన్నర్ బారిన పడే అవకాశం 44 శాతం తగ్గినట్లు తేలింది.
10. గుడ్డులో వుండే సల్ఫర్, పలురకాల విటమిన్లు, లవణాల వల్ల శిరోజాలకు మంచి పోషణ లభిస్తుందని.. యవ్వనంలో కండరాలకు బలం ఎక్కువ ఏర్పడుతుంది, మనుషుల గోళ్లకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుందని తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : egg  health tips  health news  telugu news  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more