వివాహం చేసుకున్న కొత్త జంటలు కొన్నాళ్లవరకు తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. ఒకరి విషయంలో మరొకరు మనస్ఫూర్తిగా సహాయం చేసుకుంటూ.. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. కానీ ఇదే జీవితాన్ని జీవితాంతం కొనసాగించడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులైతే ఘోరంగా పరాజయం పాలవుతున్నారు.
వైవాహిక జీవితం సుఖాంతంగా జీవితాంతం గడపాలంటే ముందుగా ఒకరిమీద ఇంకొకరికి పూర్తిగా నమ్మకం వుండాలి. స్వార్థపరమైన వ్యవహారాలు చేయకుండా కలిసిమెలిసి ప్రతి చిన్న విషయాన్ని పంచుకోవాలి. ఆర్థిక పరమైన సమస్యలు ఎదురైనప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి.
అనవసరమైన అనుమానాలకు దారితీయకుండా తమ మనసులో వున్న అన్ని విషయాలను చెప్పుకోవాలి. చిన్నచిన్న సమస్యలు ఎదురైనప్పుడు దానిగురించి గొడవ పడకుండా కలిసిమెలిసి పరిష్కరించే మార్గాలను వెదుక్కోవాలి.
ఇద్దరూ తమ మధ్య వున్న దూరాన్ని తగ్గించుకోవాలంటే ఒకరికొకరు గౌరవించుకోవాలి. తమతమ మనస్థత్వాలు దెబ్బతినకుండా ఒకరినొకరు విమర్శించుకోకూడదు. సాధ్యమైనంతవరకు ఇద్దరు కలిసి వుండేందుకు ఎక్కువ సమయాన్ని కేటాయించుకోవాలి.
భార్యాభర్తలు జీవితాంతం సుఖంగా వుండడానికి మరికొన్ని చిట్కాలు :
1. ముందుగా అబ్బాయిలు తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలి. భార్యతో తన నడవడికను మార్చుకోవాలి. ప్రతి చిన్న విషయానికి చిరాకుపడకుండా, తనతో అమర్యాదగా ప్రవర్తించకుండా వుండాలి. అలాగే భార్య కూడా తన భర్త మీద చిన్నచిన్న విషయాల గురించి గొడవలు పడకుండా వాటిని కలిసి పరిష్కరించుకోవాలి. వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసుకోకుండా గౌరవంతో పలకరించుకుంటే చాలు.. భాగస్వామి తనలో వుండే కోపాన్ని దిగమింగుకుంటారు.
2. వివాహం అయిన తరువాత జంటలు తమ జీవితంలో ప్రశాంతతను కోరుకుంటారు. అటువంటి సమయాల్లో మీరు మీ మనసులోని భావాలను వారితో పంచుకుంటే మీలో వారికి గౌరవం పెరుగుతుంది. భార్యలు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తే ఒకరిమధ్య ఇంకొకరికి అనుమానాలు రాకుండా ప్రశాంతంగా తమ జీవితాన్ని గడపవచ్చు.
3. ఏవిధంగా అయితే భార్య భర్తకోసం అన్ని పనులు చేసి, తయారుచేస్తుందో.. అదేవిధంగా భర్త కూడా తన సంతోషాలను తెలుసుకుని వాటిని సమకూర్చేందుకు ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆమెకు మీమీద ప్రేమతోబాటు, గౌరవం కూడా పెరుగుతుంది.
4. భార్యభర్తలు కలిసిమెలిసి జీవితాంతం సుఖంగా వుండాలంటే.. ఇద్దరు ఏకాంతంగా గడపడం చాలా ముఖ్యం. అప్పుడే ఒకరికొకరు చాలా దగ్గరవుతారు. ప్రశాంతమైన ప్రదేశాలలో ఇద్దరు కలిసి గడిపితే తమ మధ్య ఎటువంటి వైరాలు ఏర్పడవు.
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more